Trending News: ఇదెక్కడి కంపెనీరా సామి.. బోనస్ కావాలంటే అలా చేయాల్సిందేనంట..!!
Viral News: ఉద్యోగులు తాము పని చేసే కంపెనీల్లో ప్రతి నెల అందుకునే జీతాల కంటే ఇతర ప్రయోజనాలపై ఎక్కువ ఆసక్తిని చూపుతుంటారు. బోనస్ రూపంలో చెల్లించేది చిన్న మెుత్తమే అయినా దానికోసం ఎక్కువ ఆసక్తి చూపుతుంటారు.
అయితే దీనికి సంబంధించిన ఒక వార్త ప్రస్తుతం వైరల్ అయ్యింది. అవును చైనాకు చెందిన ఒక పేపర్ మేకింగ్ కంపెనీ తన ఉద్యోగులకు బోనస్ చెల్లించేందుకు షరతు పెట్టింది. దీని ప్రకారం బోనస్ పొందాలంటే సదరు ఉద్యోగి తప్పకుండా కంపెనీ నిర్థేశించిన వ్యాయామ టార్గెట్ తప్పక పూర్తి చేయాల్సి ఉంటుంది. అంటే ఉద్యోగుల బోనస్‌లు ఇప్పుడు వారు చేసే శారీరక వ్యాయామాన్ని బట్టి నిర్ణయించబడతాయి.

గ్వాంగ్‌డాంగ్ డాంగ్‌పో పేపర్ కంపెనీ తన ఉద్యోగులకు వార్షిక పనితీరు బోనస్‌కు బదులుగా.. నెలవారీ రివార్డ్ సిస్టమ్‌ను ప్రవేశపెట్టింది. దీంతో ఉద్యోగులు తమ బోనస్‌లను సంపాదించడానికి పరుగెత్తడం, స్పీడ్ వాకింగ్ చేయడం వంటి వ్యాయామాలు చేయటం అవసరంగా మారిపోయింది. దీంతో ఉద్యోగులకు ఆరోగ్యానికి ఆరోగ్యంతో పాటు ఆనందం కూడా అందించాలని కంపెనీ ప్రయత్నిస్తోంది.
ఈ కంపెనీలోని ఉద్యోగి పూర్తి బోనస్ పొందాలంటే నెలలో 50 కిలోమీటర్లు పరిగెత్తాల్సి ఉంటుంది. అలాగే 40 కిలోమీటర్లు పెరిగెత్తిన వారికి 60 శాతం, 30 కిలోమీటర్లు పెరిగెత్తితే 30 శాతం బోనస్ చెల్లింపబడుతోంది. అయితే ఉద్యోగుల వ్యాయామానికి సంబంధించిన వివరాలను కంపెనీ ఒక యాప్ ద్వారా పర్యవేక్షిస్తోంది. అలాగే 100 కిలోమీటర్లు పరిగెత్తిన ఉద్యోగికి ఏకంగా 30 శాతం అదనపు బోనస్ చెల్లిస్తూ వారిని ఆరోగ్యకరమైన అలవాట్ల వైపు కంపెనీ నడిపించేలా ప్రోత్సాహాలను అందిస్తోంది.
కంపెనీ ఛైర్మన్ లిన్ జియోంగ్ ఎవరెస్ట్ శిఖరాన్ని రెండుసార్లు అధిరోహించాడు. అందుకే తన ఉద్యోగుల ఆరోగ్యం, ఫిట్‌నెస్ కోసం ఈ కొత్త ఆలోచనతో వచ్చాడు. ఉద్యోగులు సైతం దీనిపై సానుకూలతను వ్యక్తం చేశారు. మరికొందరు ఉద్యోగులు మాత్రం ఈ విధానంపై పెదవి విరుస్తున్నారు. వాస్తవానికి కంపెనీ నిర్థేశించిన రన్నింగ్ అవసరాలను అందుకునేందుకు అవసరమైన ఆరోగ్య పరిస్థితులు లేనివారి సంగతి ఏంటంటూ ప్రశ్నిస్తున్నారు.


Click it and Unblock the Notifications