ఈ వారం ప్రారంభంలో అంతర్జాతీయ బంగారం మార్కెట్‌లో గణనీయమైన మార్పులు చోటుచేసుకున్నాయి. బంగారం ధరలు ఒక్కసారిగా క్షీణించడంతో ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడిదారులు ఆందోళన చెందుతున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో ప్రముఖ గ్లోబల్ రీసెర్చ్ సంస్థ సిటీగ్రూప్ (Citigroup) రాబోయే నెలల బంగారం ధర అంచనాలను గణనీయంగా తగ్గించింది. విశ్లేషకుల ప్రకారం.. ప్రపంచ వాణిజ్య ఉద్రిక్తతలు తగ్గుతున్న సంకేతాలు, అమెరికా ఆర్థిక స్థిరత్వం పునరుద్ధరణ, పెట్టుబడిదారుల రిస్క్ ఆసక్తి పెరగడం బంగారం డిమాండ్‌పై ప్రతికూల ప్రభావం చూపిస్తున్నాయి.
అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర ఔన్సుకు 4,000 డాలర్ల మార్క్‌ను దాటిన తర్వాత తిరిగి 3,800 డాలర్ల కంటే తక్కువ స్థాయికి పడిపోయింది. దీనికి ప్రధాన కారణం అమెరికా-చైనా వాణిజ్య చర్చలలో సానుకూల పురోగతికావడం. వాణిజ్య యుద్ధం తీవ్రత తగ్గుతుందనే సంకేతాలతో పెట్టుబడిదారులు Gold వంటి సురక్షిత పెట్టుబడుల నుండి ఇతర అధిక లాభదాయక రంగాల వైపు మళ్లుతున్నారు.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల చైనా, బ్రెజిల్, మలేషియా వంటి దేశాలతో వాణిజ్య ఒప్పందాలపై దృష్టి పెట్టడం, చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్ కూడా సహకారం చూపడం వల్ల, ప్రపంచ ఆర్థిక స్థిరత్వం మెరుగవుతుందనే అంచనాలు మార్కెట్‌లో కనిపిస్తున్నాయి. ఈ పరిణామాలు బంగారం మీద ఆధారపడే హెడ్జింగ్ డిమాండ్‌ను తగ్గిస్తున్నాయి.
తాజా పరిణామాలను దృష్టిలో ఉంచుకుని, సిటీగ్రూప్ తన 3 నెలల బంగారం లక్ష్య ధరను ఔన్సుకు 4,000 డాలర్ల నుండి 3,800 డాలర్లకు తగ్గించింది. అలాగే వెండి (Silver) ధర అంచనాను కూడా 55 డాలర్ల నుండి 42 డాలర్లకి సవరించింది. సంస్థ విశ్లేషకుల ప్రకారం, Gold తదుపరి ప్రధాన మద్దతు స్థాయి (support level)3,600 డాలర్ల వద్ద ఉండే అవకాశం ఉంది.సిటీ నివేదిక ప్రకారం వాణిజ్య ఉద్రిక్తతలు తగ్గుతుండడంతో బంగారం ఆకర్షణ తగ్గింది. ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేటు తగ్గింపుల ప్రభావం తాత్కాలికంగా మాత్రమే ఉంటుందని భావిస్తున్నామని పేర్కొంది.
ఈ సంవత్సరం ప్రారంభంలో బంగారం ధర ఔన్సుకు 2,700 డాలర్ల వద్ద ఉండగా, జూలై నాటికి అది 4,380 డాలర్ల వరకు పెరిగింది. ఆ పెరుగుదల ప్రధానంగా అమెరికా రాజకీయ అనిశ్చితి, వాణిజ్య యుద్ధం, మాంద్యం భయాల వల్ల వచ్చింది. అయితే ఇప్పుడు పరిస్థితులు మారుతున్నాయి. వాణిజ్య ఒప్పందాల సానుకూల సంకేతాలు, ద్రవ్యోల్బణం నియంత్రణ, కేంద్ర బ్యాంకుల బంగారం కొనుగోళ్లు మందగించడం వల్ల ధరలు స్థిరపడుతున్నాయి.
సిటీ విశ్లేషణ ప్రకారం, బంగారం ధర గరిష్ట స్థాయిలో ఉన్నప్పుడు పెట్టుబడిదారులు దాదాపు 17 ట్రిలియన్ డాలర్ల విలువైన లాభాలు సంపాదించారు. వీరిలో కేవలం 2 శాతం మంది మాత్రమే లాభాలను రియలైజ్ చేసినప్పటికీ, ఆ మొత్తమే ఒక సంవత్సరం ప్రపంచ బంగారం ఉత్పత్తికి రెండింతలుగా ఉంది. అంటే, పెద్దమొత్తంలో అమ్మకాలు జరిగితే మార్కెట్‌పై తీవ్రమైన ఒత్తిడి ఏర్పడే అవకాశం ఉంది. ప్రస్తుతం బంగారం ధరల తగ్గుదలతో పెట్టుబడిదారులు రెండు విభాగాలుగా విడిపోయారు. కొందరు దీన్ని కొనుగోలు అవకాశంగా చూస్తుండగా, మరికొందరు మరింత పతనం వచ్చే ప్రమాదం ఉందని భావిస్తున్నారు.
ప్రపంచ బంగారు మండలి (WGC) ప్రకారం, కేంద్ర బ్యాంకుల కొనుగోళ్లు ఇటీవల తగ్గడం మార్కెట్ స్థిరత్వానికి పరీక్షగా మారింది. ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేటు నిర్ణయాలు, అమెరికా-చైనా వాణిజ్య చర్చల దిశ, జియోపాలిటికల్ పరిణామాలు రాబోయే వారాల్లో బంగారం పథాన్ని నిర్ణయించనున్నాయి. సిటీగ్రూప్ విశ్లేషకుల మాటల్లో చెప్పాలంటే వాణిజ్య ఉద్రిక్తతలు తగ్గితే బంగారం నుండి పెట్టుబడిదారుల తరలింపు వేగంగా ఉంటుంది. తాత్కాలికంగా మార్కెట్ ఒత్తిడిలో ఉన్నప్పటికీ, దీర్ఘకాలంలో స్థిరపడే అవకాశం ఉందని చెబుతోంది.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి
More From GoodReturns

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

10 వేల డాలర్లకు బంగారం ధర.. షాకింగ్ అంచనాలను విడుదల చేసిన యార్డెని రీసెర్చ్..

బంగారం ధరలు కాస్త శాంతించాయి.. లక్షా యాభై వేల రూపాయల దిగువకు.. మార్చి 21, శనివారం ధరలు ఇవే..

ఓ వైపు బంగారం.. మరో వైపు చమురు.. ఇరాన్ యుద్ధం వేళ రష్యా దిమ్మతిరిగే ప్లాన్..

కుప్పకూలిన బంగారం, వెండి ధరలు .. గంటల వ్యవధిలో 2 ట్రిలియన్ డాలర్లు ఆవిరి.. కారణం ఏంటంటే..

ఇరాన్ యుద్ధాన్ని బంగారంపై అస్త్రంగా వాడుకుంటున్న చైనా.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పునాదులపై భారీ స్కెచ్..

గత 15 ఏళ్ళ రికార్డును తిరగరాస్తూ బంగారం, వెండి ధరలు ఢమాల్..భవిష్యత్తులో తగ్గుదలపై విశ్లేషకులు ఏమంటున్నారంటే..

Today Gold Silver Rate Live: బంగారం ధరలు భారీగా పతనం.. పెట్టుబడిదారుల్లో తీవ్ర ఆందోళన.. సామాన్యులకు ఊరట



Click it and Unblock the Notifications