చైనాలో టెక్నాలజీ పరిశ్రమ ఒత్తిడిలో ఉంది. అక్కడి ఇంటర్నెట్ దిగ్గజం టెన్సెంట్ హోల్డింగ్స్ లిమిటెడ్ బుధవారం నాడు భారీగా పతనమైంది. దీంతో జూలై నెలలో ఇప్పటి వరకు ఈ చైనీస్ టెక్ దిగ్గజం స్టాక్స్ ఏకంగా 23 శాతం క్షీణించాయి. ఈ నెలలో ప్రపంచంలోనే అతిపెద్ద మార్కెట్ లాసర్‌గా టెన్సెంట్ ఉంది. ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఏకంగా 170 బిలియన్ డాలర్లు కరిగిపోయింది. ప్రస్తుతం ప్రపంచ కుబేరులు, సంస్థల సంపద వేగంగా కరిగిపోతున్నట్లు బ్లూమ్‌బర్గ్ డేటా వెల్లడిస్తోంది.

టెన్సెంట్ షేర్లు నేడు జంప్
ప్రపంచంలోని టాప్ 10 సంస్థల మార్కెట్ క్యాపిటలైజేషన్ ఇటీవల భారీగా కరిగిపోయింది. ఈ పది కంపెనీల్లో 9 చైనాకు చెందిన కంపెనీలే ఉండటం గమనార్హం. ఈ కంపెనీల్లో మీటువాన్, అలీబాబా గ్రూప్ హోల్డింగ్స్ లిమిటెడ్ తదితర కంపెనీలు కూడా ఉన్నాయి.
బుధవారం వరకు ఈ నెలలో ఇరవై మూడు శాతం పతనమైన టెన్సెంట్ షేర్లు, గురువారం మాత్రం 7.1 శాతం మేర ఎగబాకాయి. ప్రయివేటు ఎడ్యుకేషన్ ఇండస్ట్రీపై అణిచివేత ఆందోళనలను తగ్గించేందుకు బీజింగ్ ప్రయత్నాలు ముమ్మరం చేయడంతో టెన్సెంట్ షేర్లు నేడు పెరిగాయి.

అందుకే భారీ పతనం
చైనా డేటా సెక్యూరిటీ, ఫైనాన్షియల్ స్టెబిలిటీ ముప్పుగా భావించే దేశంలోని కొన్ని టెక్ దిగ్గజాలను లక్ష్యంగా చేసుకోవడంతో ఈ ప్రభావం షెన్‌ఝెన్ కేంద్రంగా పని చేస్తోన్న టెన్సెంట్ పైన కూడా పడింది. ప్రయివేటు విద్య, రెగ్యులేటరీ నిర్ణయాల ప్రభావం టెన్సెంట్ పైన పడి ఈ వారంలో ఈ స్టాక్ దారుణంగా పతనమైంది. దీంతో జూలై నెలలోనే ఏకంగా 170 బిలియన్ డాలర్ల మార్కెట్ క్యాప్ పతనమైంది.

ఏ కంపెనీ ఎంత పడిపోయిందంటే
బ్లూమ్‌బర్గ్ ప్రకారం ఇప్పటి వరకు జూలై నెలలో టెన్సెంట్ మార్కెట్ క్యాప్ 170.2 డాలర్లు బిలియన్ డాలర్లు పతనమైంది. ఆ తర్వాత వరుసగా అలీబాబా గ్రూప్ 103.9 బిలియన్ డాలర్లు, మీటువాన్ 87.9 బిలియన్ డాలర్లు, పిన్‌డ్యూయోడ్యుయో59.5 బిలియన్ డాలర్లు, వీకో మౌటాయ్ 49.0 బిలియన్ డాలర్లు, కౌషో టెక్నాలజీ 43.0 బిలియన్ డాలర్లు, వులింగే యిబిన్ 30.3 బిలియన్ డాలర్లు, పింగ్ అన్ ఇన్సురెన్స్గ్రూప్ కో ఆఫ్ చైనా లిమిటెడ్ 29.5 బిలియన్ డాలర్లు, ప్రోసస్ ఎన్వీ 26.5 బిలియన్ డాలర్లు, కేఈ హోల్డింగ్స్ ఇంక్ 27.9 బిలియన్ డాలర్లు క్షీణించింది.
More From GoodReturns

ప్లాన్ ప్రకారమే స్టాక్ మార్కెట్ని పరిగెత్తించారు.. ట్రంప్ ప్రకటనకు ముందే రూ. 16 వేల కోట్ల ఇన్సైడర్ ట్రేడింగ్

స్టాక్ మార్కెట్లో ఐటీసీ షేర్లు భారీగా పతనం.. రూ.1.41 లక్షల కోట్ల సంపద కోల్పోయిన పెట్టుబడిదారులు..

భారీ నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్.. కుప్పకూలిన సెన్సెక్స్, నిఫ్టీ ప్రధాన సూచీలు..

నేడు స్టాక్ మార్కెట్లకు సెలవు.. అలాగే మార్చి 31న కూడా హాలిడే.. కారణం ఏంటంటే..

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications