China Warns Trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొత్త టారిఫ్ లతో విరుచుకుపడుతున్నాడు. బ్రిక్స్ దేశాలపై తన ప్రతాపాన్ని చూపిస్తూ కొత్త టారిఫ్ లను తెరపైకి తీసుకువచ్చాడు. తాజాగా మరోసారి చైనా వస్తువులపై భారీ సుంకాలను విధించనున్నట్లు హెచ్చరించడంతో ప్రపంచ వాణిజ్య సంబంధాల్లో తిరిగి ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన తాజా టారిఫ్ ల ప్రకారం.. చైనా నుండి దిగుమతి అయ్యే వస్తువులపై ఆగస్టు 1 నుండి సుంకాలను తిరిగి విధించే అవకాశం ఉంది.
ట్రంప్ తీసుకున్న చర్యల ద్వారా జూన్‌లో కుదిరిన తాత్కాలిక వాణిజ్య ఒప్పందాన్ని తిరిగి ఉద్రిక్తతగా మారే ప్రమాదం ఉందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. అమెరికా చెబుతున్న లెక్కల ప్రకారం ఆగస్టు 12 నాటికి చైనా-అమెరికా మధ్య ఒక స్పష్టమైన వాణిజ్య ఒప్పందం కుదరకపోతే.. మరింత అదనపు దిగుమతి ఆంక్షలు అమలవుతాయని హెచ్చరించారు.

ఈ పరిణామాలపై చైనా అధికారిక మీడియా పీపుల్స్ డైలీ తీవ్రంగా స్పందించింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధించిన టారిఫ్ పాలసీని బెదిరింపు రాజకీయాలుగా పేర్కొంది. అమెరికా తిరిగి పాత మార్గంలోకి రావాలి..లేదంటే తీవ్ర ప్రతీకారం తప్పదని డ్రాగన్ కంట్రీ హెచ్చరించింది. ముఖ్యంగా, అమెరికా... చైనాను బ్రిక్స్ దేశాల నుండి వేరుచేయాలనే సూచనలపై చైనా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.
దీనికి ప్రతిగా ఇటీవల అమెరికా -వియత్నాం మధ్య కుదిరిన కొత్త ఒప్పందాన్ని ప్రస్తావించింది. అది ప్రాంతీయ సమతుల్యతకు ప్రమాదకరం అనే అభిప్రాయాన్ని వెల్లడించింది. అమెరికా వియాత్నంతో తీసుకున్న తాజా ఒప్పందం కారణంగా చైనా ఉత్పత్తులపై పన్నులు పెరగడం ఖాయమని చైనా భావిస్తోంది.
ప్రస్తుతం చైనా ఉత్పత్తులపై US సగటు టారిఫ్ 51.1 శాతం వద్ద ఉంది. ఇక చైనా..తమ దేశంలో అమెరికా ఉత్పత్తులపై 32.6 శాతం సుంకాలను విధించింది. ఈ గణాంకాలు చూస్తే వాణిజ్య యుద్ధం మళ్లీ తీవ్రతరం కావడం అనివార్యం సంకేతాలు కనిపిస్తున్నాయి. ఈ పరిస్థితులు ముందు ముందు ఇలాగే కొనసాగితే ప్రపంచ వాణిజ్యంలో మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకునే అవకాశం ఉంది.
అభివృద్ధి చెందుతున్న దేశాల ఆర్థిక వ్యవస్థలపై తీవ్రమైన ప్రభావాన్ని చూపే ప్రమాదం ఉంది. ఈ పరిణామాలతో పాటు.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పరిపాలన ఇప్పుడు ఇతర దేశాలను కూడా చైనా నుండి దూరంగా ఉంచేలా ప్రోత్సహిస్తోంది. ఇది ఆసియా దేశాల పరిస్థితిని మరింత క్లిష్టతరం చేసే అవకాశాలు ఉన్నాయి.
అమెరికా-చైనా వాణిజ్య ఉద్రిక్తతలు భారత ఎగుమతిదారులు, ప్రపంచ పెట్టుబడిదారులు అనే అభిప్రాయాలపై ప్రభావం చూపుతాయి.వాణిజ్య సంబంధాల పునర్వ్యవస్థీకరణ, ముడి సరుకుల ధరల పెరుగుదల, పెట్టుబడుల రిజర్వేషన్ల వలన అభివృద్ధి చెందుతున్న దేశాలు కూడా ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొనే అవకాశం ఉంది. క్లుప్తంగా చెప్పాలంటే.. అమెరికా-చైనా మధ్య రాజీ కుదరకపోతే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ తీవ్ర ప్రభావాలకు లోనయ్యే అవకాశం ఉంది.
Disclaimer: This article is strictly for informational purposes only. It is not a solicitation to buy, sell in precious metal products, commodities, securities or other financial instruments. Greynium Information Technologies Pvt Ltd, its subsidiaries, associates and the author of this article do not accept culpability for losses and/or damages arising based on information in this article.
More From GoodReturns

Bengaluru: ఒకప్పుడు డబ్బు లేక నేలపై నిద్ర.. నేడు రూ. 800 కోట్ల టర్నోవర్! 23 ఏళ్ల అంజలి ఇన్స్పైరింగ్ జర్నీ!

కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం.. కొనేవారు లేక దుబాయ్లో కుప్పలు కుప్పలుగా పడిన బంగారం ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు తగ్గాయి.. ఎంత తగ్గాయో తెలిస్తే ఎగిరి గంతేస్తారు.. మార్చి 2, సోమవారం పసిడి ధరలు ఇవే..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గనున్న బంగారం, వెండి ధరలు.. కారణం ఏంటంటే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. 10 గ్రాములు ధర ఎంత తగ్గిందంటే.. మార్చి 3, మంగళవారం ధరలు ఇవే..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications