షాక్‌లో భారత ప్రభుత్వం.. ఇండియాలోకి అడుగుపెట్టేందుకు చైనా కంపెనీల కొత్త దారి..!!

India-China: ఇండియాతో బోర్డర్ పంచుకుంటున్న డ్రాగన్ దేశంతో స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి అనేక సరిహద్దు సమస్యలు పరిష్కారం కాకుండానే ఉన్నాయి. ఇవి చాలా సార్లు ఉద్రిక్తతలకు సైతం దారితీశాయి. దీంతో భారత ప్రభుత్వం చైనా కంపెనీలను ఇండియా మార్కెట్లోకి అనుమతించే విషయంలో కఠినంగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.

ఈ క్రమంలో అతిపెద్ద మార్కెట్ అయిన ఇండియాను వదలకుండా ఉండేందుకు చైనా కంపెనీలు అనేక ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇందుకోసం ఇన్న అన్ని మార్గాలను అన్వేషిస్తున్నాయి. ముఖ్యంగా ఎలక్ట్రానిక్స్, కన్జూమర్ గూడ్స్ ఉత్పత్తి రంగాల్సో దేశ ఉత్పత్తిని పెంచేందుకు ప్రత్యేక అనుమతి కింద కొన్ని చైనా పెట్టుబడులకు అనుమతులు ఇచ్చే విషయమై కొద్ది రోజుల క్రితం కేంద్ర ప్రభుత్వం సమాలోచనలు జరపటం గమనార్హం. ఈ తరుణంలో చైనాకు చెందిన ఎలక్ట్రిక్ వాహన తయారీదారు లీప్‌మోటర్ భారత మార్కెట్లోకి అడుగుపెట్టేందుకు సిద్ధమైందని తెలుస్తోంది.

Chinese EV Car maker Leapmotor planning to enter Indian Market with Alternate entry routes

ఇప్పటికే ఉన్న ఎంజీ, బీవైడీ మాదిరిగానే లీప్‌మోటర్ సైతం ఇండియాలో తన వ్యాపారాన్ని విస్తరించాలని చూస్తోంది. ఇందుకోసం ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఆటోమోటివ్ స్టెల్లాంటిస్‌తో కూటమిని ఏర్పాటు చేసింది. స్టెల్లాంటిస్ సిట్రోయెన్, జీప్, ఫియట్ వంటి ప్రసిద్ధ ఆటోమొబైల్ బ్రాండ్‌ల యజమాని. పైగా అతిపెద్ద ఇంజన్ తయారీ సంస్థ. ఇప్పటికే జీప్, సిట్రోయెన్ కార్లతో ఇండియన్ మార్కెట్లో ఉన్న స్టెల్లాంటిస్.. ఇప్పుడు లీప్‌మోటార్‌తో పొత్తు పెట్టుకుని భారత మార్కెట్‌ను మరింత విస్తరించాలని యోచిస్తోంది. భారత ప్రభుత్వం చైనా కంపెనీల విషయంలో కఠినంగా వ్యవహరిస్తున్న వేళ లీప్‌మోటార్‌.. స్టెల్లాండిస్‌తో జతకట్టడం పెద్ద బలంగా మారనుంది.

గతంలో చైనాకు చెందిన ప్రముఖ ఈవీ కార్ మేకర్ బీవైడీ ఇండియా మార్కెట్లో విస్తరించేందుకు ప్రయత్నించినప్పుడు అందుకు ప్రభుత్వం నుంచి అనుమతులు పొందటంలో సమస్యలు ఎదుర్కొంది. ఇదే క్రమంలో మరో కార్ మేకర్ ఎంజీ సైతం పలు సమస్యలను ఎదుర్కొంది. దీంతో ఎంజీ సంస్థ ఇండియాకు చెందిన జేఎస్డబ్ల్యూ యజమాని సంజయ్ జిందాల్ తో చేతులు కలపాలని నిర్ణయించుకుంది. భారతీయ నిబంధనలలో పనిచేయడానికి ఇది దోహదపడనుంది.

గత ఏడాది స్టెల్లాండిస్ సంస్థ లీప్‌మోటార్స్ కంపెనీలో రూ.13,500 కోట్లు వెచ్చించి 20 శాతం వాటాను కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ఈ పెట్టుబడి రెండు కంపెనీల మధ్య బలమైన మైత్రికి దారి తీసింది. దీంతో లీప్‌మోటార్ ఇంటర్నేషనల్ అనే జాయింట్ వెంచర్ ఏర్పడింది. కొత్త జాయింట్ వెంచర్ చైనా వెలుపల కంపెనీ వాహనాలను ఎగుమతి చేయటం, విక్రయించటంపై దృష్టి సారిస్తుంది. ప్రస్తుతం చైనా ఈవీ కంపెనీ పీటీ స్టెల్లాండిస్ పేరుతో లీప్‌మోటార్ ఇంటర్నేషనల్ ద్వారా భారత్‌లోకి ప్రవేశిస్తుందని భావిస్తున్నారు. అయితే దీనిని భారత ప్రభుత్వం ఎలా నియంత్రిస్తుందనే ప్రశ్నలు అందరి మదిలో ఉన్నాయి. ఈ మార్గం విజయవంతమైతే.. చైనా కంపెనీలు విదేశీ కంపెనీలలో పెట్టుబడులు పెట్టడం ద్వారా ఇకపై భారతీయ మార్కెట్లోకి సులువుగా ప్రవేశిస్తాయి. ఈ ఫ్రేమ్‌వర్క్‌ని ఉపయోగించి చైనీస్ ఉత్పత్తులను నిషేధించే దేశాల్లోకి ప్రవేశించడం కూడా సాధ్యపడుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+