గత కొద్ది కాలం నుంచి పసిడి ధరలు నింగిని తాకాయి. రాకెట్ కన్నా వేగంగా సిల్వర్ ధరలు దూసుకుపోతున్నాయి. ఒక్కసారిగా పెరిగిన ధరలు చూసి సామాన్యులు సైతం నోరెళ్లబెడుతున్నారు. ఇక పెట్టుబడిదారుల సంగతి చెప్పనవసరం లేదు. ఈ పెరుగుదల చూసి ఆశ్చర్యపోతున్నారు. మధ్యమధ్యలో లాభాలు అందుకుంటున్నప్పటికీ వెండి ధరలు ఎప్పుడు ఎలా ఉంటాయోనన్న సందేహం వారిలో నెలకొంది. ఈ పెరుగుదల ఎక్కడ ఆగుతుందో అన్న ప్రశ్నకు ఇప్పటికీ స్పష్టమైన సమాధానం కనిపించక పెట్టుబడిదారులు అయోమయానికి గురవుతున్నారు.
వెండిపై పెరుగుతున్న డిమాండ్‌కి ప్రధాన కారణం ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో జరుగుతున్న నిర్మాణాత్మక మార్పులు అని చెప్పవచ్చు. పునరుత్పాదక విద్యుత్ ప్రాజెక్టులు, సౌర విద్యుత్ ప్యానెల్స్, ఎలక్ట్రిక్ వాహనాలు, అధిక పనితీరు గల ఎలక్ట్రానిక్స్, సెమీకండక్టర్ పరిశ్రమ వంటి రంగాల్లో వెండి కీలక ముడి పదార్థంగా మారింది. దీంతో పరిశ్రమల డిమాండ్ ఏటా పెరుగుతూనే ఉంది. అదే సమయంలో మైనింగ్ ఉత్పత్తి మాత్రం ఆ వేగాన్ని అందుకోలేకపోతోంది. ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా డిమాండ్-సరఫరా మధ్య గ్యాప్ ఏర్పడింది.

ఈ పరిస్థితుల మధ్య చైనా తీసుకున్న తాజా విధాన నిర్ణయం Silver మార్కెట్లను మరింత ఆందోళనలోకి నెట్టేసింది. జనవరి 1 2026 నుండి వెండి ఎగుమతులపై చైనా కఠిన నియంత్రణలు విధించింది. ఇకపై చైనా నుండి వెండిని ఎగుమతి చేయాలంటే ప్రభుత్వ లైసెన్సులు తప్పనిసరి. అవి కూడా కేవలం పెద్ద, ప్రభుత్వ అనుమతి పొందిన సంస్థలకే పరిమితం కావచ్చని అంచనా. దీని వల్ల చిన్న ఎగుమతిదారులు అంతర్జాతీయ మార్కెట్ల నుంచి తప్పుకునే పరిస్థితి ఏర్పడింది.
ఈ నిర్ణయం ఇప్పటికే ప్రపంచ మార్కెట్లలో ప్రతిబింబిస్తోంది. అంతర్జాతీయ మార్కెట్లో Silver ధర ఔన్సుకు 109 డాలర్లకు పైగా ట్రేడవుతుంటే.. చైనా లోకల్ మార్కెట్లో అదే వెండి 125 డాలర్ల వరకు చేరింది. దీనికి కారణం అక్కడ ఏర్పడిన సరఫరా ఒత్తిడి, అధిక డిమాండ్. ఇదే సమయంలో భారతదేశంలో వెండి ధర చైనా ధరతో పోలిస్తే సుమారు 17 శాతం తక్కువగా ఉంది. ఇది రెండు దేశాల మార్కెట్ పరిస్థితుల్లో ఉన్న వ్యత్యాసాన్ని స్పష్టంగా చూపిస్తోంది.
చైనా నిర్ణయంపై ప్రముఖ వ్యాపారవేత్త ఎలోన్ మస్క్ కూడా స్పందించారు. అనేక పారిశ్రామిక ప్రక్రియల్లో వెండి కీలకమైన లోహమని.. ఇలాంటి ఆంక్షలు ప్రపంచ సరఫరా గొలుసుపై తీవ్ర ప్రభావం చూపవచ్చని ఆయన హెచ్చరించారు. వాస్తవానికి, గత ఐదు సంవత్సరాలుగా వెండి మార్కెట్‌లో నిర్మాణాత్మక లోటు కొనసాగుతోందని అంతర్జాతీయ సంస్థలు ఇప్పటికే సూచిస్తున్నాయి.
ఇక ఉత్పత్తి పరంగా చూస్తే.. మెక్సికో తర్వాత చైనా రెండవ అతిపెద్ద వెండి ఉత్పత్తిదారుగా ఉంది. అంతేకాదు, ప్రాసెసింగ్, రిఫైనింగ్, ఎగుమతి సరఫరా గొలుసుల్లో చైనాకు కీలక పాత్ర ఉంది. కాబట్టి ఎగుమతులపై ఆంక్షలు విధించడమే కాకుండా.. లైసెన్సింగ్‌ను పరిమితం చేయడం వల్ల ప్రపంచ మార్కెట్లో చైనీస్ వెండి లభ్యత గణనీయంగా తగ్గే అవకాశాలు ఉన్నాయి.
ఈ పరిస్థితులన్నీ కలిపి చూస్తే.. వెండి ధరలపై పైకి ఒత్తిడి ఇంకా కొనసాగవచ్చని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. అయితే, ఇటీవలి కాలంలో ధరలు చాలా వేగంగా పెరిగిన నేపథ్యంలో, మధ్యమధ్యలో తీవ్రమైన సవరణలు వచ్చే ప్రమాదం కూడా ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. దీర్ఘకాలంలో పరిశ్రమల డిమాండ్ బలంగా ఉన్నప్పటికీ, పెట్టుబడిదారులు అతి వేగంగా పెరుగుతున్న ధరల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు



Click it and Unblock the Notifications