ఆతిథ్యం, టూరిజం, విమానయానం, రిటైల్ వంటి తీవ్ర ఒత్తిడిలో ఉన్న రంగాలకు అత్యవసర రుణ పరపతి హామీ పథకాన్ని (ECLGS) విస్తరింప చేయాలన కేంద్ర ఆర్థికమంత్రిత్వ శాఖకు కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ(CII) లేఖ రాసింది. ఈ రంగాలను ఎక్కువకాలం వదిలేస్తే ఆర్థిక రికవరీకి విఘాతం కలుగుతుందని పేర్కొంది. ఉద్యోగాల కల్పన ఎక్కువగా ఉండే ఈ రంగాలను ఆధుకుంటే ఆర్థిక రికవరీ వేగవంతమవుతుందని తెలిపింది. ఈ రంగాలకు ప్యాకేజీ ప్రకటిస్తే పెద్ద ఎత్తున ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని తెలిపింది.
ఆర్థిక వ్యవస్థ రికవరీకి ప్రభుత్వం చేపడుతున్న చర్యలను ప్రశంసించింది. కరోనా మహమ్మారి కారణంగా ప్రభుత్వానికి ఆదాయపరంగా వచ్చిన ఇబ్బంది తమకు తెలుసునని తెలిపింది. కానీ ఎంఎస్ఎంఈలకు ఇచ్చిన తరహాలో ఈ రంగాలకు మద్దతు అవసరమని వెల్లడించింది. ఎమర్జెన్సీ లోన్ క్రెడిట్ గ్యారెంటీ స్కీం(ECLGS)ను కేంద్ర ప్రభుత్వం మే నెలలో ప్రకటించిన విషయం తెలిసిందే. ఆత్మనిర్భర్ భారత్ ప్యాకేజీ కింద రూ.3 లక్షల కోట్లను ప్రకటించింది.

ECLGS కింద ఇప్పటికే రూ.1.48 లక్షల కోట్లను ఎంఎస్ఎంఈలకు అందించారు. రూ.2.03 లక్షల కోట్లు మంజూరు చేశారు. ఈ స్కీం గడువు అక్టోబర్ 31వ తేదీన ముగిసింది. అయితే స్కీం లక్ష్యం రూ.3 లక్షల కోట్లను అందుకోకపోవడంతో నవంబర్ 30వ తేదీకి పొడిగించారు.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..



Click it and Unblock the Notifications