బిజినెస్ అంటే కేవలం లాభాలకే పరిమితం కాదు, సమాజానికి విలువలు సృష్టించడమూ అంతే ముఖ్యం అని సీఎం చంద్రబాబు నాయుడు చెప్పిన మాటలు యువతకు కొత్త ఉత్సాహం ఇచ్చాయి. ఆయన ఇచ్చిన సందేశం చాలా స్పష్టంగా ఉంది. ప్రపంచం ముందు ఆంధ్రప్రదేశ్ పేరు వినిపించాలి, 'ఆంధ్ర-ప్రెన్యూర్స్' అనే గ్లోబల్ ఐడెంటిటీని సృష్టించాలి.
"ఇక్కడ తయారు చేసే ప్రోడక్ట్స్ ప్రపంచ స్థాయికి తగ్గట్టు ఉంటే, ఆంధ్రప్రదేశ్ పేరు కూడా గ్లోబల్ బ్రాండ్‌గా మారుతుంది" ఇదే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు యువ పారిశ్రామికవేత్తలకు చెప్పిన మెసేజ్.

ఉండవల్లిలో యువ ఎంట్రప్రెన్యూర్స్‌తో మాట్లాడిన ఆయన, "ఇండస్ట్రీలతో సంపద మాత్రమే కాదు, సమాజానికి ఉపయోగపడే విలువలను కూడా సృష్టించండి" అని సూచించారు. అగ్రో ప్రాసెసింగ్ నుంచి పర్యాటకం వరకు, డిఫెన్స్ నుంచి ఎలక్ట్రానిక్స్ వరకు అనేక రంగాల్లో ఇప్పుడు డోర్లు ఓపెన్ అయ్యాయని ఆయన వివరించారు. ముఖ్యంగా లాజిస్టిక్స్, స్పేస్, టెక్ రంగాల్లో యువత ఆలోచిస్తే "ఆంధ్ర-ప్రెన్యూర్స్" అనే కొత్త ఐడెంటిటీ క్రియేట్ అవుతుందని చెప్పారు.
రాష్ట్రంలో త్వరలోనే భారీ మౌలిక సదుపాయ ప్రాజెక్టులు రూపుదిద్దుకోబోతున్నాయి. విశాఖపట్నం-చెన్నై నాలుగు లైన్ రైల్వే ప్రాజెక్ట్ పూర్తయ్యాక ప్రాంతీయ కనెక్టివిటీ పూర్తిగా మారిపోనుంది. అలాగే అమరావతి-హైదరాబాద్-బెంగళూరు-చెన్నై కారిడార్ దేశంలోనే అతిపెద్ద ఇండస్ట్రియల్ కారిడార్‌గా ఎదగబోతోంది. గ్రీన్ ఎనర్జీ కారిడార్ ఏర్పాటుతో పాటు, విశాఖలో గూగుల్ అతిపెద్ద డేటా సెంటర్ స్థాపన రాష్ట్ర ఇమేజ్‌ను మరో స్థాయికి తీసుకెళ్లబోతున్నాయి.
యువతకు కావాల్సిన నైపుణ్యాలను ఇవ్వడంలో మంత్రి నారా లోకేష్ ముందుండి పనిచేస్తున్నారని ఆయన చెప్పారు. స్పోర్ట్స్ ఫెసిలిటీస్ కూడా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్‌లో వస్తున్నాయని, అంటే భవిష్యత్తు తరం "గ్లోబల్ మైండ్‌సెట్"తో పెరుగుతుందని హైలైట్ చేశారు.
నమ్మకమే బిజినెస్ బేస్: "ఏ వ్యాపారానికైనా నమ్మకమే ఫౌండేషన్. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవడం కోసం కాంటిన్యూస్ ఎఫర్ట్ అవసరం" అని చంద్రబాబు అన్నారు. వ్యాపారం అంటే కేవలం లాభం కాకుండా, ప్రపంచం నమ్మే బ్రాండ్ గా సృష్టించడం కూడా ఒక మిషన్ అని ఆయన స్పష్టం చేశారు.
