Citroen C5: ప్రస్తుతం కాలంలో మారుతున్న జీవన అవసరాలకు అనుగుణంగా చాలా మంది మధ్య తరగతికి చెందిన వారు ఒక కారు కొనుక్కోవాలని భావిస్తున్నారు. అయితే బడ్జెట్లో కార్ ప్లాన్ చేసుకునే వారు డిస్కౌంట్స్ గురించి చూస్తుంటారు.
అలా డిస్కౌంట్లో మంచి కారును కొనుగోలు చేయాలనుకునే వారికి ఇప్పుడొక శుభవార్త ఉంది. ప్రముఖ కార్ మేకర్ సిట్రోయెన్ ఇండియా కంపెనీ వినియోగదారులకు కళ్లు చెదిరే ఆఫర్ ప్రకటించింది. దీని ప్రకారం వినియోగదారులు కొత్త కారు కొనుగోలుపై దాదాపు రూ.2 లక్షల వరకు తగ్గింపును పొందవచ్చని వెల్లడించింది. అయితే ఈ ఆఫర్ జూలై 31 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుందని కార్ల సంస్థ స్పష్టం చేసింది.

సిట్రోయెన్ ఇండియా తన ఫ్లాగ్ షిప్ సి5 ఎయిర్ క్రాస్ మోడల్ కార్లపై ప్రస్తుతం మెగా తగ్గింపును వాహన ప్రియులకు అందుబాటులో ఉంచింది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే కంపెనీ క్లియరెన్స్ సేల్ కింద 2022 మోడళ్లకు మాత్రమే డిస్కౌంట్ ఆఫర్ అందుబాటులో ఉంచింది. గత ఏడాదే కారు కొనుక్కోవాలని భావించిన వారు తమ కలను ఇప్పుడు తక్కువ ఖర్చుతోనే నెరవేర్చుకోవచ్చు. ప్రస్తుతం ఆఫర్ ప్రాంతం, మోడల్, వేరియంట్, ఫీచర్స్ వంటి కారణాల వల్ల మారుతుంటుంది. అందుకే పూర్తి వివరాల కోసం మీ సమీపంలోని డీలర్లను సంప్రదించటం వల్ల అన్ని విషయాలను తెలుసుకోవచ్చు.
రెండు లక్షల వరకు తగ్గింపును అందిస్తున్న సిట్రోయెన్ సి5 ఎయిర్ క్రాస్ షైన్ మోడల్ పై అందుబాటులో ఉంది. కారు ప్రత్యేకతలను పరిశీలిస్తే ఇది 2 లీటర్ల కెపాసిటీతో 4 సిలిండర్ డీజిల్ ఇంజిన్ కలిగి ఉంది. దీని పవర్ 174 BHP, టార్క్ 400 NMతో పాటు 8 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ సౌలభ్యంతో వస్తోంది. దీని ధర రూ.37.17 లక్షలుగా ఉంది. ఇదే క్రమంలో సిట్రోయెన్ సి3 కారుపై రూ.50 వేల వరకు తగ్గింపు. మూడు వేరియంట్లలో లభిస్తున్న ఈ మోడల్ కారు ధర రూ.5.98 లక్షల నుంచి రూ.7.2 లక్షల వరకు ఉన్నాయి. అలాగే 100 శాతం ఫైనాన్స్ సౌకర్యం అందుబాటులో ఉంది.


Click it and Unblock the Notifications