ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మరో చారిత్రాత్మక ఘట్టానికి వేదిక కాబోతోంది. రాష్ట్ర పారిశ్రామిక రంగాన్ని మలుపు తిప్పే విధంగా అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం రాజయ్యపేట వద్ద 'ఆర్సిలర్ మిట్టల్ నిప్పన్ స్టీల్ ఇండియా' (AMNS India) రాబోతోంది. దీని గురించి పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.
అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం రాజయ్యపేట వద్ద భారీ స్టీల్ ప్లాంట్ ప్రాజెక్టుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేపు (మార్చి 23న) శంకుస్థాపన చేయనున్నారు. అమరావతి (Amaravati) నుండి ప్రత్యేక హెలికాప్టర్‌లో సీఎం, కేంద్ర మంత్రులు, పారిశ్రామిక దిగ్గజాలు ఈ ప్రాజెక్టు శంకుస్థాపను రానున్నారు.

లక్ష మందికి ఉపాధి అవకాశాలు!
ఈ ప్రాజెక్ట్ కేవలం ఒక ఫ్యాక్టరీ మాత్రమే కాదు, ఇది రాష్ట్ర నిరుద్యోగ యువతకు ఒక వరం. దాదాపు రూ. 1,35,964 కోట్ల భారీ పెట్టుబడితో ఏర్పాటు చేస్తున్న ఈ గ్రీన్‌ఫీల్డ్ స్టీల్ ప్లాంట్ ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా సుమారు ఒక లక్ష మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. ఏడాదికి 17.8 మిలియన్ మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో రెండు దశల్లో ఈ ప్లాంట్‌ను అభివృద్ధి చేయనున్నారు.
రియల్ ఎస్టేట్, వ్యాపార వృద్ధి
నక్కపల్లి ప్రాంతంలో ఈ స్థాయి భారీ పరిశ్రమ రావడం వల్ల చుట్టుపక్కల ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ రంగానికి భారీ డిమాండ్ ఏర్పడనుంది. విశాఖపట్నం ఎకనామిక్ రీజియన్ (VER) ఒక మెగా ఇండస్ట్రియల్ హబ్‌గా మారబోతోంది. ప్లాంట్ నిర్మాణానికి అవసరమైన అనుబంధ పరిశ్రమలు, సర్వీస్ సెంటర్లు రావడం వల్ల స్థానిక వ్యాపారాలు ఊపందుకుంటాయి. స్టీల్ ప్లాంట్ మోడల్‌ను పరిశీలించిన అనంతరం సీఎం పలు కీలక ఒప్పందాలపై (MoUs) సంతకాలు చేయనున్నారు.
రవాణా, మౌలిక సదుపాయాల విప్లవం
ఈ ప్రాజెక్టును విజయవంతం చేసేందుకు ప్రభుత్వం రవాణా వ్యవస్థపై ప్రత్యేక దృష్టి సారించింది. ప్లాంట్‌ను జాతీయ రహదారి (NH-16)కి అనుసంధానిస్తూ అత్యాధునిక ఫోర్-లేన్ రోడ్డును అభివృద్ధి చేస్తున్నారు. అంతేకాకుండా, రూ. 11,198 కోట్ల అదనపు పెట్టుబడితో 50 మిలియన్ మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల 'సొంత పోర్టు'ను కూడా AMNS నిర్మిస్తోంది. దీనివల్ల ఎగుమతి, దిగుమతులు సులభతరం కావడమే కాకుండా, రవాణా రంగంలో మరో 6,000 మందికి కొత్తగా ఉద్యోగాలు వస్తాయి.
ఏదేమైనా అమరావతి (Amaravati) వేదికగా ఏపీని పారిశ్రామిక గమ్యస్థానంగా మార్చాలని సంకల్పించిన ప్రభుత్వం.. ఈ స్టీల్ ప్లాంట్‌తో ఒక పెద్ద విజయాన్ని అందుకుంది. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి హెచ్‌డీ కుమారస్వామి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ వంటి ప్రముఖులు పాల్గొంటున్నారు. లక్ష్మీ మిట్టల్ వంటి ప్రపంచ స్థాయి పారిశ్రామికవేత్తలు ఏపీకి రావడం రాష్ట్ర భవిష్యత్తుపై నమ్మకాన్ని పెంచుతోంది. ఈ ప్రాజెక్ట్ పూర్తయితే ఏపీ స్టీల్ మార్కెట్‌లో అగ్రగామిగా నిలవడం ఖాయం.
More From GoodReturns

Gold silver: బంగారం, వెండి కొనాలా? వద్దా? మార్కెట్‌లో వింత పరిస్థితి.. నిపుణుల సలహా ఇదే!

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్‌లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

6 వేల డాలర్ల మార్క్ దాటబోతున్న బంగారం ధర.. డాలర్ విలువ ఖేల్ ఖతం.. ప్రపంచ రారాజుగా పసిడి..

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు పసిడి రేటు ఎంత వరకు తగ్గిందంటే.. ఏప్రిల్ 13, సోమవారం ధరలు ఇవే..

బెంగళూరులో రూ. 5 వేలకే రూమ్..ఈ ఏరియాలోకి రమ్మని పిలుస్తున్న ఇంటి ఓనర్లు..

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

విజయవాడ నుంచి హైదరాబాద్‌కు గంటే ప్రయాణం.. 220 కి.మీ స్పీడ్‌తో కొత్త రైలు.. వందే భారత్ కన్నా ఫాస్ట్..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?



Click it and Unblock the Notifications