పాకిస్తాన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లో పెద్ద ట్విస్ట్ వచ్చింది. ఇప్పటివరకు "ఐరన్ బ్రదర్స్" అంటూ బలమైన బంధం చూపించిన చైనా, తన అతిపెద్ద పాకిస్తాన్ ప్రాజెక్ట్ నుంచి సైలెంట్‌గా వెనక్కి తగ్గింది. దీనితో, పాకిస్తాన్ ఇప్పుడు కొత్త పార్ట్నర్ కోసం వెతుకుతూ ఆసియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్ (ADB) దగ్గరకు వెళ్లింది.
ఇదేంటో చిన్న ప్రాజెక్ట్ కాదు CPEC (చైనా-పాకిస్తాన్ ఆర్థిక కారిడార్)లో హైలైట్‌గా చెప్పుకునే ML-1 రైల్వే అప్‌గ్రేడ్ ప్రాజెక్ట్ ఇది. దాదాపు 1800 కి.మీ పొడవైన కరాచీ నుంచి పేశావర్ వరకు ఉన్న రైల్వే లైన్‌ను మోడరన్‌గా మార్చే భారీ ప్రాజెక్ట్ ఇది. అసలు ప్లాన్ ప్రకారం దీన్ని చైనానే ఫండింగ్ చేయాలి. కానీ ఏళ్ల తరబడి చర్చలు సాగినా ఎక్కడా క్లారిటీ రాలేదు. ఇప్పుడు పాకిస్తాన్, ADB దగ్గర నుంచి 2 బిలియన్ డాలర్ల రుణం అడుగుతోంది.

చైనా ఎందుకు వెనక్కి తగ్గింది?
చైనాకు పాకిస్తాన్ అంటే కేవలం "బ్రదర్ హుడ్" మాత్రమే కాదు, ఒక ఇన్వెస్ట్‌మెంట్ భాగస్వామి కూడా. కానీ పాకిస్తాన్ పరిస్థితులు చూసి బీజింగ్ వెనకడుగు వేసింది. పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితి బలహీనపడడంతో, అప్పులు తిరిగి చెల్లించే సామర్థ్యం తగ్గిపోతోంది. ముఖ్యంగా విద్యుత్ రంగంలో చైనా కంపెనీలకు వేల కోట్ల బకాయిలు చెల్లించకపోవడం వల్ల పరిస్థితి మరింత క్లిష్టంగా మారింది. దీనికి తోడు, చైనాకు స్వదేశంలోనే ఎకనామిక్ ప్రెషర్ ఉండటంతో, రిస్క్ ఎక్కువగా ఉన్న ప్రాజెక్ట్‌లలో భారీగా డబ్బులు పెట్టేందుకు ఇప్పుడు బీజింగ్ వెనుకడుగు వేస్తుంది.
2015 నుంచి 2019 మధ్య పాకిస్తాన్‌లో హైవేలు, పవర్ ప్రాజెక్టులు, పోర్టులు అన్నీ ఫుల్ స్పీడ్‌లో సాగాయి. కానీ 2022లో గ్వాదర్ ఈస్ట్ బే ఎక్స్‌ప్రెస్‌వే పూర్తయ్యాక కొత్త ప్రాజెక్టులు ఎక్కువగా కదలలేదు. పాకిస్తాన్ చైనా కంపెనీలకు బకాయిలు ఇవ్వలేకపోవడం కూడా కొత్త ఇన్వెస్ట్మెంట్స్‌ను నెమ్మది చేసింది. ఇక ఇప్పుడు ADB ముందుకు రావడం భవిష్యత్తులో "CPEC కేవలం చైనాతోనే" అనే కాన్సెప్ట్ మారుతుందనే సిగ్నల్.
