Sensex today: దేశీయ స్టాక్ మార్కెట్ చప్పగా ముగిసింది. నో గెయిన్, నో లాస్.. అనే రీతిలో దాదాపుగా ఫ్లాట్‌గా ట్రేడ్ అయింది ఈ వీకెండ్ డే. శనివారం చివరి విడత లోక్‌సభ ఎన్నికల పోలింగ్ జరగాల్సి ఉండగా.. ఒక్కరోజు ముందు స్టాక్ మార్కెట్ ఫ్లాట్‌గా ట్రేడ్ కావడం చర్చనీయాంశమైంది.
బోంబే స్టాక్ ఎక్స్ఛేంజ్, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్‌లో సెన్సెక్స్ 75.71 పాయింట్ల మేర లాభపడింది. ఈ ఉదయం ట్రేడింగ్ ఆరంభమైనప్పటి నుంచి పడుతూ లేస్తూనే సాగింది దాని ప్రస్థానం. 73,885 పాయింట్ల వద్ద గురువారం ట్రేడింగ్ ముగియగా.. 400లకు పైగా పాయింట్ల వద్ద లాభాలతో ట్రేడింగ్ మొదలైంది. మధ్యాహ్నం 2 గంటల వరకూ స్థిరంగా కొనసాగింది.

ఒకదశలో అత్యధికంగా 73,319 పాయింట్లను తాకింది సెన్సెక్స్. ఆ తరువాత అమాంతం క్షీణించింది. రెడ్ జోన్‌లో సైతం వెళ్లింది. మధ్యాహ్నం 2:35 నిమిషాల సమయంలో కనిష్ఠంగా 73.832.57 పాయింట్లకు పడిపోయింది. ఆ వెంటనే కోలుకుంది. ట్రేడింగ్ ముగిసే సమయానికి ఫర్వాలేదనిపించుకుంది. 76.71 పాయింట్ల లాభంతో 73,961 పాయింట్ల సెన్సెక్స్ క్లోజ్ అయింది. .
నిఫ్టీ ట్రేడింగ్‌లో కూడా భారీ లాభాలు నమోదు కాలేదివ్వాళ. గురువారం 22,488.65 పాయింట్ల వద్ద నిఫ్టీ ట్రేడ్ క్లోజ్ కాగా.. 80 పాయింట్ల లాభంతో 22,567 పాయింట్ల మార్కెట్ ఆరంభమైంది. మధ్యాహ్నం గరిష్ఠంగా 22,624.85 పాయింట్లను తాకింది. ఆ తరువాత ట్రేడింగ్ క్షీణించింది. ఒకదశలో కనిష్ఠంగా 22,478.95 పాయింట్లకు పడిపోయినప్పటికీ.. చివరి గంట ట్రేడింగ్ సెషన్‌లో పుంజుకుంది నిఫ్టీ. 42 పాయింట్ల లాభంతో 22,530.70 వద్ద ట్రేడింగ్ ముగిసింది.
అదాని గ్రూప్ ఆఫ్ కంపెనీలకు చెందిన షేర్లు నేడు ఇన్వెస్టర్లకు లాభాలను పంచాయి. అదాని ఎంటర్‌ప్రైజెస్, అదాని పవర్, అదాని టోటల్ గ్యాస్ 10 శాతం వరకు ట్రేడ్ అయ్యాయి. అత్యధికంగా అదాని ఎంటర్‌ప్రైజెస్ షేర్ ఒక్కింటికి గరిష్ఠంగా 237 రూపాయల మేర పెరుగుదల కనిపించింది.


Click it and Unblock the Notifications