For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

China: బ్యాంకులకు యుద్ధ ట్యాంకులతో కాపలా..! చైనాలో దిగజారిన పరిస్థితి.. షాకింగ్ వీడియో..

|

China: చైనాలో పరిస్థితులు పూర్తిగా దిగజారాయి. సంక్షోభంలో చిక్కుకున్న బ్యాంకులకు చైనా ఆర్మీ యుద్ధ ట్యాంకులతో కాపలా కాస్తున్న వీడియోలు అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి. ప్రస్తుతం అక్కడి ఆర్థిక పరిస్థితులను చూస్తే.. చైనా నిర్మించిన పేకమేడల అభివృద్ధి కూలుతున్నాయని అర్థం అవుతోంది. పరిస్థితి చూస్తుంటే ఈ సంక్షోభం అంతర్ యుద్ధానికి దారితీస్తుందా అనే భావన కలుగుతోంది. కానీ చైనా ప్రభాత్వం మాత్రం ప్రజాగ్రహాన్ని అణచివేయటానికి, ప్రజలను భయపెట్టడానికి మిలిటరీని ఉపయోగిస్తోంది.

బ్యాంకుల ఎదుట యుద్ధ ట్యాంకులు..

బ్యాంకుల ఎదుట డిపాజిటర్ల ప్రదర్శనల మధ్య.. చైనా ప్రభుత్వం బుధవారం హెనాన్ బ్యాంక్ నిరసనకారులను భయపెట్టడానికి వీధుల గుండా యుద్ధ ట్యాంకులను పంపింది. చైనా ప్రభుత్వ చర్య ప్రస్తుతం ప్రపంచాన్ని నివ్వెరపోయేలా చేస్తోంది. సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో ఇప్పుడు వైరల్ అవుతున్న వీడియోలో చైనీస్ ఆర్మీ ట్యాంకులు సంక్షోభంలో ఉన్న బ్యాంకును రక్షించడాన్ని మనం చూడవచ్చు.

చైనీస్ మీడియాలో..

చైనీస్ పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (PLA)కి చెందిన ట్యాంకులు.. రిజావో, షాన్‌డాంగ్ ప్రావిన్స్ ప్రాంతాల్లోని బ్యాంకులను రక్షించడానికి వీధుల్లో ఉన్నాయని చైనీస్ స్థానిక మీడియా పేర్కొంది. వినియోగదారుల నిధుల ఉపసంహరణను అడ్డుకోవటంపై ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

గతంలోనూ యుద్ధ ట్యాంకులు..

గతంలోనూ యుద్ధ ట్యాంకులు..

జూన్ 4, 1989న బీజింగ్‌లోని టియానన్‌మెన్ స్క్వేర్‌ను క్లియర్ చేయడానికి చైనా ప్రభుత్వం ట్యాంకులు, అత్యంత సాయుధ దళాలను పంపింది. అప్పట్లో.. ప్రజాస్వామ్యం, స్వేచ్ఛ కోసం వారాల పాటు విద్యార్థులు వారాల పాటు ప్రదర్శనకారులు చేపట్టారు. మళ్లీ నగర రోడ్లపై ట్యాంకులను చూస్తున్నవారు టియానన్‌మెన్ స్క్వేర్ మారణకాండను గుర్తుచేసుకుంటున్నారు.

 హామీ ఇచ్చినా వెనక్కు తగ్గని ప్రజలు..

హామీ ఇచ్చినా వెనక్కు తగ్గని ప్రజలు..

చైనాలోని హెనాన్ గ్రామాల్లో డిపాజిటర్లు స్తంభింపచేసిన నిధులను వాయిదాల రూపంలో తిరిగి పొందుతారని హామీ ఇచ్చినప్పటికీ ప్రజలు వెనక్కి తగ్గలేదు. మొదటి విడతగా జూలై 15న, కొద్దిమంది డిపాజిటర్లు మాత్రమే రీయింబర్స్‌మెంట్‌లను స్వీకరించారు. బ్యాంకుల రిజర్వ్ నిధులపై చైనీస్ ప్రజలు తీవ్ర సందేహాలు లేవనెత్తుతున్నారు. డిపాజిటర్లలో చాలా తక్కువ భాగం మాత్రమే ఈ చెల్లింపులను నిజంగా చెల్లించిందని పేర్కొంది. అయితే.. చైనీస్ స్టేట్ మీడియాలో రీయింబర్స్‌మెంట్ గురించి ఎటువంటి ప్రస్తావన లేదు.

Read more about: china చైనా
English summary

China: బ్యాంకులకు యుద్ధ ట్యాంకులతో కాపలా..! చైనాలో దిగజారిన పరిస్థితి.. షాకింగ్ వీడియో.. | chinese government using battle tanks to protesct crisis hit Bank of China at Henan branch

Tanks surround crisis-hit banks in China to scare protestors
Story first published: Thursday, July 21, 2022, 17:15 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X