మీకు స్మోకింగ్ అలవాటు ఉందా? అయితే మీ జేబుకు గట్టి దెబ్బ తగిలే రోజు వచ్చేసింది. కేంద్ర ప్రభుత్వం సిగరెట్లపై ఎక్సైజ్ డ్యూటీని పెంచుతూ తీసుకున్న నిర్ణయంతో మార్కెట్లో సిగరెట్ (Cigarette) ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. దాదాపు ఏడేళ్ల విరామం తర్వాత ప్రభుత్వం ఈ స్థాయిలో పన్నులను సవరించడం ఇదే తొలిసారి. ఈ కొత్త మార్పుల వల్ల సాధారణ సిగరెట్ల నుంచి ప్రీమియం బ్రాండ్ల వరకు అన్నింటి ధరలూ భారీగా పెరిగాయి.
ధరలు ఎంత పెరిగాయి?
కొత్త ఎక్సైజ్ డ్యూటీ నిబంధనలు అమలులోకి వచ్చిన తర్వాత.. ఒక్కో సిగరెట్ ప్యాకెట్ (10 స్టిక్స్) ధర కనిష్టంగా రూ. 20 నుంచి రూ. 25 వరకు పెరిగింది. ఇది కేవలం ప్రారంభం మాత్రమే! మీరు తాగే సిగరెట్ పొడవు (Length), బ్రాండ్‌ను బట్టి ఈ పెంపు రూ. 55 వరకు ఉండవచ్చని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.

ఉదాహరణకు ఇప్పటివరకు రూ. 95 కి లభించే విల్స్ నేవీ కట్ (76 mm) ప్యాకెట్ ఇకపై రూ. 120 కి చేరే అవకాశం ఉంది. అలాగే గోల్డ్ ఫ్లేక్ కింగ్స్, క్లాసిక్ మైల్డ్స్ వంటి 84 mm సిగరెట్ల ధర రూ. 170 నుంచి ఏకంగా రూ. 225 కి పెరిగేలా కనిపిస్తోంది. ప్రీమియం సెగ్మెంట్లో ఉండే స్లిమ్ సిగరెట్ (Cigarette) ప్యాకెట్ల ధర రూ. 300 నుంచి రూ. 350 వరకు పెరగనుంది.
పన్నుల విధానంలో మార్పులు ఇవే..
ఇప్పటివరకు సిగరెట్లపై 28% GST తో పాటు కాంపెన్సేషన్ సెస్ ఉండేది. కానీ, ఫిబ్రవరి 2026 నుంచి ప్రభుత్వం ఈ విధానాన్ని మార్చేసింది. ఇప్పుడు అత్యధికంగా 40% GST తో పాటు అదనపు ఎక్సైజ్ డ్యూటీ, సెస్ కూడా వర్తిస్తాయి. దీనికోసం సెంట్రల్ ఎక్సైజ్ చట్టాన్ని కూడా సవరించారు. దీనివల్ల ప్రతి సిగరెట్ స్టిక్ పైన దాని పొడవును బట్టి పన్ను విధిస్తారు. అంతర్జాతీయ ఆరోగ్య ప్రమాణాలకు అనుగుణంగా పొగాకు ఉత్పత్తుల వినియోగాన్ని తగ్గించడమే ఈ నిర్ణయం వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశ్యం అని ప్రభుత్వం చెబుతోంది.
స్టాకిస్టులు , చిరు వ్యాపారుల ఆందోళన
ఈ ధరల పెరుగుదల కేవలం వినియోగదారులనే కాకుండా, వ్యాపారులను కూడా కలవరపెడుతోంది. కొత్త పన్ను విధానం వల్ల పాత స్టాక్ అయిపోయిన తర్వాత కొత్త MRP లతో కూడిన స్టాక్ మార్కెట్లోకి రావడానికి కొంత సమయం పడుతుంది. ఈలోగా కృత్రిమ కొరత ఏర్పడే ప్రమాదం ఉంది. మరోవైపు ధరలు పెరగడం వల్ల అక్రమ రవాణా (Smuggling) , నకిలీ సిగరెట్ల చలామణి పెరిగే అవకాశం ఉందని 'ఆల్ ఇండియా సిగరెట్ అండ్ టొబాకో డిస్ట్రిబ్యూటర్స్ ఫెడరేషన్' ఆందోళన వ్యక్తం చేస్తోంది. సాధారణ చిరు వ్యాపారులు నకిలీ ఉత్పత్తుల వల్ల నష్టపోయే ప్రమాదం ఉందని వారు హెచ్చరిస్తున్నారు.
మొత్తానికి కేంద్ర బడ్జెట్ 2026 తర్వాత వచ్చిన ఈ మార్పులు ధూమపానం చేసేవారి బడ్జెట్‌ను పూర్తిగా మార్చేయనున్నాయి. ఆరోగ్య రీత్యా ఇది మంచి నిర్ణయమే అయినప్పటికీ, సామాన్య , మధ్యతరగతి వినియోగదారులపై ఇది ఆర్థిక భారాన్ని మోపనుంది.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!



Click it and Unblock the Notifications