Petrol Prices: పెట్రోల్ లీటరు రూ.84, డీజిల్ లీటరు రూ.79.. ఆ నగరంలో ప్రత్యేక రేట్లు..
Petrol Prices: దేశంలో ఒకపక్క పెట్రోల్ ధర సెంచరీ దాటేసి వాహనదారులను కలవర పెడుతున్న సంగతి తెలిసిందే. అయితే దేశంలోని ఒక నగరంలో మాత్రం పరిస్థితి కొంత భిన్నంగా ఉంది. ఆదివారం పైగా క్రిస్మస్ సందర్భంగా అక్కడ స్పెషల్ డిస్కౌంట్ ధరకు పెట్రోల్ డీజిల్ తక్కువ ధరలకు విక్రయిస్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

వివిధ నగరాల్లో రేట్లు..
కోల్ కతా పెట్రోల్ 106.03 డీజిల్ 92.76, దిల్లీ పెట్రోల్ 96.72 డీజిల్ 89.62, పోర్ట్ బ్లేర్ పెట్రోల్ 84.10 డీజిల్ 79.74, చెన్నై పెట్రోల్ 102.63 డీజిల్ 94.24, బెంగళూరు పెట్రోల్ 101.94 డీజిల్ 87.89, హైదరాబాద్ పెట్రోల్ 109.66 డీజిల్ 97.82, విజయవాడలో పెట్రోల్ 111.88 డీజిల్ 99.62 వద్ద ఉన్నాయి.

దేశంలో ఒక్కచోటే..
చాలా కాలంగా పెట్రోల్ డీజిల్ ధరల్లో ఎలాంటి మార్పులు లేవు. ఈ సమయంలో వాటి ధరలకు సంబంధించి ఒక రిలీఫ్ న్యూస్ ఉంది. దేశంలోని వివిధ నగరాల్లో పెట్రోల్, డీజిల్ పాత ధరలు యథాతథంగా ఉండడానికి ఇదే కారణం. దేశంలోనే అత్యంత చవకైన చమురును పోర్ట్ బ్లెయిర్‌లో విక్రయిస్తున్నారు.ఇక్కడ లీటర్ పెట్రోల్ ధర రూ.84.10 ఉండగా.. లీటరు డీజిల్ ధర రూ.79.74గా ఉంది. ఈ వార్త విన్నవారు అసలు పెట్రోల్ డీజిల్ ధరలు ఈ స్థాయిలో చూడటం చాలా సంవత్సరాల కిందట జరిగిందని అంటున్నారు.

ఇతర నగరాల్లో రేట్లు తెలుసుకోండి..
మీరు ప్రతిరోజూ మీ నగరంలో పెట్రోల్, డీజిల్ ధరలను SMS ద్వారా కూడా తనిఖీ చేయవచ్చు. ఇండియన్ ఆయిల్ (IOC) వినియోగదారులు RSP <�డీలర్ కోడ్>ని 9224992249కి పంపవచ్చు. అలాగే HPCL వినియోగదారులు HPPRICE <�డీలర్ కోడ్>ని 9222201122కి పంపవచ్చు.
ఇక BPCL వినియోగదారులు RSP<�డీలర్ కోడ్>ని 9223112222కు మెసేజ్ రూపంలో పంపితే ఆరోజు చమురు ధరలు అందించటం జరుగుతోంది. చాలా కాలంగా పెట్రోడీజిల్ ధరల్లో ఎలాంటి మార్పులు లేకుండా కొనసాగుతున్నాయి.


Click it and Unblock the Notifications