ఈ క్యాలెండర్ ఇయర్ (2020) తొలి త్రైమాసికంలో చైనా జీడీపీ వృద్ధి రేటు 6.8 శాతం క్షీణించింది. 1976లో వచ్చిన సాంస్కృతిక విప్లవం అనంతరం చైనా వృద్ధి రేటు ఇంతలా పడిపోవడం ఇదే మొదటిసారి. కరోనా మహమ్మారి వ్యాప్తిని అరికట్టేందుకు చైనా చర్యలు తీసుకుంది. దీంతో ఆర్థిక వ్యవస్థ పడకేసింది. కరోనా చైనాలోని వూహాన్ నగరంలో పుట్టిన విషయం తెలిసిందే.

2.91 లక్షల కోట్ల డాలర్లుగా..
చైనాలో కరోనా కారణంగా ఆర్థిక కార్యకలాపాలు పూర్తిగా స్తంభించిపోవడంతో ఆర్థిక వ్యవస్థకు గత ఏడాదితో పోలిస్తే జీడీపీలో 6.8% నష్టం వాటిల్లింది. మార్చి నెల నాటికి త్రైమాసిక ఫలితాలు వెలువడ్డాయి. చైనా నేషనల్ బ్యూరో ఆఫ్ స్టాటిస్టిక్స్ (NBS) ప్రకారం.. 2020 జనవరి - మార్చి క్వార్టర్‌లో చైనా జీడీపీ 20.65 ట్రిలియన్ యువాన్లుగా నమోదయింది. డాలర్ రూపంలో ఇది 2.91 లక్షల కోట్ల డాలర్లు.

అప్పటి నుండి తొలిసారి
దేశంలో మార్కెట్ తరహా ఎకానమీ విధానాలు ప్రవేశపెట్టిన తర్వాత ఇంతలా నష్టం ఇదే మొదటిసారి. 1992లో ఫిగర్స్‌ను వెల్లడిస్తోంది. అప్పటి నుండి ఓ క్వార్టర్‌లో ఇంత తక్కువగా ఎప్పుడూ రాలేదు. వుహాన్ నగరంలో కరోనా పుట్టిన అనంతరం చైనా లాక్ డౌన్ ప్రకటించింది. పరిశ్రమలు, వ్యాపార సంస్థలు, మాల్స్, మార్కెట్లు మూసివేసింది. దీంతో ఆర్థిక వ్యవస్థపై దెబ్బ పడింది.

ఈ మూడింటికి దెబ్బ
మొదటి రెండు నెలల్లో 20.5 శాతం తగ్గిన వృద్ధి రేటు మార్చిలో కాస్త పుంజుకుందని NBS తెలిపింది. చైనా వృద్ధికి మూడు ముఖ్య కారణాలు. కన్స్యూమర్ స్పెండింగ్, ఎక్స్‌పోర్ట్స్, ఫిక్స్డ్ అసెట్ ఇన్వెస్ట్‌మెంట్స్. లాక్ డౌన్ కారణంగా ఇవన్నీ దెబ్బతిన్నాయి. రిటైల్ స్పెండింగ్ 19 శాతం పడిపోయింది. ఎక్స్‌పోర్ట్స్ 13 శాతం పడిపోయాయి. ఫిక్స్డ్ అసెట్ ఇన్వెస్ట్‍మెంట్ 16 శాతం తగ్గాయి.

అమెరికాతో ట్రేడ్ వార్
అమెరికాతో వాణిజ్య యుద్ధం కారణంగా 2019లో చైనా వృద్ధి రేటు 6.1 శాతంగా నమోదయింది. నాడు ఉద్రిక్తతల వల్ల మూడు దశాబ్దాల్లోనే అత్యల్ప వృద్ధి రేటును నమోదు చేసింది. 2018లో 13.1 లక్షల కోట్ల డాలర్లుగా ఉన్న జీడీపీ 2019లో 14.38 లక్షల కోట్ల డాలర్లకు చేరకుుంది. కానీ ఇప్పుడు కరోనా కారణంగా చైనా ఆర్థిక వ్యవస్థ దెబ్బతిన్నది.

క్రమంగా లాక్ డౌన్ ఎత్తివేత
దేశ ఆర్థిక వ్యవస్థపై భారం వల్ల మార్చి నెలలోనే వూహాన్ మినహా మిగతా ప్రాంతాల్లో లాక్ డౌన్ ఎత్తివేసింది చైనా. దెబ్బతిన్న దేశ ఆర్థిక వ్యవస్థ ఈ ఏడాది మూడో వారం లేదా నాలుగో వారంలో కోలుకుంటుందని చెబుతున్నారు. దీంతో పెట్టుబడిదారుల్లో కొత్త ఆశలు చిగురించడంతో పాటు ఆసియా స్టాక్ మార్కెట్ శుక్రవారం లాభాల దిశగా దూసుకుపోయింది.
More From GoodReturns

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

బెంగళూరులో తీవ్రమైన ఎల్పీజీ సంక్షోభం..సగం గ్యాస్ స్టేషన్లు మూత..ఆటో డ్రైవర్లు విలవిల..



Click it and Unblock the Notifications