బెంగుళూరును ఛాలెంజ్ చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి... ఐటీ వ్యూహం 2.0 ఇదే..

హైదరాబాద్‌లో భారతదేశపు మొట్టమొదటి గూగుల్ సేఫ్టీ ఇంజనీరింగ్ సెంటర్ (జిఎస్‌ఇసి)ని స్థాపించేందుకు గూగుల్ కట్టుబడి ఉందని తెలంగాణ ప్రభుత్వం గూగుల్‌తో ఈరోజు కీలకమైన ఒప్పందాన్ని కుదుర్చుకుంది. డబ్లిన్, మ్యూనిచ్, మాలాగా, టోక్యో తర్వాత ఎపిఎసి ప్రాంతంలో ఇలాంటి సౌకర్యాలతో హైదరాబాద్‌లోని జిఎస్ఈసి ప్రపంచంలోనే ఐదవది.

ఈ GSEC అనేది ఒక ప్రత్యేకమైన అంతర్జాతీయ సైబర్ సెక్యూరిటీ హబ్. అడ్వాన్స్డ్ సెక్యూరిటీ, ఆన్‌లైన్ సేఫ్టీ ప్రొడక్ట్స్ అభివృద్ధి చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది. డిజిటల్ పర్యావరణ వ్యవస్థను సురక్షితం చేయడంలో ప్రపంచ ప్రయత్నాలకు సహకరిస్తూ భారతదేశం అంతటా వ్యాపారాలు, ప్రభుత్వాలు, వ్యక్తులకు డిజిటల్ భద్రతను పెంపొందించడంలో జిఎస్‌ఇసి కీలక పాత్ర పోషిస్తుంది.

CM Revanth closes big Google selects Hyderabad to establish Safety Engineering Centre

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం అండ్ గూగుల్ మధ్య నెలల తరబడి చర్చలు, సహకారంతో ఈ ప్రకటన వెలువడింది. యునైటెడ్ స్టేట్స్‌లోని కంపెనీ ప్రధాన కార్యాలయంలో ముఖ్యమంత్రి, తెలంగాణ ఐటీ అండ్ పరిశ్రమల శాఖ మంత్రి డి శ్రీధర్ బాబు, గూగుల్ ఎగ్జిక్యూటివ్‌లతో గత ఆగస్టు 2024లో కీలకమైన సమావేశంతో సహా తీవ్రమైన చర్చల తర్వాత ఈ భాగస్వామ్యం అధికారికం చేసింది.

ఈ ల్యాండ్‌మార్క్ ప్రాజెక్ట్ కోసం గూగుల్ హైదరాబాద్‌ను సెలెక్ట్ చేయడం మాకు చాలా గర్వకారణంగా ఉందని ముఖ్యమంత్రి వ్యక్తం చేశారు. ఈ భాగస్వామ్యం ఐటి, ఇన్నోవేషన్‌లో గ్లోబల్ లీడర్‌గా హైదరాబాద్ స్థాయిని చూపిస్తుంది. జిఎస్ఈసితో మేము హైదరాబాద్‌ను టెక్ హబ్‌గా మాత్రమే కాకుండా సైబర్‌ సెక్యూరిటీ ఎక్సలెన్స్‌కు గ్లోబల్ సెంటర్‌గా తీసుకొస్తున్నారు.

హైదరాబాద్ జిఎస్ఈసి ప్రత్యక్షంగా పరోక్షంగా వేలాది మందికి ఉపాధి అవకాశాలను సృష్టిస్తుందని, నగరానికి టాప్ సైబర్ సెక్యూరిటీ ఎక్స్పర్ట్స్, పరిశోధకులను ఇంకా ఇంజనీర్లను ఆకర్షిస్తుంది. దీనికి తోడు ఈ సెంటర్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఈజీ చేస్తుంది, భారతదేశ డిజిటల్ మౌలిక సదుపాయాలు, సైబర్ సెక్యూరిటీ సామర్థ్యాలను మరింత బలోపేతం చేస్తుంది అని అన్నారు.

టెక్ అండ్ ఇన్నోవేషన్‌కు గ్లోబల్ హబ్
గూగుల్, మైక్రోసాఫ్ట్, యాపిల్, అమెజాన్, మెటా వంటి ప్రముఖ గ్లోబల్ టెక్ దిగ్గజాలు ఉన్న భారతదేశ టెక్నాలజీ ల్యాండ్‌స్కేప్‌లో హైదరాబాద్ చాలా కాలంగా ముందంజలో ఉంది. ఈ కొత్త భాగస్వామ్యం డిజిటల్ ఇన్నోవేషన్ అండ్ సెక్యూరిటీలో అగ్రగామి నగరంగా స్థానాన్ని పటిష్టం చేస్తుంది.

