May 1 LPG rule changes: మే 1 నుండి గ్యాస్ రూల్స్ మారుతున్నాయి.. మళ్ళీ ధరల భారం తప్పదా?

May 1 LPG rule changes : సామాన్యుడి వంటింటి బడ్జెట్‌లో గ్యాస్ సిలిండర్ కీలక పాత్ర పోషిస్తుంది. అయితే, మే 1, 2026 నుండి గ్యాస్ కు సంబంధించి కొన్ని రూల్స్ (LPG Rules) మారబోతున్నాయి. పశ్చిమ ఆసియాలో (West Asia) నెలకొన్న యుద్ధ ఉద్రిక్తతలు ప్రపంచ ఇంధన మార్కెట్లను కుదిపేస్తున్నాయి. దీని ప్రభావం మన దేశంలోని గ్యాస్ సిలిండర్ ధరలు , సరఫరాపై ఎలా ఉండబోతుందో ఇప్పుడు వివరంగా చూద్దాం.

City Wise LPG Prices For Hyderabad Bengaluru Vijayawada And May 1 LPG rule changes summary

మళ్ళీ ధరల పెంపు తప్పదా?

ఫిబ్రవరి చివరలో ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధం మొదలైనప్పటి నుండి, చమురు కంపెనీలు ఇప్పటికే దేశీయ ఎల్‌పీజీ (14.2 కిలోలు) ధరను రూ. 60 మేర పెంచాయి. కమర్షియల్ సిలిండర్ల ధరలు కూడా మూడు సార్లు పెరిగాయి. ఏప్రిల్ నెలలోనే దాదాపు రూ. 196 మేర పెంపు కనిపించింది. మే 1న జరిగే నెలవారీ సమీక్షలో, అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితులను బట్టి ఐఓసీఎల్ (IOCL), బీపీసీఎల్ (BPCL), హెచ్‌పీసీఎల్ (HPCL) కంపెనీలు ధరలను మరోసారి పెంచే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.

బుకింగ్ గ్యాప్ పెరిగింది.. ఎందుకంటే?

పెట్రోలియం మంత్రిత్వ శాఖ గ్యాస్ బుకింగ్ విధానాన్ని మరింత కఠినతరం చేసింది.

  • పట్టణ ప్రాంతాల్లో: ఒక సిలిండర్ బుక్ చేసిన తర్వాత రెండో బుకింగ్‌కు మధ్య 25 రోజుల గ్యాప్ ఉండాలి (గతంలో ఇది 21 రోజులు).
  • గ్రామీణ ప్రాంతాల్లో: ఈ గ్యాప్ ఏకంగా 45 రోజుల వరకు ఉంటుంది. సబ్సిడీ సిలిండర్లు పక్కదారి పట్టకుండా, అనవసరమైన స్టాకింగ్‌ను అరికట్టడానికి ఈ నిర్ణయం తీసుకున్నారు.

OTP డెలివరీ ఇక పక్కా!

ఇప్పటికే చాలా చోట్ల అమల్లో ఉన్న OTP (డెలివరీ అథెంటికేషన్ కోడ్) విధానాన్ని మే నెల నుండి వంద శాతం తప్పనిసరి చేయనున్నారు. మీరు గ్యాస్ బుక్ చేసిన తర్వాత, డెలివరీ బాయ్ ఇంటికి వచ్చినప్పుడు మీ ఫోన్‌కు వచ్చే కోడ్‌ను చెబితేనే సిలిండర్ ఇస్తారు. దీనివల్ల సిలిండర్ల చోరీకి అడ్డుకట్ట పడుతుంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 94% డెలివరీలు ఈ పద్ధతిలోనే జరుగుతున్నాయి.

Aadhaar e-KYC ఎవరికి ముఖ్యం?

ఆధార్ బయోమెట్రిక్ వెరిఫికేషన్ గురించి ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. ఎవరైతే ఇప్పటి వరకు e-KYC పూర్తి చేయలేదో వారు మాత్రమే చేయించుకోవాలి. ముఖ్యంగా ఉజ్వల యోజన కస్టమర్లు సబ్సిడీ పొందాలంటే సంవత్సరానికి ఒకసారి ఈ వెరిఫికేషన్ తప్పనిసరి. సాధారణ కస్టమర్లు ఇప్పటికే పూర్తి చేసి ఉంటే మళ్ళీ చేయాల్సిన పని లేదు.

PNG కి మారకపోతే కనెక్షన్ కట్!

ప్రభుత్వం ఇప్పుడు పైపుడ్ గ్యాస్ (PNG) కి ప్రాధాన్యత ఇస్తోంది. ఒకవేళ మీ ప్రాంతంలో PNG అందుబాటులో ఉండి కూడా మీరు కనెక్షన్ తీసుకోకపోతే, మూడు నెలల తర్వాత మీ ఎల్‌పీజీ సరఫరాను నిలిపివేస్తారు. అలాగే, ఒకసారి PNG కనెక్షన్ తీసుకుంటే, మీరు పాత గ్యాస్ సిలిండర్ కనెక్షన్‌ను వదులుకోవాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి ప్రభుత్వం ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసింది.

ధరల అంచనా..

పశ్చిమ ఆసియాలో నెలకొన్న యుద్ధ ఉద్రిక్తతల వల్ల అంతర్జాతీయంగా చమురు ధరల్లో మార్పులు వస్తున్నాయి. దీని ప్రభావం మన దేశంలోని గ్యాస్ ధరలపై స్పష్టంగా కనిపిస్తోంది. మే 1న జరగబోయే సమీక్షలో గృహ అవసరాలకు వాడే 14.2 కిలోల సిలిండర్ ధరల్లో మార్పు ఉండే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతానికి తెలుగు రాష్ట్రాల్లో డొమెస్టిక్ సిలిండర్ ధర.. రూ.965 వరకూ ఉంది. బెంగళూరులో రూ. 915 వరకూ ఉంది.

యుద్ధం వల్ల అంతర్జాతీయంగా చమురు కొరత ఉన్నప్పటికీ, గృహ అవసరాలకు సరిపడా గ్యాస్ సరఫరాను ప్రభుత్వం నిరంతరం పర్యవేక్షిస్తోంది. కాబట్టి సామాన్యులు ఆందోళన చెందాల్సిన పని లేదు కానీ, నిబంధనలను పాటించడం మాత్రం తప్పనిసరి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+