Penny stock: రాకెట్ లా దూసుకెళ్లిన 10 పైసల స్టాక్.. లక్ష పెట్టిన వారికి రూ.2 కోట్లు.. మీరూ కొన్నారా..
Multibagger Stocks: గతేడాది నవంబర్ నుంచి స్టాక్ మార్కెట్‌లో భారీ అమ్మకాలు ఒత్తిడి కొనసాగటం మనం గమనిస్తూనే ఉన్నాం. ఈ సమయంలో చాలా మంది ఇన్వెస్టర్లు నష్టలతో డబ్బును కోల్పోయారు. ముఖ్యంగా షార్ట్ టెర్మ్ లో మల్టీబ్యాగర్ రిటర్న్స్ ఆశించిన పెట్టుబడిదారులు నిరాశకు గురయ్యారని చెప్పుకోక తప్పదు. అయితే.. దీర్ఘకాలికంగా ఇన్వెస్ట్ చేసే వారు మాత్రం లాభాల్లోనే ఉన్నారు. ఇలా దీర్ఘకాలంగా కంపెనీలో పెట్టుబడులను కొనసాగిస్తున్నవారికి CK బిర్లా గ్రూప్‌కు చెందిన ఓరియంట్ పేపర్ అండ్ ఇండస్ట్రీస్ షేర్ కనక వర్షం కురిపించింది. ఈ పెన్నీ స్టాక్ తన ఇన్వెస్టర్లకు ఊహించని రీతిలో లాభాలను అందించి, కేవలం లక్ష పెట్టుబడితోనే కోటీశ్వరులను చేసింది.

ఈ స్టాక్ ఇంకా పెరుగుతుందా..
ఓరియంట్ పేపర్ అండ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ స్టాక్ గత కొన్ని సంవత్సరాల్లో 10 పైసల నుంచి రూ. 22 వరకు పెరిగింది. ఈ సమయంలో.. ఈ స్టాక్ గరిష్ఠ స్థాయి అయిన దాదాపు రూ.40కి చేరుకుంది. దీని 52 వారాల గరిష్ఠ ధర రూ.39.40గా ఉంది. ప్రస్తుతం ఈ స్టాక్ 52 వారాల కనిష్ట స్థాయికి సమీపంలో ట్రేడవుతోంది. దీని 52 వారాల కనిష్ఠ ధర రూ.19.80గా ఉంది. దీని కారణంగా రానున్న కాలంలోనూ ఈ స్టాక్ మల్టీబ్యాగర్ రాబడులను ఇచ్చే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.

10 పైసల పెన్నీ స్టాక్ వివరాలు..
ప్రస్తుత స్థాయి ప్రకారం.. ఈ స్టాక్ తన పెట్టుబడిదారులకు 20 వేల శాతానికి పైగా రాబడిని అందించింది. ఈ కంపెనీ స్టాక్ 19 సెప్టెంబర్ 2003న BSEలో కేవలం 10 పైసలకే ట్రేడ్ అయింది. ఈ వారం చివరి ట్రేడింగ్ రోజున అంటే 27 జూన్ 2022న BSEలో ఈ స్టాక్ ధర రూ. 22.80 వద్ద ముగిసింది. ఈ విధంగా ఓరియంట్ పేపర్ స్టాక్‌లో 2003లో పెట్టుబడిదారుడు లక్ష రూపాయలు ఇన్వెస్ట్ చేసి ఇప్పటి వరకు ఇన్వెస్ట్‌మెంట్ కొనసాగించినట్లయితే.. అతని పెట్టుబడి విలువ ప్రస్తుత మార్కెట్ లెక్కల ప్రకారం దాదాపుగా రూ.2.30 కోట్లుగా ఉండేది.

గడచిన 10 సంవత్సరాల్లో..
కంపెనీ స్టాక్ గత 10 సంవత్సరాల్లో కూడా అద్భుతమైన రాబడిని అందించింది. BSEలో దాని ఒక షేరు ధర కేవలం రూ. 1.01గా ఉంది. అంటే.. గత 9 ఏళ్లలోనే 2000 శాతం కంటే ఎక్కువ రాబడిని ఇచ్చింది. ఈ లెక్కన అప్పట్లో లక్ష రూపాయలు ఇన్వెస్ట్ చేసిన వారికి ఇప్పుడు దాదాపుగా రూ. 22.67 లక్షలు వచ్చి ఉండేవి. ప్రస్తుతం ఈ కంపెనీ మార్కెట్ క్యాప్ దాదాపుగా రూ. 500 కోట్లుగా ఉంది. అంటే మనకు ఈ స్టాక్ ను గమనించిన తరువాత ఏమి అర్థమౌతుందంటే.. మంచి ఫండమెంటల్స్ ఉండే స్టాక్స్ లో దీర్ఘకాలం పాటు పెట్టుబడులను కొనసాగిస్తే అవి మంచి రిటర్న్స్ అందిస్తాయి.
గమనిక: ఇక్కడ అందించిన వివరాలు కేవలం మీకు సమాచారం అందించటానకి మాత్రమే. దీని ఆధారంగా ట్రేడింగ్, పెట్టుబడులు చేయకండి. ఏదైనా పెట్టుబడి పెట్టేముందు తప్పకుండా నిపుణుల సలహాలు తీసుకోండి.


Click it and Unblock the Notifications