"సేఫ్టీ ఇంజనీరింగ్, డిజిటల్ సెక్యూరిటీకి హైదరాబాద్ ప్రపంచ రాజధానిగా ఎదగడానికి జిఎస్ఈసి సహాయం చేస్తుంది. ఈ సదుపాయం సైబర్‌ సెక్యూరిటీలో నూతన ఉతేజాన్ని పెంపొందిస్తుంది, స్కిల్స్ దేవలప్మేంట్, రీసర్చ్, ఉద్యోగాలు కల్పించేందుకు కొత్త అవకాశాలను అందిస్తుంది. హైదరాబాద్ అభివృద్ధి అలాగే డిజిటల్ భవిష్యత్తుపై సిఎం రేవంత్ రెడ్డి ముందు చూపు మా విజన్‌కి నిజంగా ఉత్తేజకరమైనది అని గూగుల్‌ చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ (CIO) రాయల్ హాన్సెన్ అన్నారు.

తెలంగాణను 1 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చాలన్న రేవంత్ రెడ్డి దృక్పథంలో జిఎస్‌ఇసి ఏర్పాటుకి ఒక కీలక మైలురాయిగా పరిగణించవచ్చు. ఈ విజన్‌లో భాగంగా వాతావరణ మార్పు, పట్టణాభివృద్ధి ఇంకా డిజిటల్ సెక్యూరిటీ వంటి క్లిష్టమైన సవాళ్లను పరిష్కరించడానికి లేటెస్ట్ టెక్నాలజీ ఉపయోగించుకోవడంపై తెలంగాణ ప్రభుత్వం దృష్టి సారించింది. తెలంగాణకు సురక్షితమైన భవిష్యత్తును నిర్మించే దిశగా గూగుల్‌తో ఈ భాగస్వామ్యాన్ని ఒక ముఖ్యమైన దశగా భావిస్తున్నామని, మా టి-ఫైబర్ ప్రారంభం 47 లక్షల గ్రామీణ గృహాలను హై-స్పీడ్ ఇంటర్నెట్‌తో కనెక్ట్ చేయాలనే లక్ష్యంతో ఉంది, ఇప్పుడు సేఫ్ ఆండ్రాయిడ్ టీవీ అండ్ స్మార్ట్ హోమ్ టెక్నాలజీ ద్వారా రక్షించబడుతుంది" అని ముఖ్యమంత్రి అన్నారు.

జిఎస్ఈసితో పాటు తెలంగాణ, గూగుల్ వివిధ రంగాలలో మరింత సహకారాన్ని చూస్తున్నాము. వీటిలో హైదరాబాదులో క్లౌడ్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కూడా ఉంది. నగరం అంతటా ట్రాఫిక్ మేనేజ్మెంట్ సెట్ చేయడానికి గూగుల్ మ్యాప్స్ అండ్ రియల్-టైం ఎఐ అనాలిసిస్ ద్వారా ఇంటెలిజెంట్ ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ సిస్టమ్‌ను రూపొందించడాన్ని కూడా ఈ భాగస్వామ్యం ద్వారా చూస్తుంది. గూగుల్ స్టార్టప్ హబ్ అండ్ ఎఐ, సైబర్ సెక్యూరిటీ స్కిల్స్ పెంపొందించే లక్ష్యంతో ప్రోగ్రామ్స్ ద్వారా ఎడ్యుకేషన్, స్కిల్స్ డెవల్పమెంట్ మెరుగుపరచడానికి తెలంగాణ ప్రభుత్వంతో మరింతగా సహకరించాలని గూగుల్ చూస్తోంది.

సేఫ్టీ ఇంజినీరింగ్‌కు గ్లోబల్ సెంటర్‌గా హైదరాబాద్‌ మారే అవకాశం ఉంది, ఈ ట్రాన్స్ఫర్మేషన్లో భాగమైనందుకు మేము సంతోషిస్తున్నాము. ఈ పార్ట్నర్షిప్ సక్సెస్ చేయడంలో సహకరించినందుకు హైదరాబాద్‌లోని గ్లోబల్ గూగుల్ టెక్ వీపీ అరిజిత్ సర్కార్, గూగుల్ ఇండియా ప్రభుత్వ వ్యవహారాల మేనేజింగ్ డైరెక్టర్ శ్రీనివాస రెడ్డితో సహా గూగుల్ ఎగ్జిక్యూటివ్‌లకు రేవంత్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. ఇది ప్రారంభం మాత్రమే. హైదరాబాద్‌ను ప్రపంచంలోనే అత్యంత తెలివైన, సురక్షితమైన నగరాల్లో ఒకటిగా మార్చడానికి గూగుల్ ఇంకా ఇతర గ్లోబల్ పార్టనర్‌లతో సహకరించుకోవడానికి మేము మరిన్ని అవకాశాల కోసం ఎదురుచూస్తున్నాము, "అని సీఎం రేవంత్ అన్నారు.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+