భారత పొరుగుదేశం చైనా నిశ్శబ్దంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కుదేల్ చేస్తోంది. ముఖ్యంగా అగ్రరాజ్యం అమెరికా ఆర్థిక వ్యవస్థను కుప్పకూల్చేందుకు పెద్ద ప్రణాళికనే రచించింది. దీనికి సంబంధించి రహస్యంగా ఆర్థిక చర్యను చేపట్టింది. బంగారం కొనుగోలు ద్వారా అమెరికా ఆర్థిక వ్యవస్థను పతనావస్థలోకి తీసుకువెళ్లేందుకు చైనా రెడీ అయింది.
చైనా కేంద్ర బ్యాంకు నిరంతరం Gold కొనుగోలు చేసుకుంటూ పోతోంది. అదే సమయంలో అమెరికా ప్రభుత్వ రుణాన్ని వేగంగా తగ్గించుకుంటూ వస్తోంది చైనా. ఈ వ్యూహం ప్రపంచ Gold మార్కట్లో పసిడి పెరుగుదలకు దారి తీసింది. అంతే కాకుండా డాలర్ ఆధారిత వ్యవస్థ గురించి అనేక ప్రశ్నలను లేవనెత్తింది.
చైనా వ్యూహం బయటకు కనిపించేది సాధారణ పెట్టుబడి నిర్ణయంలా అనిపించినా.. లోతుగా చూస్తే ఇది అమెరికా ఆధిపత్యంలో ఉన్న డాలర్ ఆధారిత ఆర్థిక వ్యవస్థకు నేరుగా సవాలు విసురుతున్న చర్యగా నిపుణులు భావిస్తున్నారు. ఒకవైపు చైనా తన బంగారు నిల్వలను నిరంతరం పెంచుకుంటూ పోతుండగా.. మరోవైపు అమెరికా ప్రభుత్వ రుణాలపై ఆధారాన్ని క్రమంగా తగ్గిస్తోంది. ఈ ద్వంద్వ వ్యూహమే ప్రస్తుతం ప్రపంచ మార్కెట్లను కుదిపేస్తోంది.

చైనా కేంద్ర బ్యాంకు తాజా గణాంకాల ప్రకారం.. జనవరి చివరి నాటికి దేశ బంగారు నిల్వలు 74.19 మిలియన్ ఫైన్ ట్రాయ్ ఔన్సులకు చేరాయి. కేవలం ఒక నెల క్రితం ఇవి 74.15 మిలియన్ ఔన్సులుగా ఉండటం గమనార్హం. అంటే వరుసగా మరో నెల కూడా చైనా బంగారం కొనుగోళ్లు కొనసాగించింది. ఇది తాత్కాలిక నిర్ణయం కాదని, దీర్ఘకాలిక వ్యూహానికి ఇది స్పష్టమైన సంకేతమని ఆర్థిక నిపుణులు అంటున్నారు.
బంగారం పరిమాణమే కాకుండా.. దాని విలువ కూడా వేగంగా పెరుగుతోంది. డిసెంబర్ 2025లో సుమారు 319.45 బిలియన్ డాలర్లుగా ఉన్న చైనా బంగారు నిల్వల విలువ, కేవలం నెల రోజుల్లోనే 369.58 బిలియన్ డాలర్లకు చేరింది. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు రికార్డు స్థాయికి చేరడం ఇందుకు ప్రధాన కారణం. ప్రస్తుతం బంగారం.. చైనా మొత్తం విదేశీ మారక నిల్వల్లో దాదాపు 9 శాతం వాటాను కలిగి ఉండటం విశేషం.
ఇదే సమయంలో చైనా.. అమెరికా ప్రభుత్వ బాండ్లపై తన పెట్టుబడిని గణనీయంగా తగ్గిస్తోంది. అక్టోబర్ నాటికి చైనా వద్ద ఉన్న యూఎస్ ట్రెజరీ బాండ్ల విలువ 688.7 బిలియన్ డాలర్లకు పడిపోయింది. ఇది గత ఏడాదితో పోలిస్తే దాదాపు 10 శాతం తగ్గుదల. మార్కెట్లలో అకస్మాత్తు కుదుపులు రాకుండా ఉండేందుకు అమెరికా బాండ్ల హోల్డింగ్స్‌ను తగ్గించాలని చైనా నియంత్రణ సంస్థలు బ్యాంకులకు సూచించాయన్న నివేదికలు కూడా వెలుగులోకి వచ్చాయి.
ఈ రెండు చర్యలు కలిపి చూస్తే.. చైనా స్పష్టంగా డీ-డాలరైజేషన్ దిశగా అడుగులు వేస్తున్నట్టు అర్థమవుతుంది. గత దశాబ్ద కాలంగా డాలర్‌పై ఆధారాన్ని తగ్గించుకునే ప్రయత్నంలో భాగంగానే చైనా తన విదేశీ మారక నిల్వల నిర్మాణాన్ని మార్చుకుంటోంది. బంగారం వైపు మొగ్గు పెరగడం, డాలర్ ఆధారిత ఆస్తుల నుంచి నెమ్మదిగా దూరం కావడం ఈ వ్యూహానికి మూలస్తంభాలుగా చెప్పుకోవచ్చు.
ఈ పరిణామాల ప్రభావం ప్రపంచ మార్కెట్లలో స్పష్టంగా కనిపిస్తోంది. బంగారం ధరలు ఆల్‌టైమ్ హైలకు చేరగా, ఆసియా ట్రేడింగ్ సెషన్ ఇప్పుడు ధరల దిశను నిర్ణయించే స్థాయికి ఎదిగింది. చైనాలో దేశీయ పెట్టుబడిదారులు కూడా స్టాక్ మార్కెట్ అస్థిరత, రియల్ ఎస్టేట్ సంక్షోభం నేపథ్యంలో బంగారం, లోహాల వైపు ఎక్కువగా ఆకర్షితులవుతున్నారు. ఇది బంగారం డిమాండ్‌ను మరింత పెంచుతోంది.
క్లుప్తంగా చెప్పాలంటే.. చైనా చేపడుతున్న ఈ బంగారు వ్యూహం కేవలం పెట్టుబడి నిర్ణయం మాత్రమే కాదు. ఇది అమెరికా డాలర్ ఆధిపత్యానికి ఒక దీర్ఘకాలిక సవాలు. రాబోయే సంవత్సరాల్లో ఈ వ్యూహం ప్రపంచ ఆర్థిక శక్తుల సమీకరణాన్ని మార్చే స్థాయిలో ప్రభావం చూపే అవకాశముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.
More From GoodReturns

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

బంగారం, వెండి ధరలు ఈ వారం ఎలా ఉండబోతున్నాయి..వరుస సెలవులు కాపాడుతాయా..కొంపలు ముంచుతాయా..

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

హార్ముజ్ జలసంధిపై ఇరాన్ కీలక ప్రకటన..శత్రుదేశాల నౌకలకు ప్రవేశం లేదని స్పష్టం చేసిన టెహ్రాన్..

అమెరికాతో చర్చలేమి జరగలేదు..ట్రంప్ వ్యాఖ్యలను ఖండించిన ఇరాన్.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిందనే భయంతోనే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు, కారణం ఏంటంటే..



Click it and Unblock the Notifications