Adani Group: అదానీ కంపెనీని కొనేస్తున్న ఐటీసీ..!
Adani Group: అదానీ గ్రూప్ తన కోర్ వ్యాపారాలపై దృష్టి సారించే క్రమంలో కొన్ని వ్యాపారాల నుంచి ఇటీవల తప్పుకుంటున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఎఫ్ఎమ్‌సీజీ వ్యాపారాన్ని విక్రయించాలని చూస్తోంది.
ప్రముఖ మీడియా సంస్థ తాజా నివేదిక ప్రకారం అదానీ గ్రూప్ అదానీ విల్మార్‌లో తన వాటాను ఐటీసీకి విక్రయించవచ్చని వెల్లడైంది. ఎడిబుల్ ఆయిల్ తయారీ కంపెనీలో అదానీ గ్రూప్‌కు ఉన్న 44 శాతం వాటాను అదానీ విక్రయించాలని చూస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అనేక ఇన్వెస్టర్లతో వాటా విక్రయంపై చర్చలు కొనసాగుతున్నాయి. ఈ సమయంలో ఐటీసీ కొనుగోలు ఆసక్తి చూపినట్లు సమాచారం. అయితే దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.

దేశంలో పురాతనమైన, ఎఫ్ఎమ్‌సీజీ వ్యాపారంలో బలమైన ఆటగాడిగా కొనసాగుతున్న ఐటీసీ ఇప్పటికే అనేక ఉత్పత్తులను విక్రయిస్తోంది. కంపెనీ సన్‌ఫీస్ట్ బిస్కట్, ఆశీర్వాద్ గోధుమ పిండి, యప్పీ నూడుల్స్.. కంపెనీ ఎఫ్‌ఎంసీజీ ఆదాయంలో 83- 84 శాతం వాటా కలిగి ఉన్నాయి. 2023 ఆర్థిక సంవత్సరంలో ఈ ఉత్పత్తుల ద్వారా ఐటీసీ రూ.19,123 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది.
అయితే ప్రస్తుతం ఐటీసీ ఈ విభంగాంలో తన పోర్ట్‌ఫోలియోను మరింత విస్తరించాలనుకుంటోంది. చాలా కాలంగా ఎడిబుల్ ఆయిల్ వ్యాపారంలోకి ప్రవేశించేందుకు ఐటీసీ ఆసక్తి కనబరుస్తోంది. అందువల్ల ప్రస్తుతం అదానీ విల్మార్ వాటాలను కొంటుందా లేక తన సొంత బ్రాండ్ ఏర్పాటు చేసుకుంటుందా అనే విషయం తెలియాల్సి ఉంది. ఇదే సమయంలో అదానీ గ్రూప్ తన వాటాను విక్రయించటానికి GQG భాగస్వాములు, ఖతార్ ఇన్వెస్ట్‌మెంట్ అథారిటీ (QIA)తో చర్చలు జరుపుతోంది. అదానీ విల్మార్ వాటా విలువ రూ.20 నుంచి 24 వేల కోట్లుగా ఉంటుందని అంచనా వేస్తోంది.


Click it and Unblock the Notifications