Tesla Vs BYD: ప్రస్తుతం ఎలాన్ మస్క్ ప్రపంచ కుబేరుల జాబితాలో తొలి స్థానంలో కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఆయన సంపదను ఇన్ని రెట్లు పెంచిన సంగతి తెలిసిందే. అయితే గతవారం సౌత్ చైనా పోస్ట్ రిపోర్ట్ ఇప్పుడు పెద్ద బాంబు లాంటి వార్తను పేల్చింది.
వివరాల్లోకి వెళితే అమెరికన్ బిలియనీర్ ఎలాన్ మస్క్ కి సంబంధించిన ఎలక్ట్రిక్ కార్ బ్రాండ్ టెస్లా అమ్మకాలను చైనాకు చెందిన ఈవీ దిగ్గజం బీవైడీ అధిగమించిందని నివేదించబడింది. మూడవ త్రైమాసికంలో తొలిసారిగా 24 శాతం పెరిగి ప్రపంచ వ్యాప్తంగా 28.2 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. ఇదే క్రమంలో టెస్లా అమ్మకాలు ఇదే త్రైమాసిక కాలంలో 25.18 బిలియన్ డాలర్లుగా ఉన్నట్లు తేలింది. దీంతో అమ్మకాల పరంగా టెస్లాను బీవైడీ ఓడించింది. గతవారంలో ఎలాన్ మస్క్ మైక్రో బ్లాగింగ్ ఫ్లాట్ ఫారమ్ ఎక్స్ భారతీయ ఆదాయం భారీగా క్షీణించి ఎదురుదెబ్బ తిన్న తర్వాత తాజాగా టెస్లా సైతం కష్టాలను ఎదుర్కొంటోందని వెల్లడైంది.

దీనికి గల కారణాలను పరిశీలిస్తే.. ప్రపంచవ్యాప్తంగా వినియోగదారులు బ్యాటరీతో నడిచే ఎలక్ట్రిక్ వాహనాల్లో దీర్ఘకాలిక ఆందోళనలను తగ్గించడానికి హైబ్రిడ్ అంటే పెట్రోలియం-ఎలక్ట్రిక్ పవర్ ద్వారా నడిచే ఆటోమొబైల్స్‌ను ఎంచుకుంటున్నట్లు తేలింది. దీంతో ప్రపంచంలోనే అతిపెద్ద హైబ్రిడ్ కార్లు, స్వచ్ఛమైన EVల అసెంబ్లర్ అయిన షెన్‌జెన్ ఆధారిత కార్ల తయారీ సంస్థ బీవైడీ విక్రయాలు సెప్టెంబర్ 30న ముగిసిన మూడు నెలల్లో 24 శాతం పెరుగుదలను చూశాయి. దీంతో కంపెనీ నికర లాభం 11.5 శాతం పెరిగి 1.63 బిలియన్ డాలర్లుగా నమోదైంది.
Visited @Tesla HQ in Austin and pitched Anantapur as the perfect spot for Tesla’s EV and battery units! Had an inspiring discussion with CFO Vaibhav Taneja about transforming Andhra Pradesh into an EV manufacturing hub. Under the visionary leadership of Hon’ble CM @ncbn Garu,…
— Lokesh Nara (@naralokesh) October 28, 2024
2030 నాటికి రోడ్లపై తిరిగే వాహనాల్లో దాదాపు 60 శాతం ఎలక్ట్రిక్ బ్యాటరీల ద్వారా నడుస్తాయని తెలుస్తోంది. ఈ క్రమంలో వినియోగదారులు సైతం ఈవీలను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఈ క్రమంలో ప్రపంచంలోనే అతిపెద్ద ఆటోమెుబైల్ మార్కెట్ అయిన చైనాలో టెస్లా ఎదుర్కొంటున్న వృద్ధి అడ్డంకులను తాజా త్రైమాసిక ఫలితాలు నొక్కి చెబుతున్నాయి. ఈ తరుణంలో టెస్లా తన మనుగడను వృద్ధిపదంలో నడిపించాలంటే.. టెస్లా తన ధరలను మరింత తగ్గించకపోతే, కొత్త మోడళ్లను పరిచయం చేస్తే లేదా చైనాలో పూర్తి సెల్ఫ్-డ్రైవింగ్ ఫీచర్‌ను ప్రారంభించకపోతే.. చైనాలో మరింత అభివృద్ధి చెందే అవకాశం లేదు" అని షాంఘై కన్సల్టింగ్ సంస్థ ఆటోమోటివ్ ఫోర్‌సైట్ హెడ్ యేల్ జాంగ్ అన్నారు.
ఇండియాలో టెస్లా ప్లాంట్..
చాలా కాలంగా భారతదేశంలో ఎలాన్ మస్క్ టెస్లా ప్లాంట్ ఏర్పాటుకు వివిధ రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఆహ్వానాలు అందుకుంటూనే ఉంది. అయితే టెస్లా మాత్రం ఇండియన్ మార్కెట్లోకి తన ఉత్పత్తులను ఇంపోర్ట్ చేయటం ద్వారా విక్రయించాలని చూస్తుండగా, భారీగా ఉన్న దిగుమతి సుంకాలు దీనిని అసాధ్యంగా మారుస్తున్న సంగతి తెలిసిందే. అయితే భారత్ లాంటి పెద్ద మార్కెట్లో వాటాను దక్కించుకునేందుకు టెస్లా తన తయారీ కర్మాగారాన్ని ఇండియాలో పెట్టక తప్పని పరిస్థితులు ఏర్పడ్డాయి. అయితే ఈ ప్లాంటు ఏర్పాటు కోసం అనువైన ప్రాంతం కోసం టెస్లా టీం పరిశీలించిన సంగతి వార్తల్లో వినిపించింది. ఇప్పుడు ఇది గుజరాత్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తమిళనాడులో ఎక్కడికి వస్తుందనే చర్చ కొనసాగుతోంది. దీనికి తోడు గతవారం ఏపీ మంత్రి నారా లోకేష్ తన అమెరికా పర్యటనలో టెస్లా ప్లాంట్ సందర్శించి ఏపీలో పెట్టుబడికి ఉన్న అవకాశాలను వివరించారు.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!

Bengaluru: ఒక్క లేఆఫ్.. 8 ఏళ్ల కష్టాన్ని బూడిద చేసింది! వైరల్ అవుతున్న చార్టర్డ్ అకౌంటెంట్ పోస్ట్!



Click it and Unblock the Notifications