బ్యాంకు లోన్ తీసుకోవాలంటే మొదట "సిబిల్ స్కోరు ఎంత?" అని అడిగే సీన్ మనం తరచుగా వింటుంటాం కానీ తాజాగా కేంద్రం ఒక ముఖ్యమైన క్లారిఫికేషన్ ఇచ్చింది మొదటిసారి లోన్ తీసుకునే వారికి సిబిల్ స్కోరు తప్పనిసరి కాదు.

లోక్‌సభలో మాట్లాడుతూ MoS పంకజ్ చౌధరి ఇలా చెప్పారు "RBI ఎక్కడా కనీస సిబిల్ స్కోర్ అనేది తప్పనిసరిగా పెట్టలేదు. కాబట్టి కేవలం 'స్కోరు లేదు' అని బ్యాంక్ మీ లోన్ అప్లికేషన్‌ను రిజెక్ట్ చేయకూడదు."
మరి సిబిల్ స్కోరు అంటే ఏమిటి?
సింపుల్‌గా చెప్పాలంటే, సిబిల్ స్కోరు అంటే ఒక మూడు అంకెల సంఖ్య (300-900 మధ్య). ఇది మీ క్రెడిట్ వర్ధినెస్ అంటే మీరు రుణం తీసుకుంటే తిరిగి చెల్లించే నమ్మకం ఎంత ఉందో చూపించే నంబర్. ఈ స్కోరు సిబిల్ (క్రెడిట్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఇండియా లిమిటెడ్) తయారు చేస్తుంది. ఎక్కువ స్కోరు ఉంటే లోన్ తీసుకోవడంలో సులభం అవుతుంది.
ఇప్పుడు మొదటిసారి రుణం తీసుకునే వారికి సిబిల్ స్కోరు తప్పనిసరి కాకపోయినా, బ్యాంకులు తమవంతు బ్యాక్‌గ్రౌండ్ చెక్ మాత్రం మిస్ అవ్వదు. స్కోరు లేకపోయినా బ్యాంకులు కూర్చొని "అయితే సరే, నేరుగా లోన్ ఇస్తాం" అనడం జరగదు. వాళ్లు మీ గత రుణ చరిత్రని గట్టిగా చెక్ చేస్తారు. పాత లోన్లు ఎలా రీపే చేశారో, ఎక్కడైనా లేట్ పేమెంట్స్ చేశారా, ఏమైనా లోన్లు సెటిల్ చేసారా లేదా రీ-స్ట్రక్చర్ చేశారా అన్నది మొత్తం గమనిస్తారు. అంతేకాదు, వ్రిటెన్ ఆఫ్ లోన్లు ఉంటే వాటిని కూడా సీరియస్‌గా తీసుకుంటారు. స్కోరు లేకపోయినా, మీ ఫైనాన్షియల్ బ్యాక్‌గ్రౌండ్ క్లీన్‌గా ఉంటే లోన్ మంజూరు అవుతుంది.
ఒకరి సిబిల్ స్కోర్ ఒక్కరోజులో ఏర్పడదు. మీ లోన్ రీపేమెంట్ హిస్టరీ, క్రెడిట్ కార్డు వాడకం, ఒకేసారి ఎంత లోన్ అప్లై చేసారు, పాత అకౌంట్స్ ఎంతకాలంగా కొనసాగుతున్నాయో అన్నీ కలిపే స్కోర్‌ను ప్రభావితం చేస్తాయి. ఉదాహరణకు, ప్రతి నెల బిల్లు టైమ్‌కి చెల్లిస్తే స్కోర్ మెరుగుపడుతుంది, కానీ పేమెంట్ మిస్ అయితే నేరుగా స్కోర్ పడిపోతుంది.
సిబిల్ స్కోర్ 750 కంటే ఎక్కువగా ఉంటే బ్యాంకులు, ఫైనాన్స్ కంపెనీలు మీపై ఎక్కువ నమ్మకం ఉంచుతాయి. ఫలితంగా, లోన్లు త్వరగా వస్తాయి, వడ్డీ రేటు తక్కువగా వస్తుంది, క్రెడిట్ కార్డు లిమిట్ పెరుగుతుంది. కొన్నిసార్లు ప్రీ-అప్రూవ్డ్ లోన్ ఆఫర్లు కూడా వస్తాయి.
చాలా మందికీ ఒక సందేహం "సిబిల్ రిపోర్ట్ తెప్పించుకోవాలంటే చాలా డబ్బు కట్టాలి ఏమో అని అనుకుంటారు. కానీ RBI రూల్స్ ప్రకారం, ఒక రిపోర్ట్ ధర కేవలం రూ.100 మాత్రమే. అదే కాకుండా, ప్రతి సంవత్సరం ఒకసారి పూర్తి రిపోర్ట్ CICలు ఉచితంగా ఇవ్వాల్సిందే. ఏడాదిలో కనీసం ఒకసారి మీరు మీ క్రెడిట్ స్టేటస్‌ని ఫ్రీగా చెక్ చేసుకోవచ్చు.
అందుకే, క్రెడిట్ స్కోరు చూసుకోవడం పెద్ద ఖర్చు కాదు, అసలు ఉచితంగానే కూడా చెక్ చేసుకునే అవకాశం ఉంది. మీ రిపోర్ట్‌ని క్రమం తప్పకుండా పరిశీలించడం వల్ల పొరపాట్లు ఉన్నా వెంటనే సరిచేసుకోవచ్చు, భవిష్యత్తులో లోన్ తీసుకునే సమయంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా ముందే సిద్ధంగా ఉండవచ్చు.
More From GoodReturns

6 వేల డాలర్ల మార్క్ దాటబోతున్న బంగారం ధర.. డాలర్ విలువ ఖేల్ ఖతం.. ప్రపంచ రారాజుగా పసిడి..

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బెంగళూరులో రూ. 5 వేలకే రూమ్..ఈ ఏరియాలోకి రమ్మని పిలుస్తున్న ఇంటి ఓనర్లు..

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

టీసీఎస్ ఉద్యోగుల షాకింగ్ నిర్ణయం: కంపెనీని వదిలేసి వెళ్లిపోతున్నారు..ఎందుకంటే...



Click it and Unblock the Notifications