ఇటీవల సిటీబ్యాంకు పొరపాటుగా సౌందర్య ఉత్పత్తుల దిగ్గజం రెవ్లాన్ కంపెనీకి చెందిన 900 మిలియన్ డాలర్లు(రూ.6700 కోట్లకుపైగా)ను ఆ కంపెనీ రుణదాతల అకౌంట్లలో వేసింది. క్లరికల్ లోపం కారణంగా ఈ పొరపాటు చోటు చేసుకుంది. సిటీ బ్యాంకు అమెరికాలో మూడో అతిపెద్ద రుణదాత. పొరపాటున రెవ్లాన్ సంస్థ రుణదాతల అకౌంట్లలో పడిన మొత్తాన్ని తిరిగి పొందే ప్రయత్నంలో భాగంగా శుక్రవారం మూడోసారి దావా వేసింది. సిటీ బ్యాంకు డజనుకు పైగా కంపెనీలపై దావా వేసింది.

వెనక్కి వచ్చిన కొంతమొత్తం
రెవ్లాన్ రుణదాతల అకౌంట్లలో పొరపాటున అమౌంట్ పడిన అనంతరం వాటిని తిరిగి పొందేందుకు సిటీ బ్యాంకు వివిధ మార్గాల్లో ప్రయత్నాలు చేసింది. ఆ మొత్తం తిరిగి పంపించాలని కోరింది. దీంతో కొన్ని వందల మిలియన్ డాలర్ల కరెన్సీ తిరిగి వచ్చింది. దాదాపు నాలుగు వందల మిలియన్ డాలర్ల మేర తిరిగి వచ్చింది. మిగతా 500 మిలియన్ డాలర్ల మొత్తాన్ని తిరిగి ఇచ్చేందుకు ఆయా సంస్థలు నో చెబుతున్నాయి. దీంతో సీటీ బ్యాంకు దావా వేస్తోంది. ఆ మొత్తం సిటీ బ్యాంకుకు చెందినదని, అవి తిరిగి రావాలని ఆ బ్యాంకు చెబుతోంది. న్యాయం తమ వైపు ఉందని, కాబట్టి ఆ ఫండ్స్ తిరిగి వస్తాయని సిటీ బ్యాంకు ఓ ప్రకటనలో తెలిపింది.

ఏం జరిగింది?
కరోనా మహమ్మారి వల్ల రెవ్లాన్ ఆర్థికంగా చితికిపోయింది. రుణదాతలకు దాదాపు 3 బిలియన్ డాలర్ల మేర బకాయిపడింది. సమయానికి చెల్లించకపోవడంతో రుణదాతలు అసహనంతో ఉన్నాయి. టర్మ్ లోన్‌ను 2023 లోపు చెల్లించాలని డిమాండ్ చేస్తూ రెవ్లాన్‌పై కేసులు వేశాయి. ఈ కేసులో సిటీ బ్యాంకును ప్రతివాదిగా చేర్చాయి. ఈ పరిస్థితుల్లో 900 మిలియన్ డాలర్ల మొత్తాన్ని క్లరికల్ ఎర్రర్ కారణంగా రెవ్లాన్ ఖాతా నుండి రుణదాతల ఖాతాల్లోకి వెళ్లింది. అప్పటికే తమ బకాయిలు తిరిగి చెల్లించే అంశానికి సంబంధించి రుణదాత సంస్థలు అసహనంతో ఉన్నాయి. ఇప్పుడు తమ అకౌంట్లలో డబ్బులు పట్టాయి. దీంతో అవి ఊరట పొందాయి.

వెనక్కి ఇచ్చేందుకు
ఖాతాల్లోపడిన మొత్తాన్ని తిరిగిచ్చేందుకు రుణసంస్థలు నిరాకరిస్తున్నాయి. దాదాపు సగం వరకు వెనక్కి వచ్చింది. మిగతా సంస్థలు నో చెబుతున్నాయి. ఇది బిలియన్ డాలర్ల క్లరికల్ లోపమని ఫార్మర్ రీస్ట్రక్చరింగ్ అండ్ బ్యాంక్రప్టసీ అడ్వైజర్ మైఖేల్ స్టాంటోన్ అన్నారు. పొరపాటు చాలా దారుణమని, దాదాపు బిలియన్ డాలర్ల మేర అకౌంట్లలోకి వెళ్లడం ఈ శతాబ్దానికే అతిపెద్ద పొరపాటు అని చెబుతున్నారు.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Interest rates Hike: త్వరలో ప్రపంచవ్యాప్తంగా పెరగనున్న వడ్డీ రేట్లు.. మన EMIలు కూడా పెరుగుతాయా?



Click it and Unblock the Notifications