పాకిస్తాన్‌కి బలోచిస్తాన్‌లో ఉన్న రెకో డిక్ కాపర్ & గోల్డ్ మైన్ చాలా కీలక ఆస్తి. ప్రపంచంలోనే అతిపెద్ద అన్‌టాప్డ్ మినరల్ రిసోర్సెస్‌లో ఇది ఒకటి. కానీ ఇక్కడ తవ్విన ఖనిజాలను పోర్టులకు తీసుకెళ్లే ట్రాన్స్‌పోర్ట్ సదుపాయం చాలా పాతది కాబట్టి చాలా కష్టం. ప్రస్తుత ఉన్న రైల్వే లైన్ పెద్ద కార్గో మోయలేని స్థితిలో ఉంది. అంటే ML-1 రైల్వే అప్‌గ్రేడ్ లేకుండా రెకో డిక్ నుంచి వచ్చే ఎగుమతులు ప్రాక్టికల్‌గా జరగవు. ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని, ADB కేవలం ML-1 ప్రాజెక్ట్‌కే కాదు, రెకో డిక్ మైన్ ప్రాజెక్ట్‌కి కూడా ఇప్పటికే 410 మిలియన్ డాలర్ల ఫండింగ్ ఇచ్చింది. అంటే, ఇది కేవలం రైల్వే అప్‌గ్రేడ్ ఏ కాదు పాకిస్తాన్ భవిష్యత్ ఎక్స్‌పోర్ట్స్‌కి బేస్ వేసే ప్రాజెక్ట్.
పాకిస్తాన్‌కి ఇది చాలా సెన్సిటివ్ మూవ్. ఎందుకంటే చైనాతో రిలేషన్ దెబ్బతినకూడదు, కానీ ADB/వెస్టర్న్ ఇన్వెస్టర్స్‌ను కూడా దూరం చేయలేదు. అందుకే ముందుగానే చైనాకి ఈ ప్లాన్ గురించి చెప్పి "స్నేహం డామేజ్ అవ్వదు" అని హామీ ఇచ్చింది.
పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ మాటల్లో చెప్పాలంటే "ఒక ఫ్రెండ్‌ని వదిలి మరొక ఫ్రెండ్‌ని కాపాడడం." ఇకపోతే, అమెరికా కూడా మినరల్ ప్రాజెక్ట్స్, ముఖ్యంగా రెకో డిక్ మీద ఆసక్తి చూపిస్తోంది. పాకిస్తాన్ ఇప్పుడు ఒకేసారి చైనా-అమెరికా మధ్య బ్యాలెన్స్ చేస్తూ నడవాల్సిన పరిస్థితి.
ADB ముందుకు రావడం కేవలం ఫైనాన్షియల్ డెసిషన్ మాత్రమే కాదు, ఇది ఒక స్ట్రాటజిక్ సిగ్నల్ కూడా. ఇకపై పాకిస్తాన్ ఒకే దేశం మీద ఆధారపడకుండా, మల్టీ-పార్ట్నర్ పాలసీ వైపు అడుగులు వేస్తోంది. దీని ద్వారా చైనా-అమెరికా మధ్య జరుగుతున్న గేమ్‌ని స్మార్ట్‌గా ఆడుతూ, తన ప్రయోజనాలు కాపాడుకోవాలని ప్రయత్నిస్తోంది. అవును ఇది సులభం కాదు. ఎందుకంటే US-China టెన్షన్ మధ్య బ్యాలెన్స్ చేయడం పాకిస్తాన్‌కి కఠినమే. కానీ లాంగ్ రన్‌లో మాత్రం ఇది ప్రయోజనం చేకూర్చే అవకాశం ఉంది.
మొత్తానికి, చైనా ML-1 నుంచి వెనక్కి తగ్గడం CPECకి ముగింపు కాదు. కానీ ఒక పెద్ద పాజ్ బటన్ మాత్రం నొక్కింది. ఇకపై పాకిస్తాన్‌కి ఒకే ఫ్రెండ్‌పై ఆధారపడే రోజులు ముగుస్తున్నాయి. ఇది కొత్త రియాలిటీ.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు



Click it and Unblock the Notifications