Citi Group: ఉద్యోగులకు 2023 చేదు జ్ఞాపకాలను మిగిల్చింది. లక్షలాది మంది కొలువులు కోల్పోయారు. ఆర్థికంగా పలు ఇబ్బందులు సైతం ఎదుర్కొన్నారు. కనీసం కొత్త ఏడాదిలోనైనా మంచి రోజులు వస్తాయని భావించారు. కానీ ఈసారి పరిస్థితి గతేడాది కంటే మరీ దారుణంగా తయారైనట్లు తెలుస్తోంది.
కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టి కనీసం రెండు వారాలు కాకముందే పలు దిగ్గజ కంపెనీలు తమ లేఆఫ్స్ ప్రణాళికలు ప్రకటించాయి. అమెజాన్, గూగుల్ వంటి అంతర్జాతీయ సంస్థలు ఉద్యోగులకు ఉద్వాసన పలికేందుకు ఇప్పటికే సిద్ధమయ్యాయి. తాజాగా ఈ జాబితాలోకి బ్యాంకింగ్ మేజర్ సిటీ గ్రూప్ వచ్చి చేరింది. రాబోయే రెండేళ్లలో తన మొత్తం శ్రామిక శక్తిలో 10 శాతం మేర కోతలు ఉంటాయని ప్రకటించింది.

నాల్గవ త్రైమాసిక ఫలితాలను సిటీ గ్రూప్ శుక్రవారం విడుదల చేసింది. ఇందులో 1.8 బిలియన్ డాలర్ల నష్టాన్ని నమోదు చేసినట్లు తెలిపింది. 3.8 బిలియన్ డాలర్ల రీస్ట్రక్టరింగ్, రష్యా నుంచి తిరోగమనం, అర్జెంటీనా వ్యవహారాలు ఇందుకు ప్రధాన కారణాలుగా వివరించింది. వీటిని దృష్టిలో పెట్టుకుని దాదాపు 20 వేల మంది సిబ్బందిని తొలగించాలని చూస్తున్నట్లు CEO జేన్ ఫ్రేజర్ తెలిపారు. 2024ని బ్యాంకింగ్ గ్రూప్‌కు టర్నింగ్ పాయింట్‌గా పేర్కొన్నారు.
'పలు అంశాల కారణంగా నాల్గవ త్రైమాసికం చాలా నిరాశాజనకంగా ఉంది. అయినప్పటికీ సిటీ గ్రూపుని సరళీకృతం చేయడంలో, 2023లో మా వ్యూహాన్ని అమలు చేయడంలో గణనీయమైన పురోగతి సాధించాము' అని ఫ్రేజర్ తెలిపారు. నివేదికల ప్రకారం ఇప్పటికే అనేక మార్లు ఉద్యోగుల ఉద్వాసన చేపట్టగా.. జనవరి 22న మరో రౌండ్ తొలగింపులు అమలు చేయనుంది.
More From GoodReturns

జోహో ఉద్యోగుల తొలగింపు: ఆ 300 మందికి ఏం జరిగింది?

6 వేల డాలర్ల మార్క్ దాటబోతున్న బంగారం ధర.. డాలర్ విలువ ఖేల్ ఖతం.. ప్రపంచ రారాజుగా పసిడి..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు పసిడి రేటు ఎంత వరకు తగ్గిందంటే.. ఏప్రిల్ 13, సోమవారం ధరలు ఇవే..

బెంగళూరులో రూ. 5 వేలకే రూమ్..ఈ ఏరియాలోకి రమ్మని పిలుస్తున్న ఇంటి ఓనర్లు..

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

విజయవాడ నుంచి హైదరాబాద్‌కు గంటే ప్రయాణం.. 220 కి.మీ స్పీడ్‌తో కొత్త రైలు.. వందే భారత్ కన్నా ఫాస్ట్..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

కుప్పకూలిన బంగారం ధరలు.. భారీ తగ్గుదలతో ఈ రోజు పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 9, గురువారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications