Cisco layoffs: జీతాల పెంపు, ప్రమోషన్లు అంటూ ఎన్నో ఆశలు పెట్టుకున్న టెక్కీల పరిస్థితి నానాటికీ ఇబ్బందికరంగా మారుతోంది. స్టార్టప్‌ల నుంచి మల్టీ నేషనల్ కంపెనీల వరకు ఎప్పుడు లేఆఫ్ ఇస్తాయో తెలియని సందిగ్ధం నెలకొంది. రోజులు గడుస్తున్నా ఈ విషయంలో మాత్రం ఎటువంటి మార్పు కనిపించడం లేదు. ఖర్చులు తగ్గింపు, AI వంటి ఇతర టెక్నాలజీల్లో పెట్టుబడుల సాకుతో ఆయా సంస్థలు ఉద్యోగులపై వేటు వేస్తున్నాయి. ఈ పోకడ కాస్తా కొత్తగా IT రంగంలోకి రావాలనుకునే వారిలో భయాందోళన కలిగిస్తోంది.
నెట్‌వర్కింగ్ దిగ్గజం సిస్కో తన గ్లోబల్ వర్క్ ఫోర్స్‌లో 7 శాతం మందిని తొలగించనున్నట్లు ప్రకటించి షాక్ ఇచ్చింది. సైబర్ సెక్యూరిటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి టెక్నాలజీలపై దృష్టి సారించడమే ఇందుకు కారణమని తెలిపింది. ఆ రంగాలలో అధిక వృద్ధిని సాధించవచ్చు అని తాము భావిస్తున్నట్లు పేర్కొంది. ఇప్పటికే ఓసారి ఉద్యోగులపై వేటు వేయగా ఈ ఏడాదిలో ఇది రెండోసారి కావడం గమనార్హం.

తొలగించనున్న ఉద్యోగుల సంఖ్యను సిస్కో అధికారికంగా వెల్లడించలేదు. అయితే కంపెనీకి ప్రపంచవ్యాప్తంగా 84 వేల 900 మంది సిబ్బంది ఉన్నారు. వారిలో 7 శాతం అంటే దాదాపు 6 వేల మందిపై దీని ప్రభావం ఉండనుంది. గతంలో ఫిబ్రవరిలోనూ 4 వేల మందికి కంపెనీ వీడ్కోలు పలికింది. సంస్థ త్రైమాసిక ఆదాయం కూడా 10 శాతం మేర క్షీణించడంతో ఈ నిర్ణయం తీసుకోక తప్పలేదని కంపెనీ వర్గాలు తెలిపాయి.
AI స్టార్టప్స్ లో పెట్టుబడులు పెట్టడానికి జూన్ లో ఇప్పటికే 1 బిలియన్ డాలర్లను సిస్కో కేటాయించింది. సైబర్ సెక్యూరిటీ సంస్థ ప్లంక్‌ను 28 బిలియన్ డాలర్లకు ఇటీవలే కొనుగోలు చేసింది. పునర్ నిర్మాణంలో భాగంగా తన సెక్యూరిటీ, నెట్‌వర్కింగ్, కొలాబరేషన్ విభాగాలను కలిపి ఒకే సంస్థగా మార్చాలని భావిస్తోంది. ఈ మేరకు తన ప్రణాళికలను SEC ఫైలింగ్ లో వెల్లడించింది. ఈ విషయం తెలుసుకున్న ఉద్యోగుల్లో ఆందోళన నెలకొంది.
More From GoodReturns

Gold silver: బంగారం, వెండి కొనాలా? వద్దా? మార్కెట్లో వింత పరిస్థితి.. నిపుణుల సలహా ఇదే!

ప్రపంచం ముప్పు ముంగిట్లో ఉంది.. ఈ మూడు ఆస్తులు తప్ప మిమ్మల్ని ఏవీ కాపాడలేవంటున్న కియోసాకి..

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

6 వేల డాలర్ల మార్క్ దాటబోతున్న బంగారం ధర.. డాలర్ విలువ ఖేల్ ఖతం.. ప్రపంచ రారాజుగా పసిడి..

బెంగళూరులో రూ. 5 వేలకే రూమ్..ఈ ఏరియాలోకి రమ్మని పిలుస్తున్న ఇంటి ఓనర్లు..

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం



Click it and Unblock the Notifications