ప్రస్తుతం స్టాక్ మార్కెట్లలో 'సిత్రిణి రీసెర్చ్' (Citrini Research) నివేదిక పెను తుపాను సృష్టిస్తోంది. రాబోయే కాలంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వల్ల ప్రపంచవ్యాప్తంగా భారీగా ఉద్యోగాల కోత (Layoffs) తప్పదని, ఆర్థిక సంక్షోభం రాబోతోందని ఈ నివేదిక హెచ్చరించింది. అమెరికాలోని IBM నుంచి మన దేశంలోని TCS, Infosys వరకు అన్ని దిగ్గజ ఐటీ కంపెనీల షేర్లు ఈ నివేదిక ప్రభావంతో కుదేలయ్యాయి. అసలు ఈ నివేదికలో ఏముంది? ఇది నిజంగానే జరుగుతుందా? వంటి వివరాలు ఇప్పుడు చూద్దాం.

ప్రపంచ మార్కెట్లను వణికిస్తున్న ఈ నివేదిక పేరు "ది 2028 గ్లోబల్ ఇంటెలిజెన్స్ క్రైసిస్". ఇది భవిష్యత్తులో ఏం జరుగుతుందో చెప్పే జోస్యం కాదు. కానీ, ఏఐ (AI) అభివృద్ధి గనుక ఇలాగే కొనసాగితే వచ్చే విపత్కర పరిస్థితులపై చేసిన ఒక 'స్టడీ'. ఈ నివేదిక వెలుగులోకి వచ్చిన వెంటనే వాల్ స్ట్రీట్ నుంచి దలాల్ స్ట్రీట్ వరకు ఇన్వెస్టర్లలో ఆందోళన మొదలైంది.
అసలేంటి ఈ సిత్రిణి రీసెర్చ్?
వాల్ స్ట్రీట్ జర్నల్ ప్రకారం.. ఇది 2023లో జేమ్స్ వాన్ గీలెన్ అనే వ్యక్తి స్థాపించిన ఒక చిన్న రీసెర్చ్ గ్రూప్. ఈయనతో పాటు లోటస్ టెక్నాలజీ మేనేజ్‌మెంట్ చీఫ్ ఇన్వెస్ట్‌మెంట్ ఆఫీసర్ అలాప్ షా ఈ నివేదికను రూపొందించారు. తాము భవిష్యత్తును అంచనా వేయడం లేదని, ఏఐ వల్ల తలెత్తే ఒక ఊహాజనిత సంక్షోభం ఎలా ఉంటుందో విశ్లేషించామని వారు చెబుతున్నారు.
భారత్ పరిస్థితి ఏంటి? (India's Economic Risk)
ఈ నివేదిక భారత్ పట్ల చాలా నెగటివ్ వ్యూ ఇచ్చింది. ముఖ్యంగా ఇండియన్ ఐటీ రంగం కేవలం 'తక్కువ ఖర్చు' అనే పునాది మీద నిర్మించబడిందని, ఏఐ వల్ల కోడింగ్ ఖర్చు విద్యుత్ ఖర్చు కంటే తగ్గిపోతే మన ఐటీ కంపెనీల అవసరం తగ్గిపోతుందని హెచ్చరించింది.
- 2027 నాటికి టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో వంటి కంపెనీల్లో కాంట్రాక్టుల రద్దు పెరగవచ్చు.
- రూపాయి విలువ డాలర్‌తో పోలిస్తే 18% పడిపోయే అవకాశం ఉంది.
- 2028 నాటికి భారత్ తన ఆర్థిక పరిస్థితులను చక్కదిద్దేందుకు ఐఎంఎఫ్ (IMF) సాయం కోరాల్సి రావచ్చు.
ఉద్యోగాలు పోతాయా? (Mass Layoffs)
ఈ నివేదికలో అత్యంత భయంకరమైన విషయం ఉద్యోగాల కోత. ముఖ్యంగా వైట్ కాలర్ (సాఫ్ట్ వేర్, మేనేజ్‌మెంట్) ఉద్యోగాలపై ఏఐ ప్రభావం తీవ్రంగా ఉంటుందని పేర్కొంది.
- ఏఐ కొత్త ఉద్యోగాలను సృష్టిస్తుంది (ప్రాంప్ట్ ఇంజనీర్లు, ఏఐ సేఫ్టీ రీసెర్చర్లు), కానీ, అవి పోయే ఉద్యోగాల సంఖ్యతో పోలిస్తే చాలా తక్కువ.
- కొత్తగా వచ్చే ఉద్యోగాల జీతాలు కూడా పాత ఉద్యోగాల కంటే చాలా తక్కువగా ఉంటాయి. ఏఐ వల్ల లక్షలాది మందికి లేఆఫ్స్ (Layoffs) తప్పవని నివేదిక సారాంశం.
మరి పరిష్కారం ఏంటి?
ఈ సంక్షోభం నుంచి దేశాలను కాపాడేందుకు రచయిత అలాప్ షా ఒక సలహా ఇచ్చారు. అదే "AI Tax". ఏఐ వాడకం వల్ల కంపెనీలకు వచ్చే అదనపు లాభాలపై పన్ను విధించి, ఆ డబ్బును నిరుద్యోగులుగా మారిన ప్రజల సంక్షేమం కోసం వాడాలని ఆయన సూచించారు. మార్కెట్లు ప్రస్తుతం చాలా అస్థిరంగా ఉన్నాయని, ట్రేడర్లు జాగ్రత్తగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
More From GoodReturns

వెండి ధరలు బిగ్ క్రాష్.. దెబ్బకు నిలిచిపోయిన ట్రేడింగ్.. లబోదిబోమంటున్న పెట్టుబడిదారులు

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..



Click it and Unblock the Notifications