తాము సంక్షోభం నుండి బయటపడతామని చైనా రియాల్టీ దిగ్గజం ఎవర్‌గ్రాండ్ ధీమా వ్యక్తం చేసింది. ప్రస్తుత ఆర్థిక ఇబ్బంది నుండి తాము కచ్చితంగా బయటపడతామని సంస్థ చైర్మన్ హుయ్-కా-యువాన్ తెలిపారు. ఈ మేరకు ఆయన ఉద్యోగులకు లేఖ రాశారు. తాము చేపట్టిన ప్రాజెక్టులను అన్నింటిని తప్పకుండా పూర్తి చేస్తామని, ఉద్యోగుల సహకారంతో ఈ లక్ష్యాన్ని కచ్చితంగా చేరుకుంటామన్నారు.
ప్రస్తుత సంక్షోభం నుండి బయటపడటానికి దేశీయ బాండ్ హోల్డర్స్‌తో ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు ఎవర్ గ్రాండ్ తెలిపింది. ఇది వడ్డీ చెల్లింపు డిఫాల్ట్ నుండి బయటపడేస్తుంది. ఎవర్ గ్రాండ్ ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుపోయిందనే వార్తలు ప్రపంచ మార్కెట్లను, ముఖ్యంగా రియాల్టీ రంగంపై తీవ్ర ప్రభావం చూపాయి.

కాస్త ఊరట
సెప్టెంబర్ 23వ తేదీన బాండ్ కూపన్ చెల్లింపులు జరుపుతామని ఎవర్ గ్రాండ్ గ్రూప్ తెలిపింది. చైనా దిగ్గజ రియాల్టర్ ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుపోతుందనే ఆందోళనల నేపథ్యంలో ఇది కాస్త ఊరట కలిగించే అంశం. చైనా, ప్రపంచ మార్కెట్లకు ఇది రిలీఫ్ ఇస్తోంది. సానుకూల సంకేతాల నేపథ్యంలో యూఎస్ స్టాక్ ఫ్యూచర్స్ యువాన్, రిస్క్ సెన్సిటివ్ ఆస్ట్రేలియన్ డాలర్ పెరిగాయి. అయితే యెన్, యూఎస్ ట్రెజరీ యీల్డ్స్ పడిపోయాయి.
దేశంలో అత్యధికంగా సేల్ చేసిన డెవలపర్ ఎవర్ గ్రాండ్. ఎవర్ గ్రాండ్ యూనిట్ హంగ్డే రియల్ ఎస్టేట్ గ్రూప్ బాండ్‌కు సంబంధించి ప్రకటన చేసింది. డాలర్ బాండ్ పైన వడ్డీ చెల్లింపు కోసం ఒక కీలక గడువుకు సమీపంలో ఉంది. డేటా ప్రకారం హెంగ్డే రియల్ ఎస్టేట్ కూప్న్ చెల్లింపు మొత్తం 232 మిలియన్ యువాన్లు(35.88 మిలియన్ డాలర్లు).

ఒక్కరోజే రూ.10 లక్షల కోట్లు ఆవిరి
చైనా రియాల్టీ మార్కెట్లో ఎవర్ గ్రాండ్ వాటా 2 శాతం. దీనికి గత ఏడాది లిక్విడిటీ సమస్య ఏర్పడింది. మొత్తం 15 లక్షలమందికి ఇళ్లు నిర్మించి ఇవ్వాల్సి ఉంది. కంపెనీ తన ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని స్థితికి చేరుకుంది. సంస్థకు మొత్తం 300 బిలియన్ డాలర్ల (సుమారు రూ.22.50 లక్షల కోట్ల) అప్పులు ఉన్నాయి. ఈ అప్పులను తగ్గించుకోవడానికి ఇబ్బందులు పడుతోంది. 2023 మిడిల్ వరకు 100 బిలియన్ డాలర్ల రుణాలను తీర్చాలని భావిస్తోంది. ఈ ఏడాది ఇప్పటి వరకు 8 బిలియన్ డాలర్లను మాత్రమే సమీకరించింది.
చైనా ప్రభుత్వం సాయంపై గందరగోళం నెలకొంది. ఈ ప్రభావం ప్రపంచవ్యాప్తంగా ఉండే అవకాశం ఉందన్న వార్తల నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్లు సోమవారం క్షీణించాయి. ఎవర్ గ్రాండ్ సంక్షోభం నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్లు నష్టపోవడంతో ప్రపంచవ్యాప్తంగా టాప్ 500 మంది ధనవంతుల సంపద ఒక్కరోజే 135 బిలియన్ డాలర్లు లేదా రూ.10 లక్షల కోట్ల మేర తగ్గింది.

కుబేరుల సంపద హుష్ కాకి
బ్లూమ్‌బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్‌లో మొదటి స్థానంలో ఉన్న టెస్లా అధినేత ఎలాన్ మస్క్ సంపద 7.2 బిలియన్ డాలర్లు తగ్గి 198 బిలియన్ డాలర్లకు క్షీణించింది. అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ సంపద 5.6 బిలియన్ డాలర్లు తగ్గి 194.2 బిలియన్ డాలర్లకు పడిపోయింది. ఎవర్ గ్రాండ్ షేర్లు దశాబ్దకాల కనిష్ఠానికి చేరుకున్నాయి. దీంతో 2017లో 42 బిలియన్ డాలర్ల వద్ద గరిష్ఠానికి చేరుకున్న ఎవర్ గ్రాండ్ ఛైర్మన్ హుయ్-కా-యువాన్ సంపద తాజాగా 7.3 బిలియన డాలర్లకు తగ్గింది.
More From GoodReturns

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Gas booking: ఇకపై గ్యాస్ వెంటనే బుక్ చేయలేరు.. కొత్త వెయిటింగ్ పీరియడ్ రూల్స్ ఇవే!



Click it and Unblock the Notifications