Tata Share: టాటా గ్రూప్ అంటే స్టాక్ మార్కెట్ల గురించి అస్సలు ఏమీ తెలియని సాధారణ భారతీయుడికి సైతం విశ్వాసం. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి వారు అనేక రంగాల్లో తెచ్చిన మార్పులు ప్రజల జీవితాల్లో చాలా మార్పులు తీసుకురావటం ప్రత్యక్షంగా గమనించాం.
ఈ క్రమంలో వారం మెుదటి ట్రేడింగ్ రోజున టాటా గ్రూప్‌కు చెందిన టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్ షేర్లలో అనూహ్య పెరుగుదల కనిపించింది. ట్రేడింగ్ సమయంలో స్టాక్ దాదాపు 3 శాతం మేర లాభపడింది. అయితే మార్కెట్ ముగిసే సమయానికి స్టాక్ ధర రూ.862.40గా ఉంది. గతవారం స్టాక్ తన 52 వారాల గరిష్ఠమైన రూ.877 మార్కును తాకింది. దీనికి ముందు మార్చి 16న స్టాక్ తన 52 వారాల కనిష్ఠ ధర రూ.685ను తాకింది.

అయితే టాటాలకు చెందిన ఈ కంపెనీ షేర్లపై నిపుణులు బులిష్‌గా ఉన్నారు. సిటీ బ్రేకరేజ్ టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్ షేరు టార్గెట్ ధరను రూ.1,020గా ప్రకటించింది. సమీప భవిష్యత్తులో కంపెనీ షేర్లు 21 శాతం మేర వృద్ధిని నమోదు చేయవచ్చని బ్రోకరేజ్ అంచనా వేస్తూ BUY రేటింగ్ ఇచ్చింది. ఇదే సమయంలో మార్కెట్లోని 22 మంది నిపుణులు సైతం కంపెనీ షేర్లకు కొనుగోలు రేటింగ్ అందించారు. కంపెనీ పనితీరు మరింతగా మెరుగుపడుతుందని గ్లోబల్ బ్రోకరేజ్ సంస్థ సిటీ అంచనా వేస్తోంది.
మార్చితో ముగిసిన త్రైమాసికంలో టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్ రూ.268 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. మార్చి త్రైమాసికంలో కార్యకలాపాల ద్వారా దాని ఆదాయం ఏడాది ప్రాతిపదికన 14% వృద్ధితో రూ.3,619 కోట్లుగా ఉంది.

Note: పైన అందించిన వివరాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. అయితే వీటి ఆధారంగా ఎలాంటి ట్రేడింగ్ నిర్ణయాలు తీసుకోకండి. స్టాక్ మార్కెట్ పెట్టుబడులు నష్టాలతో కూడుకున్నవి. పెట్టుబడి నిర్ణయాలు తీసుకునే ముందు తప్పనిసరిగా మీ ఆర్థిక సలహాదారుడిని సంప్రదించండి.


Click it and Unblock the Notifications