Amaravati Drone Summit 2024: టెక్ సావీ ముఖ్యమంత్రిగా పేరున్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రస్తుతం డ్రోన్ టెక్నాలజీపై తన దృష్టిని పెట్టారు. ఈ క్రమంలో మంగళగిరిలోని సీకే కన్వెన్షన్‌లో రెండు రోజుల పాటు అమరావతి డ్రోన్ సమిట్ పేరుతో సమిట్ ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఏపీలో రాజధాని అమరావతిని దేశానికి డ్రోన్ క్యాపిటల్‌గా మార్చాలని సీఎం చూస్తున్నారు.
ఈ కార్యక్రమంలో 40 ఎగ్జిబిటర్లు దాదాపు 5000 వేల రకాల డ్రోన్లను ప్రదర్శించారు. ఈ సందర్భంగా నేడు విజయవాడ పున్నమి ఘాట్ వద్ద ప్రత్యేకంగా డ్రోన్ షో ఏర్పాటుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఏపీ డ్రోన్ కార్పొరేషన్ ఎండీ దినేష్ కుమార్ వెల్లడించారు. ఈ కార్యక్రమానికి దాదాపు 1000 మంది హాజరైనట్లు వెల్లడైంది. దీనికి కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు హాజరయ్యారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వినూత్న విజన్‌తో పాటు ఎల్లప్పుడూ కొత్త ఆలోచనలతో వచ్చే ఆయన దూరదృష్టిని కొనియాడారు. ప్రస్తుతం దేశంలో మెుత్తం విమానాశ్రయాల సంఖ్య 157గా ఉన్నాయని రాబోయే 20 ఏళ్లలో వీటి సంఖ్యను 200కి పెరగొచ్చని అన్నారు.

ఐటీ రంగంలో ఇండియా ప్రపంచంలో చెరగని ముద్రవేసుకుని ముందుకు సాగుతోందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ఇటీవల విజయవాడ వరదల సమయంలో బాధితులకు సాయం అందించటంలో డ్రోన్లు అద్భుత పనితీరును కనబరిచాయని ఈ సందర్భంగా గుర్తుచేశారు. 1995లో తొలిసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన సమయంలో తాను హైదరాబాదులో ఐటీ రంగానికి బాటలు వేసి పీపీపీ పద్ధతిలో హైటెక్ సిటీని నిర్మించిన విషయాన్ని వెల్లడించారు. ఆ సమయంలో వారాల పాటు అమెరికాలో సీఈవోలను కలిసి ఇక్కడి అవకాశాలను వారికి వెల్లడించిన రోజులను సీఎం గుర్తుచేసుకున్నారు. ఆ కృషి కారణంగా ప్రస్తుతం దేశంలోని ఐటీ రంగంలో పనిచేస్తున్న టెక్కీల్లో దాదాపు 30 శాతం మంది తెలుగువారేనని వెల్లడించారు.
అమరావతి డ్రోన్ సమ్మిట్-2024ను ప్రారంభించిన సీఎం చంద్రబాబు గారు. డ్రోన్ సమ్మిట్ కు హాజరైన కేంద్రమంత్రి రామ్మోహన్, మంత్రులు బీసీ జనార్థన్ రెడ్డి, అనిత, అచ్చెన్నాయుడు, సంధ్యారాణి.మంగళగిరిలోని సీకే కన్వెన్షన్ లో రెండ్రోజులపాటు జరగనున్న డ్రోన్ సమ్మిట్. అమరావతి డ్రోన్ సమ్మిట్ లో… pic.twitter.com/6AtFZs1Gsq
— Telugu Desam Party (@JaiTDP) October 22, 2024
మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా మనం మారాలని నమ్ముతున్న సీఎం చంద్రబాబు.. ప్రస్తుతం నిజమైన సంపద డేటా అని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే భవిష్యత్తు టెక్నాలజీగా మారనున్న డ్రోన్లను వ్యవసాయ, మౌలిక రంగాలు, వైద్య రంగాలతో పాటు నగరాల్లో ట్రాఫిక్ నియంత్రణకు డ్రోన్లను విరివిగా ఉపయోగించటానికి అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. రోగులకు డ్రోన్ల ద్వారా ఇంటికే మందులు, వైద్య సేవలను అందించటానికి తోడ్పడుతుందన్నారు. దేశంలో డ్రోన్ల వినియోగంపై ఉన్న ఆంక్షలు సరళీకృతం అవుతున్నాయని చంద్రబాబు ఈ సంద్భంగా వ్యక్తం చేశారు. ఇప్పటికే డ్రోన్లను మిలిటరీలో రక్షణకు సైతం వినియోగిస్తున్న సంగతి తెలిసిందే. డ్రోన్ టెక్నాలజీ భవిష్యత్తులో గేమ్ చేంజర్ అని, దీనిపై ఇప్పుడు దృష్టి సారించాల్సిన అవసరం ఉందని ఏపీ సీఎం పేర్కొన్నారు.
డ్రోన్ టెక్నాలజీ వినియోగంలో వచ్చే రెండేళ్లలో దేశంలోనే ఆంధ్రప్రదేశ్‌ను అగ్రగామిగా నిలిచేలా ప్రణాళికల రూపకల్పన జరుగుతోందని తెలుస్తోంది. అమరావతి డ్రోన్ సమిట్లో దీనికి అనూహ్య స్పందన రావడంతో హ్యాకథాన్‌లో ప్రతిపాదించిన 9 థీమ్స్‌ను నాలుగు కేటగిరీలుగా విభజించారు. ఒక్కో కేటగిరీలో మెుదటి ముగ్గురు విజేతలకు రూ.3 లక్షలు, రూ.2 లక్షలు, రూ.లక్ష చొప్పున బహుమతి అందించనున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే సాయంత్రం 6.30-8 గంటల వరకు డ్రోన్ల ప్రదర్శన కృష్ణ నది తీరంలో జరగనున్నట్లు తెలుస్తోంది.
More From GoodReturns

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

టీసీఎస్ ఉద్యోగుల షాకింగ్ నిర్ణయం: కంపెనీని వదిలేసి వెళ్లిపోతున్నారు..ఎందుకంటే...



Click it and Unblock the Notifications