కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ వేళ సామాన్యుడి ఆరోగ్యంతో పాటు ఆదాయంపై కూడా దృష్టి సారించింది. ఫిబ్రవరి 1, 2026 నుంచి దేశవ్యాప్తంగా సిగరెట్లు, పొగాకు ఉత్పత్తులు , పాన్ మసాలా ధరలను పెంచబోతోంది. ఈ మేరకు ప్రభుత్వం కొత్త ఎక్సైజ్ డ్యూటీ (Excise Duty) నిర్మాణాన్ని అమల్లోకి తెచ్చింది. సమాజానికి హాని కలిగించే 'సిన్ గుడ్స్' (Sin Goods) పై పన్నులను అధికంగా ఉంచడం ద్వారా అటు ఆదాయాన్ని పెంచుకోవడంతో పాటు ఇటు వినియోగాన్ని తగ్గించాలని ప్రభుత్వం భావిస్తోంది.

కొత్త పన్ను విధానం ఎలా ఉండబోతోంది?
నేటి నుండి సిగరెట్ (Cigarette) , ఇతర పొగాకు ఉత్పత్తులపై అదనపు ఎక్సైజ్ డ్యూటీ విధించబడుతుంది. దీనికి అదనంగా పాన్ మసాలాపై కొత్తగా 'హెల్త్ అండ్ నేషనల్ సెక్యూరిటీ సెస్' ను కూడా చేర్చారు. గతంలో ఈ ఉత్పత్తులపై 28 శాతం జీఎస్టీతో పాటు కాంపెన్సేషన్ సెస్ ఉండేది. అయితే ఇప్పుడు ఆ స్థానంలో మరింత కఠినమైన పన్నుల విధానం అమల్లోకి వచ్చింది. ఫలితంగా మార్కెట్‌లో సిగరెట్ (Cigarette), పాన్ మసాలా వంటి ఉత్పత్తుల ధరలు పెరిగే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది.
MRP ఆధారిత పన్ను లెక్కింపు
ఇప్పటివరకు చాలా పొగాకు ఉత్పత్తులపై ఫ్యాక్టరీ విలువ ఆధారంగా పన్నులు లెక్కించేవారు. కానీ, ఫిబ్రవరి 1 నుంచి ప్రభుత్వం కొత్త MRP-ఆధారిత వాల్యుయేషన్ విధానాన్ని ప్రవేశపెట్టింది. చూయింగ్ టొబాకో, ఫిల్టర్ ఖైనీ, జర్దా , గుట్కా వంటి ఉత్పత్తుల ప్యాకెట్ మీద ముద్రించిన రిటైల్ ధర (MRP) ఆధారంగానే ఇకపై జీఎస్టీ లెక్కించబడుతుంది. దీనివల్ల పన్ను ఎగవేతలకు అడ్డుకట్ట పడుతుందని ప్రభుత్వం భావిస్తోంది.
పాన్ మసాలా కంపెనీలపై సిసిటివీ నిఘా!
పన్ను ఎగవేతలను అరికట్టడానికి ప్రభుత్వం తయారీదారులపై కఠిన నిబంధనలు విధించింది.
- పాన్ మసాలా తయారీదారులు కొత్త సెస్ చట్టం కింద ఫిబ్రవరి 1 నుంచే ఫ్రెష్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.
- ఫ్యాక్టరీలోని ప్యాకింగ్ మిషన్ల వద్ద తప్పనిసరిగా సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేయాలి.
- ఈ వీడియో రికార్డింగ్‌లను కనీసం రెండు సంవత్సరాల పాటు భద్రపరచాలి.
- ఫ్యాక్టరీలో ఎన్ని మిషన్లు ఉన్నాయి, వాటి సామర్థ్యం ఎంత అనే వివరాలను ఎక్సైజ్ అధికారులకు ముందే తెలపాలి.
ధరలపై ప్రభావం ఎంత?
ప్రభుత్వ లెక్కల ప్రకారం.. కొత్త మార్పులు వచ్చినప్పటికీ పాన్ మసాలాపై మొత్తం పన్ను భారం (40% GST తో కలిపి) ప్రస్తుతం ఉన్న 88 శాతానికి దగ్గరగానే ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారు. అయితే అదనపు సెస్ , ఎక్సైజ్ డ్యూటీ వల్ల పొగాకు బ్రాండ్లను బట్టి ధరల్లో మార్పులు ఉండే అవకాశం ఉంది. ఒకవేళ ఏదైనా మిషన్ 15 రోజుల పాటు పనిచేయకపోతే ఆ కాలానికి ఎక్సైజ్ డ్యూటీ మినహాయింపు పొందే వెసులుబాటును కూడా తయారీదారులకు కల్పించారు.
మొత్తానికి ఈ రోజు నుంచి పొగాకు ఉత్పత్తుల ధరలు మాత్రం పెరగబోతున్నాయి. ఆరోగ్యానికి హానికరమైన ఈ ఉత్పత్తుల ధరలు పెంచడం ద్వారా ప్రజలను వాటికి దూరం చేయాలనేది ప్రభుత్వ ప్రధాన ఉద్దేశం. పొగాకు తాగేవారు పెరిగిన ధరల కారణంగా వాటిని తగ్గిస్తారో లేదా అదే విధంగా కొనసాగిస్తారో చూడాలి.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్‌లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications