Alibaba Group: జాక్ మా కు మంచి రోజులు మెుదలయ్యాయా.. అలీబాబా గ్రూప్ కు మల్లీ మంచి టైం వచ్చిందా? ఆయనపై చైనా ప్రభుత్వం కనికరం చూపిస్తోందా? ఇప్పుడు పరిస్థితులు చూస్తుండే అలాగే ఉంది. బిలియనీర్ జాక్ మా నేతృత్వంలోని ఫిన్‌టెక్ దిగ్గజం.. యాంట్ గ్రూప్ IPOను పునరుద్ధరించడానికి చైనీస్ ఫైనాన్షియల్ రెగ్యులేటర్లు ప్రారంభ దశ చర్చల్లో నిమగ్నమై ఉన్నట్లు న్యూస్ ఏషియా కథనం ప్రకారం తెలుస్తోంది.
చైనా సెక్యూరిటీస్ రెగ్యులేటరీ ఏమంటోంది..
బిలియనీర్ జాక్ మా నేతృత్వంలోని ఫిన్‌టెక్ కంపెనీ వాటా విక్రయ ప్రణాళికలను తిరిగి అంచనా వేయడానికి చైనా సెక్యూరిటీస్ రెగ్యులేటరీ కమిషన్ (CSRC) ఒక బృందాన్ని ఏర్పాటు చేసిందని సోర్సెస్ చెబుతున్నాయి. చైనా ఇంటర్నెట్ రంగాన్ని సులభతరం చేయడానికి ప్రభుత్వం తన అధికారిక వాగ్దానాలను నిలబెట్టుకుంటుందనడానికి ఇది సంకేతం కావచ్చు, ఇది పెట్టుబడిదారులకు బాగా ఉపయోగపడుతుందని తెలుస్తోంది. చైనీస్ రెగ్యులేటర్‌లు రైడ్-హెయిలింగ్ దిగ్గజం దీదీ గ్లోబల్ ఇంక్, మరో రెండు సంస్థలపై తమ ఇన్వెస్టిగేషన్ ను ముగిస్తున్నందున.. ఈ వారంలో దేశీయ యాప్ స్టోర్‌లకు తిరిగి రావడానికి సదరు సంస్థల యాప్‌లను అనుమతించవచ్చు. కానీ.. యాంట్ IPO గురించి వస్తున్న వార్తలను చైనా సెక్యూరిటీస్ రెగ్యులేటరీ కమిషన్ తిరస్కరించిందని తెలుస్తోంది.

అలీబాబా షేర్లపై ప్రభావం:
మెయిన్‌ల్యాండ్ చైనా, ఓవర్సీస్, Investing.comలో జాబితా చేయడానికి అర్హత ప్రమాణాలకు అనుగుణంగా ఉన్న కంపెనీలకు మాత్రమే మద్దతు ఇస్తుందని తెలుస్తోంది. యాంట్ గ్రూప్‌లో అలీబాబా 33% వాటా కలిగి ఉంది. ఈ వార్తల తరుణంలో గురువారం అలీబాబా షేర్ ఆరంభంలో 5 శాతం పెరిగినప్పటికీ చివరికి 3.5% పడిపోయాయి. 2020 నవంబర్‌లో షాంఘై, హాంకాంగ్‌లలో యాంట్ తన రికార్డ్ 37 బిలియన్ డాలర్ల IPO కోసం రంగం సిద్ధం చేసుకుంది. చైనా మార్కెట్లలోకి అది రావటానికి కొన్ని రోజుల ముందు డీల్‌ను చైలా ప్రభుత్వ రెగ్యులేటరీ నిలిపివేసింది. ప్రస్తుతం వస్తున్న వార్తలు కేవలం ఊహాగానాలేనా లేక చైనా ప్రభుత్వంతో జాక్ మా కు సయోధ్య కుదిరిందా అనే విషయం పూర్తి స్థాయిలో తెలియాల్సి ఉంది.


Click it and Unblock the Notifications