$280కి బదులు $81 ట్రిలియన్లు పంపింది..సిటీ గ్రూప్ బ్యాంక్ తర్వాత ఏం చేసిందో తెలుసా?
సిటీ గ్రూప్ బ్యాంకు ఉద్యోగులు చేసిన ఓ తప్పు ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. సిటీ గ్రూప్ బ్యాంకు కస్టమరుకు $280 (రూ. 24,000)కు బదులుగా $81 ట్రిలియన్లు జమ చేసింది. ఈ విషయంలో ఫైనాన్షియల్ టైమ్స్ ప్రచురించిన నివేదికలో సిటీ గ్రూప్ గత ఏడాది పొరపాటున బ్యాంకు క్లయింట్‌లలో ఒకరికి $81 ట్రిలియన్లు (7000 లక్షల కోట్ల రూపాయలు) పంపిందని పేర్కొంది. 90 నిమిషాల్లోనే ఎర్రర్‌ను గుర్తించి డబ్బును తిరిగి పొందినట్లు వార్తా నివేదిక పేర్కొంది. ఈ సంఘటన గత ఏప్రిల్‌లో చోటు చేసుకుంది. దీనికి కారణం బ్యాంకు ఉద్యోగి టైపింగ్ లోపం వల్ల సంభవించడం, రెండవ ఉద్యోగి కూడా ఈ తప్పును గుర్తించకుండా వదిలేవదిలేయడం. దింతో ఈ మొత్తం కస్టమర్ అకౌంట్లోకి జమ అయ్యాయి.
ఈ ట్రాన్సక్షన్ పూర్తయిన 90 నిమిషాల తర్వాత మూడవ ఉద్యోగి దీనిని కనుగొన్నట్లు సమాచారం. లెడ్జర్ అకౌంట్ సమీక్షిస్తున్నప్పుడు ఈ లోపం కనుగొనబడిందని సిటీ గ్రూప్ ప్రతినిధి ఫైనాన్షియల్ టైమ్స్‌తో తెలిపారు. ఈ తప్పుడు లావాదేవీ కారణంగా బ్యాంకింగ్ సేవలపై లేదా కస్టమర్లపై ఎటువంటి నెగటివ్ ప్రభావం పడలేదని ఆయన పేర్కొన్నారు. గత సంవత్సరంలోనే, సిటీ గ్రూప్ బ్యాంక్ పొరపాటున 10 సార్లు కస్టమర్లకు డబ్బు పంపి, దానిని తిరిగి తీసుకుంది. గతంలో కూడా బ్యాంకు ఇలా పొరపాటున చాల సార్లు డబ్బు పంపింది. సిటీ గ్రూప్‌లో ఇలాంటి తప్పులు ప్రతి ఏటా జరుగుతూనే ఉన్నాయి.

ఈ సమస్యలను పరిష్కరించడానికి సాంకేతికంగా అలాగే సిబ్బందితో చర్యలు తీసుకుంటున్నప్పటికీ, సిటీ గ్రూప్ వీటిని పరిష్కరించడంలో విఫలమవడం ద్వారా బ్యాంకు ప్రతిష్టను దెబ్బతీసుకుంటూనే ఉంది. అదేవిధంగా, తప్పు చెల్లింపుల సమస్యను పరిష్కరించడంలో విఫలమైనందుకు సిటీ గ్రూప్ 2020లో $150 మిలియన్ల జరిమానా చెల్లించింది. సిటీ గ్రూప్ అనేది యునైటెడ్ స్టేట్స్‌లో ప్రధాన కార్యాలయం ఉన్న బ్యాంకింగ్ సేవల సంస్థ. ఈ బ్యాంకు 2024లో $81 బిలియన్ల ఆదాయాన్ని ఆర్జించింది. అమెరికన్ బ్యాంకులు నిత్యం ఇలాంటి తప్పు లావాదేవీలు నిర్వహిస్తాయని కూడా చెబుతున్నారు.


Click it and Unblock the Notifications