Clause 247 in New Income Tax Law : 2025-26 సంవత్సరానికి ఆదాయపు పన్ను రిటర్నులు (ITR) దాఖలు చేయడానికి చివరి తేది సెప్టెంబర్ 15 అనే విషయం అందిరికీ తెలిసిందే. గతంలో జూలై 31 వరకు ఉన్న గడువు తేదీని సెప్టెంబర్ 15 వరకు ఆదాయపు పన్ను శాఖ పొడిగించింది. వ్యక్తులు, జీతం పొందే ఉద్యోగులు మరియు ఆడిట్ అవసరం లేని పన్ను చెల్లింపుదారులు తప్పనిసరిగా ఆదాయపు పన్ను రిటర్న్ ఫైల్ చేయాల్సి ఉంటుంది. అయితే భారత ప్రభుత్వం తాజాగా కొత్త ఆదాయపు పన్ను చట్టం అమలు తేదిని అధికారికంగా ప్రకటించింది. లోక్‌సభ ఆగస్టు 11, 2025న ఈ బిల్లును ఆమోదించగా, రాజ్యసభలో ఆగస్టు 12, 2025న ఆమోదం పొందింది. ఆగస్టు 21న రాష్ట్రపతి సంతకం చేయడంతో ఇది చట్టంగా మారింది.
ఇండియాలో 60 ఏళ్ల క్రితం ఉన్న ఆదాయపు పన్ను చట్టం 1961ని మార్చి, కొత్త ఆదాయపు పన్ను చట్టం ఏప్రిల్ 1, 2026 నుంచి అమల్లోకి రానుందని ప్రకటించారు. అయితే కొత్త ఆదాయపు పన్ను చట్టంలో ఎలాంటి కొత్త పన్ను రేట్లు లేవు. కానీ భాషను పూర్తిగా సరళతరం చేశారు.ఇక పాత చట్టం (1961)లో 819 సెక్షన్లు, 47 చాప్టర్లు, 5.12 లక్షల పదాలు ఉండేవి. కొత్త చట్టంలో మాత్రం కేవలం 536 సెక్షన్లు, 23 చాప్టర్లు, 2.6 లక్షల పదాలు మాత్రమే ఉన్నాయి. దీనర్థం ఏంటంటే.. చట్టాన్ని చిన్నదిగా చేసి, చదవడానికి, అర్థం చేసుకోవడానికి సులభంగా మార్చారు.

ఇక వచ్చే ఏడాది ఏప్రిల్ 1, 2026 నుండి కొత్త ఆదాయపు పన్ను చట్టం అమల్లోకి రానుండగా పలు కీలక మార్పులు చోటు చేసుకోనున్నాయి. ఈ కొత్త చట్టం ప్రకారం, ఆదాయపు పన్ను అధికారులు ఇకపై మీ ఇమెయిల్‌లు, సోషల్ మీడియా ఖాతాలు, ఆన్‌లైన్ పెట్టుబడి లేదా బ్యాంక్ ఖాతాలు వంటి డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లకు యాక్సెస్ చేసుకునే అధికారం పొందవచ్చు.కొత్త చట్టంలోని క్లాజు 247 ప్రకారం.. ఒక అధీకృత ఆదాయపు పన్ను అధికారి యాక్సెస్ కోడ్ అందుబాటులో లేని కంప్యూటర్ సిస్టమ్ లేదా, వర్చువల్ డిజిటల్ స్పేస్ (Virtual Digital Space) ద్వారా యాక్సెస్ కోడ్‌ను భర్తీ చేసి మీ ఖాతాలోనికి ప్రవేశించే హక్కును కలిగి ఉంటాడు. అంటే పన్ను అధికారులు కేవలం కార్యాలయాలు వంటి ప్రదేశాల్లోనే కాకుండా, మీ డిజిటల్ ప్రపంచంలో కూడా శోధన జరిపే అధికారం కలిగి ఉంటారు.
కొత్త పన్ను చట్టం ప్రకారం, వర్చువల్ డిజిటల్ స్పేస్ అనేది కంప్యూటర్ టెక్నాలజీ ద్వారా నిర్మించబడిన డిజిటల్ వేదిక. ఇందులో మనం ఇంటర్నెట్, కమ్యూనికేషన్ పరికరాలు, క్లౌడ్ సర్వర్లు, సైబర్‌స్పేస్ వంటి వాటిని ఉపయోగించి డేటాను నిల్వ చేయడం, మార్పిడి చేయడం లేదా సమాచారాన్ని పంచుకోవడం జరుగుతుంది.
దీనిలో ప్రధానంగా ఇవి ఉంటాయి:
1. ఇమెయిల్ సర్వర్లు
2. సోషల్ మీడియా ఖాతాలు (Facebook, X, Instagram మొదలైనవి)
3. ఆన్‌లైన్ పెట్టుబడి ఖాతాలు, ట్రేడింగ్ & బ్యాంకింగ్ ఖాతాలు
4. ఆస్తి యాజమాన్య రికార్డులు ఉన్న వెబ్‌సైట్లు
5. రిమోట్ సర్వర్లు లేదా క్లౌడ్ సర్వర్లు
6. డిజిటల్ అప్లికేషన్ ప్లాట్‌ఫారమ్‌లు
7. ఇలాంటి ఇతర డిజిటల్ స్పేస్‌లు
ప్రస్తుత 1961 ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 132 ప్రకారం.. అధికారులు శోధన, స్వాధీనం కోసం ఏదైనా తలుపు, పెట్టె, లాకర్, సేఫ్ లేదా అల్మరాను పగలగొట్టే అధికారం కలిగి ఉంటాడు.డబ్బు, బంగారం, ఆభరణాలు, పత్రాలు లేదా ఇతర విలువైన వస్తువులు దాచి పెట్టారని అనుమానం ఉంటే భవనాలు, స్థలాలు, వాహనాలు మొదలైన వాటిలో శోధన చేయవచ్చు.అయితే ఈ అధికారాలు భౌతిక పరిమితులకే పరిమితమయ్యేవి.కొత్త చట్టం డిజిటల్ ప్రపంచంలోకి అడుగుపెట్టే అవకాశాన్ని ఇచ్చింది. అంటే కొత్త చట్టంలో డిజిటల్ వేదికలు అయిన ఇమెయిల్, సోషల్ మీడియా ఖాతాలు, ఆన్‌లైన్ ఇన్వెస్ట్‌మెంట్స్ అన్నీ పర్యవేక్షణలోకి వస్తాయి.పన్ను ఎగవేతను అరికట్టడంలో ఇది పెద్ద అడుగుగా భావించవచ్చని నిపుణులు చెబుతుండగా.. గోప్యతపై చర్చలతో పాటు ఆందోళనలు కూడా ఎక్కువయ్యే అవకాశం ఉందని మరికొందరు నిపుణులు చెబుతున్నారు.
More From GoodReturns

6 వేల డాలర్ల మార్క్ దాటబోతున్న బంగారం ధర.. డాలర్ విలువ ఖేల్ ఖతం.. ప్రపంచ రారాజుగా పసిడి..

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బెంగళూరులో రూ. 5 వేలకే రూమ్..ఈ ఏరియాలోకి రమ్మని పిలుస్తున్న ఇంటి ఓనర్లు..

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

టీసీఎస్ ఉద్యోగుల షాకింగ్ నిర్ణయం: కంపెనీని వదిలేసి వెళ్లిపోతున్నారు..ఎందుకంటే...



Click it and Unblock the Notifications