ప్రభుత్వం "స్వర్ణ ఆంధ్ర విజన్ 2047" కింద ఓ కాంప్లీట్ ఇండస్ట్రియల్ ఎకోసిస్టమ్ ను సెట్ చేస్తోందని ఆయన చెప్పారు. ఈ మీటింగ్‌కి విశాఖ ఎంపీ శ్రీభరత్‌తో పాటు పలు ప్రాంతాల నుంచి వచ్చిన యువ పారిశ్రామికవేత్తలు హాజరయ్యారు.
ఆంధ్రప్రదేశ్ యువత పెద్ద ఇండస్ట్రీల్లో మాత్రమే కాకుండా స్టార్టప్ కల్చర్ వైపుకి కూడా అడుగు పెట్టాలని సీఎం సూచించారు. IT, ఫిన్‌టెక్, హెల్త్‌టెక్, అగ్రిటెక్ వంటి రంగాల్లో స్టార్టప్‌లు కోసం భారీ డిమాండ్ ఉంది. కాబట్టి యువ పారిశ్రామికవేత్తలు చిన్న స్థాయి ఐడియాలు తీసుకొని, వాటిని రియల్ బిజినెస్‌గా మార్చే ప్రయత్నం చేయవచ్చు. ఇది వారి క్రియేటివిటీకి, అంతర్జాతీయ మార్కెట్‌లోకి అడుగు పెట్టడానికి పెద్ద అవకాశాన్ని ఇస్తుంది.
రాష్ట్రంలో తయారయ్యే ఉత్పత్తులు గ్లోబల్ మార్కెట్‌లోకి వెళ్ళే అవకాశం ఉన్నందున, APలోని పోర్ట్ కనెక్టివిటీ విశాఖ, కృష్ణపట్నం వంటి పోర్టులు యువ ఎంట్రప్రెన్యూర్స్‌కి పెద్ద బెనిఫిట్. ఈ కనెక్టివిటీ వల్ల ఉత్పత్తులను అంతర్జాతీయ మార్కెట్‌కి సులభంగా పంపొచ్చు, గ్లోబల్ బ్రాండ్‌గా ఆంధ్రప్రదేశ్‌ను చూపించవచ్చు.
అలాగే, స్టార్టప్‌లకు ఫండింగ్ & ఇన్వెస్టర్ సపోర్ట్ కూడా పుష్కలంగా ఉంది. APలోకి గ్లోబల్ ఇన్వెస్టర్లు వస్తున్నారు, VC ఫండింగ్, ప్రభుత్వ ఇన్సెంటివ్స్ ట్యాక్స్ బెనిఫిట్స్, సబ్సిడీలు వంటి సౌకర్యాలు యువతకు బిజినెస్ ప్రారంభించడానికి సాయం చేస్తాయి. వీటిని ఉపయోగించి, చిన్న ఐడియా నుండి పెద్ద వ్యాపారాన్ని రూపుదిద్దుకోవడం ఇప్పుడు సులభమైంది.
More From GoodReturns

అమరావతి ల్యాండ్ పూలింగ్: నేడే ఆఖరి అవకాశం, రైతుల పరిస్థితి ఏంటి?

Gold silver: బంగారం, వెండి కొనాలా? వద్దా? మార్కెట్లో వింత పరిస్థితి.. నిపుణుల సలహా ఇదే!

ప్రపంచం ముప్పు ముంగిట్లో ఉంది.. ఈ మూడు ఆస్తులు తప్ప మిమ్మల్ని ఏవీ కాపాడలేవంటున్న కియోసాకి..

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

6 వేల డాలర్ల మార్క్ దాటబోతున్న బంగారం ధర.. డాలర్ విలువ ఖేల్ ఖతం.. ప్రపంచ రారాజుగా పసిడి..

బెంగళూరులో రూ. 5 వేలకే రూమ్..ఈ ఏరియాలోకి రమ్మని పిలుస్తున్న ఇంటి ఓనర్లు..



Click it and Unblock the Notifications