Chandrababu Naidu: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తిరిగి ఆర్థికంగా గాడిలో పెట్టేందుకు కొత్తగా బాధ్యతలు చేపట్టిన టీడీపీ అధినేత సీఎం చంద్రబాబు ఫాస్ట్‌ట్రాట్ మార్గాలను అన్వేషిస్తున్నారు. ఏపీని పెట్టుబడులకు ప్రపంచ ఎంపికగా మార్చేందుకు కృషి చేస్తున్నారు.
ప్రమాణ స్వీకారం జరిగిన వెంటనే రాజధాని, రోడ్లు, మౌలిక సదుపాయాల కల్పన, పోలవరం వంటి కీలక ప్రాజెక్టులపై సీఎం ఫోకస్ పెరిగిందని తెలుస్తోంది. అయితే గతంలో చాలా కంపెనీలు ఏపీ నుంచి తమ పెట్టుబడి ప్రణాళికలను ఉపసంహరించుకుని పొరుగు రాష్ట్రాలకు వెళ్లిపోగా.. ఈ సారి అలాంటి తప్పులు అస్సలు జరగకుండా చూసేందుకు ప్రాధాన్యత ఇస్తున్నారు.

సీఎంవో కార్యాలయంలోని అధికారుల అందించిన సమాచారం ప్రకారం.. దేశంలో వేల కోట్ల టర్నోవర్ కలిగి కొత్తగా తమ వ్యాపారాన్ని విస్తరించాలని చూస్తున్న కంపెనీలను ఐడెంటిఫై చేసే పనిలో సీఎం చంద్రబాబు నాయుడు ఉన్నారని వెల్లడైంది. వీటికి సంబంధించిన సమాచారాన్ని అధికారులు ఎప్పటికప్పుడు తన డెస్క్ పై ఉంచాలని చంద్రబాబు ఆదేశించారని సమాచారం.
ఇదే సమయంలో ముఖ్యంగా ఆర్థిక, వ్యాపార, పెట్టుబడులకు సంబంధించిన సమాచారాన్ని ప్రచురించే పత్రికలు, మ్యాగజైన్స్ తన డెస్క్ పై ఉంచాలని సీఎం ఇప్పటికే అధికారులకు సూచించినట్లు వెల్లడైంది. ఇప్పటికే అప్పుల ఊబిలో నిలిచిన ఆంధ్రరాష్ట్రానికి కొత్త జవసత్వాలు తీసుకొచ్చి ఇక్కడి యువతకు భారీగా ఉపాధి అవకాశాలను కల్పించాలని టీడీపీ ప్రభుత్వం కృషి చేస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.


Click it and Unblock the Notifications