Hyderabad: హైదరాబాదీలకు గుడ్ న్యూస్.. ట్రాఫిక్ వ్యవస్థలో ఏఐ వాడకంతో తగ్గనున్న నిరీక్షణ..!

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ క్రమంగా అన్ని రంగాల్లో విస్తరిస్తోంది. ఏఐ ద్వారా మనులు చేసే పని తగ్గుతుందని చెబుతున్నారు. అందుకే ఏఐ వాడకానికి ప్రాముఖ్యత ఉస్తున్నారు. తాజాగా హైదరాబాద్ లో ఉన్న ట్రాఫిక్ సిగ్నల్లు ఏకీకృతం చేయాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. భారీ వర్షాల సమయంలో ట్రాఫిక్ నియంత్రించడంతో సహా ట్రాఫిక్ నిర్వహణను మెరుగుపరచడానికి ఏఐ (AI)ని ఉపయోగించాలని చెప్పారు. బుధవారం ఎంసీఆర్ హెచ్‌ఆర్‌డి ఇన్‌స్టిట్యూట్‌లోని బోధి పెవిలియన్‌లో అనలాగ్ ఏఐ వ్యవస్థాపకుడు, సీఈఓ అలెక్స్ కిప్‌మన్, మేఘా ఇంజనీరింగ్ & ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ (MEIL) మేనేజింగ్ డైరెక్టర్ పీవీ కృష్ణారెడ్డితో జరిగిన సమావేశంలో ఈ ప్రతిపాదనపై చర్చించినట్లు తెలుస్తోంది.

ముఖ్యమంత్రి సమక్షంలో అనలాగ్, మెయిల్ ఒక అవగాహన ఒప్పందంపై సంతకాలు చేశాయి. ఈ సందర్భంగా హైదరాబాద్ లో ట్రాఫిక్ సవాళ్లను ఎదుర్కొవడానికి ఫిజికల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీలను ఉపయోగించాలని రేవంత్ రెడ్డి సూచించారు. హైదరాబాద్ రవాణా వ్యవస్థలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సమర్థవంతంగా వినియోగించాలన్నారు. ట్రాఫిక్ నిర్వహణకు సంబంధించి ఒక పైలట్ ప్రాజెక్ట్ గురించి అనలాగ్ ప్రతినిధులు సీఎం రేవంత్ రెడ్డికి వివరించారు. ట్రాఫిక్ సమస్యలు తీర్చడానికి ఏఐ టెక్నాలజీ ఎలా ఉపయోగించుకోవాలో తెలిపారు.

AI

ఏఐ, సెన్సార్లు, రోబోటిక్స్‌ను కలిపి ఉపయోగించే ఫిజికల్ ఇంటెలిజెన్స్, సురక్షితమైన, మరింత ప్రతిస్పందించే రవాణా వ్యవస్థలను నిర్మించడంలో సహాయపడుతుందని అనలాగ్ సీఈఓ కిప్ మన్ తెలిపారు. రద్దీని బట్టి ట్రాఫిక్ సిగ్నళ్లను స్పందిస్తాయని పేర్కొన్నారు. కూడళ్ల వద్ద ట్రాఫిక్ సిగ్నల్ పడినప్పుడు ఒక పక్క ట్రాఫిక్ ఉండదు. అప్పుడు సిగ్నల్ పడితే మిగతావారు ఆగాలి. అయితే ఏఐ వల్ల రద్దీని బట్టి సిగ్నల్స్ పడతాయని వివరించారు. ట్రాఫిక్ వ్యవస్థలోనే కాకుండా ఇతర శాఖల్లో ఏఐ వాడవచ్చని తెలిపారు.

నీటి లీకేజీలు తీవ్రం కాకముందే గుర్తించడం, డిమాండ్‌కు అనుగుణంగా విద్యుత్ సరఫరాను ఆప్టిమైజ్ చేయడం, అత్యవసర పరిస్థితుల్లో అంబులెన్సులు, అగ్నిమాపక సేవలకు మార్గాలను క్లియర్ చేయడం వంటివి ఈ టెక్నాలజీ ద్వారా సాధ్యపడతాయని పేర్కొన్నారు. ప్రభుత్వ కార్యకలాపాలను మెరుగుపరచడం, పౌర సేవలను బలోపేతం చేయడం, వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల కోసం డేటా ఆధారిత మౌలిక సదుపాయాల ప్రణాళికకు ఈ టెక్నాలజీ ఉపయోగపడుతుందని అన్నారు.

అయితే హైదరాబాద్ ట్రాఫిక్ సమస్యతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా పీక్ అవర్స్ చాలా సేపు నరీక్షించాల్సి వస్తుంది. అయితే ఏఐని వాడడం వల్ల సమస్య తగ్గే అవకాశం నిపుణులు భావిస్తారు. కాగా ఈ భేటీలో ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు జూపల్లి కృష్ణా రావు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్సి సంజయ్ జజు, ప్రభుత్వ సహాదారు రామకృష్ణా రావు పాల్గొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+