బిట్ కాయిన్, ఇతర డిజిటల్ కరెన్సీలతో కూడిన ట్రాన్సాక్షన్స్ చట్టవిరుద్దమని చైనా కేంద్ర బ్యాంకు శుక్రవారం ప్రకటించింది. డిజిటల్ కరెన్సీ అనధికార వినియోగాన్ని నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసింది. క్రిప్టో కరెన్సీలను నిర్వహించకుండా 2013లోనే చైనా బ్యాంకులపై నిషేధం విధించారు. కానీ ప్రభుత్వం ఈ ఏడాది మళ్లీ ప్రకటన చేసింది. అయితే ప్రభుత్వ ఆర్థిక వ్యవస్థలో క్రిప్టో కరెన్సీ మైనింగ్, ట్రేడింగ్ ఇంకా జరుగుతోందని, పరోక్షంగా ఇది ముప్పు కలిగించవచ్చునని అధికార వర్గాలు చెబుతున్నాయి. బిట్ కాయిన్, ఎథేరియం ఇతర క్రిప్టో డిజిటల్ కరెన్సీలు ఆర్థిక వ్యవస్థను నాశనం చేస్తాయని, మనీ లాండరింగ్, ఇతర నేరాల్లో వినియోగిస్తారన్న ఫిర్యాదులు వచ్చినట్లు చైనా కేంద్ర బ్యాంకు అయిన పీపుల్స్ బ్యాంకు ఆఫ్ చైనా పేర్కొంది.
డిజిటల్ కరెన్సీ డెరివేటివ్ కాంట్రాక్టులన్నీ చట్ట విరుద్ధమని, వాటిని నిషేధిస్తున్నట్లు స్పష్టం చేసింది. చైనా కేంద్ర బ్యాంకు ప్రకటన నేపథ్యంలో బిట్ కాయిన్ వ్యాల్యూ 9 శాతానికి పైగా పతననమైంది. ప్రస్తుతం బిట్ కాయిన్ వ్యాల్యూ 41,000 డాలర్ల పైన ఉంది. ఎథేరియం పది శాతంక్షీణించి 3000 డాలర్ల నుండి 2800 డాలర్ల దిగువకు పడిపోయింది.

2021 సంవత్సరంలో క్రిప్టోకరెన్సీ మార్కెట్ భారీ ఊగిసలాటలో ఉంది. బిట్ కాయిన్, ఇతర క్రిప్టో కరెన్సీలు 2021లో ఇప్పటి వరకు అస్థిరంగా కదలాడుతున్నాయి. జనవరిలో బిట్ కాయిన్ 28,000 డాలర్లుగా ఉంది. ఆ తర్వాత ఆల్ టైమ్ గరిష్టం 64,000 డాలర్లను క్రాస్ చేసింది. ఆ తర్వాత ఓ సమయంలో 29,000 డాలర్ల స్థాయికి పడిపోయింది. ప్రస్తుతం 40,000 డాలర్ల నుండి 45,000 డాలర్ల స్థాయిలో ఉంది. బిట్ కాయిన్ ఇటీవలి కాలంలో 30,000 డాలర్ల నుండి 50,000 డాలర్ల మధ్య కదలాడుతున్నాయి. ఇటీవల భారీ దిద్దుబాటుకు గురయింది. ప్రస్తుతం 45,000 డాలర్ల దిగువన ఉన్న బిట్ కాయిన్, సమీప భవిష్యత్తులో భారీగా పెరిగే అవకాశాలు ఉన్నాయని, ఇలాంటి పరిస్థితుల్లో లాంగ్ టర్మ్‌లో బిట్ కాయిన్ పైన ఇన్వెస్ట్ చేయవచ్చునని చెబుతున్నారు.


Click it and Unblock the Notifications