Jack Ma: చైనా ఫుడ్ వ్యాపారంలోకి జాక్ మా.. ఆలీబాబా రూటు మార్చిందా..??
Jack Ma: చైనాలోని అతిపెద్ద టెక్ బిలియనీరుగా కొనసాగుతున్న జాక్ మా చైనా ప్రభుత్వ చర్యలతో కొంత కాలంగా కనుమరుగయ్యారు. అటిపెద్ద యాంట్ కార్పొరేషన్ ఐపీవోను సైతం చైనా ప్రభుత్వం అడ్డుకున్న సంగతి తెలిసిందే.
ఈ క్రమంలో తాజాగా ఆలీబాబా ఫౌండర్ జాక్ మా ఆహార వ్యాపారంలోకి అడుగుపెడుతున్నారు. మా కిచెన్ ఫుడ్ పేరుతో దీనిని ప్రజల ముందుకు తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది. సమాచారం ప్రకారం కంపెనీ గత బుధవారం తూర్పు చైనాలోని జాక్ మా స్వస్థలమైన హాంగ్‌జౌలో స్టార్టప్ కంపెనీని రిజిస్టర్ చేశారు. ఇది ఈ-కామర్స్, టెక్ దిగ్గజం అలీబాబాకి కూడా స్థావరంగా పనిచేస్తుంది.

మా కొత్త వెంచర్ ముందుగా ప్యాక్ చేయబడిన ఆహారం, దిగుమతులు, ఎగుమతులు, వ్యవసాయ ఉత్పత్తులను విక్రయించడంపై దృష్టి పెడుతుందని నేషనల్ ఎంటర్‌ప్రైజ్ క్రెడిట్ ఇన్ఫర్మేషన్ పబ్లిసిటీ సిస్టమ్ సమాచారం ప్రకారం వెల్లడైంది. కంపెనీని 10 మిలియన్ యువాన్ల పెట్టుబడితో ప్రారంభించినట్లు సమాచారం. జాక్ మా 100 శాతం యాజమాన్యాన్ని కలిగి ఉంది. సెటప్ చైనాలో రెడీమేడ్ మీల్స్ వ్యాపారంలో విసృతంగా వ్యాపారాన్ని విస్తరించాలని చూస్తున్నట్లు ఊహాగానాలు నడుస్తున్నాయి.

చైనా ప్రధాన నగరాల్లో రెడీటూఈట్ భోజన కిట్లు, ఇతర రకాల ప్రీ-ప్యాకేజ్డ్ ఫుడ్‌లకు కూడా డిమాండ్ పెరిగింది. సాధారణ అసెంబ్లీ లేదా వంట అవసరమయ్యే ఫుడ్ బాక్స్‌ల విక్రయాలు 2018లో 10.6 బిలియన్ యువాన్ ($1.5 బిలియన్) నుంచి 29.1 బిలియన్ యువాన్ ($4 బిలియన్)కి దాదాపు మూడు రెట్లు పెరుగుదలను నమోదు చేసింది.


Click it and Unblock the Notifications