Lottery News: చాలా మంది ప్రపంచ వ్యాప్తంగా వ్యాపారులు తమ వద్ద పనిచేసే ఉద్యోగులను కేవలం పనివారుగానే చూస్తుంటారు. తక్కువ మంది మాత్రమే తాము పొందే లాభాలను వర్కర్లతో పంచుకుంటుంటారు. అలా ఒక కంపెనీ ఏకంగా తన ఉద్యోగులకు కోట్లు పంచిపెట్టడం ప్రస్తుతం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
అవును ఇలాంటి సంఘటన చైనాలోని జెజియాంగ్ ప్రావిన్స్‌లోని నింగ్‌బోలో జరిగింది. చైనా జాతీయుడు 6 మిలియన్ యువాన్ల విలువైన లాటరీ బహుమతిని గెలుచుకున్నాడు. భారతీయ కరెన్సీ లెక్కల ప్రకారం ఈ బహుమతి విలువ రూ.7.8 కోట్లుగా ఉంది. చాలా కంపెనీలు ఇలాంటి వేడుకలు నిర్వహిస్తున్నాయి. విజేతలకు బహుమతులు అందజేస్తారు. అయితే 2019లో జరిగిన ఈ ఘటన మళ్లీ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. లాటరీ టిక్కెట్ల విక్రయాలను పెంచేందుకు ఈ కథనాన్ని మళ్లీ ప్రచురించారని తెలుస్తోంది.

వాస్తవానికి 2019లో చైనాలో జరిగిన వార్షిక వేడుకల్లో కంపెనీ స్థానిక స్టోర్ నుంచి దాదాపు 500 లాటరీ టిక్కెట్లను కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. వాటిని ఒక్కొక్క ఉద్యోగికి అందించింది. వీరిలో ఒకరి వద్ద ఉన్న టిక్కెట్టుకు లాటరీ సొమ్ము తగిలింది. అయితే అసలు చిక్కు ఇక్కడే వచ్చింది. సదరు గెలిపొందిన ఉద్యోగి ఆ మెుత్తాన్ని ఇతర ఉద్యోగులతో పంచుకోవటానికి నిరాకరించాడు. ఇది కంపెనీలో వివాదం ముదరటానికి కారణమైంది.
ఈ వివాదాన్ని పరిష్కరించటానికి ఉద్యోగులు స్థానికంగా ఒక పోలీసు స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేశారు. ఇది కాస్త సివిల్ వివాదం కావటంతో పోలీసులు అవసరమైతే పరిష్కారానికి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఇరువర్గాలకు సూచించారు. అవసరమైతే పరిష్కారానికి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కూడా ఇరువర్గాలకు సూచించారు. సోషల్ మీడియాలో దీనిపై భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
అయితే ఇక్కడ కొన్ని ఆసక్తికరమైన విషయాలు కూడా ఉన్నాయి. టిక్కెట్లు జారీ చేయడానికి 2 రోజుల ముందు టికెట్ డ్రా నిర్వహించబడిందని తెలుస్తోంది. లాటరీ డ్రా ఫిబ్రవరి 28న ముగిసింది. ఇదంతా జరిగిపోయిన తర్వాత మార్చి 2న మాత్రమే ఉద్యోగులకు కంపెనీ కొనుగోలు చేసిన టిక్కెట్లు పంపిణీ చేశారు. గెలుపొందిన టిక్కెట్లను ఎవరూ పొందకుండా వాటిని వేరు చేయాలని కంపెనీకి సూచించినట్లు సమాచారం. అయితే ఇక్కడ దేవును రాసిన స్క్రిప్ట్ వేరే ఉంది. దీంతో కొందరి అజాగ్రత్త వల్ల ఓ ఉద్యోగి చేతికి ప్రైజ్ మనీ గెలుపొందిన టిక్కెట్టు దొరికిందని తెలుస్తోంది. దీనిలో నిజమెంతో తెలియనప్పటికీ ఉద్యోగులను ఇలా మోసం చేయటానికి కంపెనీ ప్రయత్నించటంపై విమర్శలు వస్తున్నాయి.


Click it and Unblock the Notifications