పాత కార్లు, సెకండ్ హ్యాండ్ ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ)పై జీఎస్టీని పెంచే అంశాన్ని జీఎస్టీ కౌన్సిల్ పరిశీలిస్తోంది. ఒకవేళ అదే జరిగితే వీటిపై జీఎస్టీని 12% నుండి 18% వరకు పెంచవచ్చు. దీంతో పాటు పొగాకు, సిగరెట్ వంటి ఉత్పత్తులపై కూడా జీఎస్టీ 28% నుంచి 35% వరకు పెరిగే అవకాశం కనిపిస్తుంది.ఈ నెల డిసెంబరు 20-21 తేదీల్లో రాజస్థాన్‌లోని జైసల్మేర్‌లో జరగనున్న 55వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో వీటి పై నిర్ణయం తీసుకోనున్నారు. ఈ నిర్ణయం వల్ల పాత వాహనాలు, సెకండ్ హ్యాండ్ ఈవీల ధరలు కూడా పెరిగే అవకాశం ఉంది. పొగాకు ఉత్పత్తులపై జీఎస్టీ 28% నుంచి 35%కి పెరగవచ్చు. ఈ మార్పులు సామాన్యులపై కొంత ప్రభావం చూపుతాయి. వాహనాల ధరలతో సహా సిగరెట్లు, పొగాకు కూడా మరింత కాస్ట్లీ అవుతుంది.
పాత కార్లపై జీఎస్టీ పెంపు ప్రతిపాదన
GST ఫిట్‌మెంట్ కమిటీ సెకండ్ హ్యాండ్ కార్లు, EVలపై GST పెంపును ప్రతిపాదించింది. ప్రస్తుతం చాలా పాత వాహనాలపై 12% GST వర్తిస్తుంది. ఈ ప్రతిపాదన ఆమోదం పొందితే పాత వాహనాలు మరింత కాస్ట్లీ కానున్నాయి. ముఖ్యంగా ఈవీల ధరలు ప్రభావితం కానున్నాయి. కొత్త EVలపై 5% GST ఉండగా, పాత EVలపై 18% GST ఉంది. SUVలపై 22% సెస్ కూడా విధిస్తారు. దీనిపై కౌన్సిల్ సమావేశంలో కూడా స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఈ సెస్ ఇంకా పూర్తిగా అమలు కాలేదు. దీని అమలుతో SUV ధరలు కూడా పెరగవచ్చు.

పొగాకు, సిగరెట్లపై పన్ను పెరిగే అవకాశాలు
పొగాకు, సిగరెట్లపై జీఎస్టీని పెంచుతూ మంత్రుల బృందం (GoM) తాజాగా నిర్ణయం తీసుకుంది. బీహార్ ఉప ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరి ఈ జీవోకు నేతృత్వం వహిస్తున్నారు. పొగాకు ఉత్పత్తులపై జీఎస్టీ 35% పెంచాలని ఆయన ప్రతిపాదించారు. ప్రస్తుతం ఈ ఉత్పత్తులపై 28% జీఎస్టీ విధిస్తున్నారు. ఈ ప్రతిపాదనపై జీఎస్టీ కౌన్సిల్ ఫైనల్ నిర్ణయం తీసుకోనుంది. GST కౌన్సిల్ అనేది కేంద్రం అండ్ రాష్ట్రాల ఉమ్మడి వేదిక. దీనిని ఆర్టికల్ 279A(4) ప్రకారం ఏర్పడింది. ఇక్కడ GSTకి సంబంధించిన అన్ని విషయాలపై సిఫార్సులను అందిస్తుంది. దీని 55వ సమావేశం ఈ నెల 21 డిసెంబర్ 2024న జైసల్మేర్‌లో నిర్వహించనున్నారు. ఈ సమావేశం ఎన్నో విధాలుగా ముఖ్యమైనది. దీని నిర్ణయాలు సామాన్యుల ఆదాయం పై ప్రభావం చూపవచ్చు. మరి కౌన్సిల్ ఈసారి ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి. సామాన్యులకు ఊరటనిస్తుందా లేక భారం పెంచుతుందా ? కాలమే సమాధానం చెప్పాలి. అయితే ఈ సమావేశం నిర్ణయాలపైనే అందరి చూపు ఉండటం గమనార్హం.
More From GoodReturns

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

క్రెడిట్ కార్డ్ లాంజ్ యాక్సెస్ నిబంధనలు మారాయి: ప్రయాణికులకు షాక్

JD Vance: ముగిసిన చర్చలు! ఆ విషయంలో తగ్గేదేలే అంటున్న ఇరాన్.. యుద్ధం మళ్లీ మొదలైనట్టేనా?

Personal loan: బ్యాంకులు మీ లోన్ అప్లికేషన్ను ఎందుకు తిరస్కరిస్తున్నాయి? అసలు గుట్టు విప్పిన ఆర్థిక నిపుణులు!

బంగారం ధరల ఈ స్థాయికి వస్తేనే కుప్పకూలుతాయి..లేదంటే 7 వేల డాలర్ల పైమాటే, స్విస్ బ్యాంక్ నుంచి సంచలన నివేదిక..

Trading: యుద్ధం మీద బెట్టింగ్.. గంటల్లోనే లక్షాధికారులు! అసలేం జరిగిందంటే..

బెంగళూరు రియల్ ఎస్టేట్.. మెట్రో బ్లూ లైన్ రాకతో ఈ ఏరియాలో ఇళ్ల కోసం ఎగబడుతున్న ఇన్వెస్టర్లు..

Bengaluru: రియల్ ఎస్టేట్లో మారిన లెక్కలు! బెంగళూరు, హైదరాబాద్లో ట్రెండ్ ఎలా ఉందంటే..



Click it and Unblock the Notifications