Rythu Bharosa: తెలంగాణ రైతులకు సీఎం రేవంత్ రెడ్డి శుభవార్త చెప్పారు. చాలా కాలంగా రైతు భరోసా డబ్బు కోసం నిరీక్షిస్తున్న కోట్ల మంది అన్నదాతలకు సీఎం ప్రకటన పెద్ద ఊరటను కలిగించింది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలో భాగంగా ఒక్కో రైతు ఖాతాలో రూ.15 వేలు వేస్తామని క్లారిటీ ఇచ్చారు. దీనికి సంబంధించి విధివిధానాలపై అసెంబ్లీలో చర్చించనున్నట్లు రేవంత్ ప్రకటించారు.
జనవరిలో సంక్రాంతి పండుగ తర్వాత రైతులకు హామీ ఇచ్చినట్లుగానే రైతు భరోసా సొమ్మును అన్నదాతల ఖాతాల్లో జమచేస్తామని చెప్పారు. ఎవరు అడ్డుపడినా రైతు భరోసా కార్యక్రమాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు తీసుకెళుతుందని పేర్కొన్నారు. ఈ విషయంలో ప్రజలు ఎలాంటి అపోహలు నమ్మెుద్దని, అనుమానాలు అస్సలు పెట్టుకోవద్దని క్లారిటీ ఇచ్చారు. దీనిపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నేతృత్వంలో కేబినెట్ సబ్ కమిటీ వేశామని, కమిటీ ఇచ్చిన నివేదికను శీతాకాల అసెంబ్లీ సమావేశాల్లో చర్చించనున్నట్లు తెలిపారు. ఈలోపు మారీచుడు వంటి రాక్షసులు చెప్పే తప్పుడు మాటలను ప్రజలు నమ్మెుద్దని ప్రతిపక్షాలపై ఘాటు విమర్శలు చేశారు.

వాస్తవానికి గతంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం రైతు బంధు పేరుతో రైతులకు రూ.10,000 చొప్పున సాయం అందించిన సంగతి తెలిసిందే. అయితే కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రైతులకు స్కీమ్ కింద రూ.5000 ఇస్తూ వచ్చింది. కానీ పథకంలో అక్రమాలు ఉన్నాయని పేర్కొంటూ రేవంత్ సర్కార్ స్కీమును పూర్తిగా ఆపివేయటంతో రైతన్నల్లో ఆందోళన పట్టుకుంది. దీని స్థానంలో రైతు భరోసా స్కీమ్ తెస్తామని చెప్పిన ప్రస్తుత ప్రభుత్వం అందుకోసం సర్వేలు కూడా చేసింది. అయితే చాలా కాలం గడుస్తున్నా స్కీముపై క్లారిటీ లేకపోవటంతో రైతన్నలతో పాటు అటు ప్రతిపక్షాల నుంచి కూడా ప్రభుత్వంపై దాడి మెుదలైంది. పంట సీజన్లు మారుతున్నా పథకంపై ప్రభుత్వం క్లారిటీ ఇవ్వకపోవటం చాలా మందిని నిరాశకు గురిచేసింది. దీంతో నేడు స్వయంగా సీఎం రేవంత్ రెడ్డీ దీనిపై క్లారిటీ ఇచ్చేందుకు రంగంలోకి దిగారు.
తెలంగాణ వ్యాప్తంగా వరి సన్నాలు పండిస్తే రైతులకు బోనస్ చెల్లిస్తామని సీఎం రేవంత్ స్పష్టం చేసారు. ఈ సన్నాలను రాష్ట్రంలోని హాస్టల్స్ కే వినియోగిస్తామని అన్నారు. తాము ప్రకటించిన విధంగా నిర్దిష్ట సమయంలో రూ.2 లక్షల వరకు రుణాలు తీసుకున్న 25 లక్షల మంది రైతులకు రుణ మాఫీ అమలు చేసామని, సాంకేతిక కారణాల కారణంగా నిలిచిపోయిన వారికి కూడా దీనిని పూర్తి చేస్తామని పేర్కొన్నారు. రైతులకు వెన్నుగా నిలిచేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు చేపడుతోందని సీఎం హామీ ఇచ్చారు.
More From GoodReturns

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

బెంగళూరులో తీవ్రమైన ఎల్పీజీ సంక్షోభం..సగం గ్యాస్ స్టేషన్లు మూత..ఆటో డ్రైవర్లు విలవిల..

Bengaluru: బెంగళూరులో రియల్ ఎస్టేట్ మంట! మైసూరు నెక్స్ట్ టెక్ హబ్‌గా మారుతుందా?

Gold silver: బంగారం ధరలకు రెక్కలు వస్తాయా? విదేశాల నుంచి వచ్చే జ్యువెలరీపై మోడీ సర్కార్ ఆంక్షలు!

అమెరికా అధ్యక్ష రేసులో తెలుగింటి అల్లుడు.. ట్రంప్ మీద 25వ సవరణ ప్రయోగిస్తారా.. సాధ్యాసాధ్యాలు ఎలా ఉన్నాయంటే..



Click it and Unblock the Notifications