చైనా తన బంగారం నిల్వలను మరింత బలోపేతం చేస్తూ, వరుసగా 11వ నెలలో కూడా బంగారం అధిక మొత్తంలో కొనుగోలు చేసింది. సెప్టెంబర్ నెలలో కూడా ఈ కొనుగోలు కొనసాగినట్టు పీపుల్స్ బ్యాంక్ ఆఫ్ చైనా (PBoC) మంగళవారం వెల్లడించింది. ఆగస్టు చివరి నాటికి 74.02 మిలియన్ ట్రాయ్ ఔన్సులుగా ఉన్న చైనా బంగారు నిల్వలు, సెప్టెంబర్ చివరి నాటికి 74.06 మిలియన్ ట్రాయ్ ఔన్సులకు పెరిగాయి. అంటే, చైనా గత నెలలో కూడా తన Gold నిల్వలను పెంచడం ద్వారా దీర్ఘకాలిక కొనుగోలు ధోరణిని కొనసాగించింది.
PBoC వెల్లడించిన గణాంకాల ప్రకారం, చైనా బంగారు నిల్వల విలువ ఆగస్టు చివరి నాటికి 253.84 బిలియన్ అమెరికన్ డాలర్లు ఉండగా, సెప్టెంబర్ చివరి నాటికి అది 283.29 బిలియన్ డాలర్లకు చేరింది. ఈ పెరుగుదల చైనా డాలర్‌పై ఆధారాన్ని తగ్గించి, ప్రత్యామ్నాయ రిజర్వ్ ఆస్తులను పెంచాలనే వ్యూహాన్ని సూచిస్తుంది.స్వతంత్ర విలువైన లోహాల విశ్లేషకుడు రాస్ నార్మన్ రాయిటర్స్‌తో మాట్లాడుతూ.. చైనా డాలర్ విలువను తగ్గించేందుకు, తన అంతర్జాతీయ ఆర్థిక చర్యలను వేగవంతం చేయడానికి ఉత్సాహంగా ఉందనే ఆలోచనను ఈ సంఖ్య బలపరుస్తుందని తెలిపారు.

అలాగే ఆయన చిన్న మొత్తంలో అయినా నిరంతర Gold కొనుగోళ్లు మార్కెట్‌లో సానుకూల ప్రభావం చూపుతాయి. ఇవి లోకల్ షాంఘై మార్కెట్‌లో తగ్గింపులను తగ్గించడమే కాకుండా, పెట్టుబడిదారులకు, సంస్థలకు బంగారం ధరలు ఇంకా పెరుగుతాయనే నమ్మకాన్ని ఇస్తాయని పేర్కొన్నారు.
2025 నాటికి ప్రపంచ బంగారం ధరలు ఈ సంవత్సరంతో పోలిస్తే 52 శాతం పైగా పెరిగాయి. ఈ పెరుగుదలకు అమెరికా సుంకాలు, వడ్డీ రేటు తగ్గింపుల అంచనాలు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, బలహీనపడుతున్న డాలర్, కేంద్ర బ్యాంకుల భారీ కొనుగోళ్లు ప్రధాన కారణాలుగా నిపుణులు చెబుతున్నారు. గమనించదగ్గ విషయం ఏమిటంటే మే 2024లో చైనా సెంట్రల్ బ్యాంక్ 18 నెలల పాటు కొనుగోళ్లు కొనసాగించిన తర్వాత ఒక తాత్కాలిక విరామం తీసుకుంది. అయితే, గత సంవత్సరం నవంబర్‌లో బంగారం కొనుగోళ్లు మళ్లీ ప్రారంభించడంతో ఈ ధోరణి కొత్త ఉత్సాహాన్ని సంతరించుకుంది.
ఇటీవలి నెలలలో చైనా, రష్యా, ఇతర అభివృద్ధి చెందుతున్న దేశాలు తమ డాలర్ ఆధారిత నిల్వలను తగ్గించి, బంగారం వంటి భద్రమైన ఆస్తులపై దృష్టి పెట్టడం గమనార్హం. ఆర్థిక నిపుణుల అంచనా ప్రకారం.. చైనా వంటి ప్రధాన దేశాలు తమ రిజర్వులను బంగారంలో ఉంచడం వల్ల అంతర్జాతీయ బంగారం డిమాండ్ మరింత పెరగవచ్చని చెబుతున్నారు. ఇది ప్రపంచ మార్కెట్‌లో డాలర్ బలహీనతను కూడా సూచించే అవకాశాలు ఉన్నాయి. ఏదేమైనా చైనా నిరంతర బంగారం కొనుగోలు ధోరణి ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో తన ప్రాధాన్యతను పెంచుకోవడానికి కూడా ఒక వ్యూహాత్మక చర్యగా విశ్లేషకులు భావిస్తున్నారు.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి
More From GoodReturns

ఈ ఏడాది బంగారం, వెండి పెరుగుదలపై సంచలన నివేదిక.. ఏకంగా ఆ స్థాయి వరకు వెళుతుందంటున్న నిపుణులు..

బంగారం, వెండి ధరలు ఈ రేటుకు దిగి వస్తేనే కొనండి.. కీలక సూచన చేస్తున్న బులియన్ నిపుణులు

బంగారం ధరల పతనంపై బిగ్ అలర్ట్.. ఈ రాత్రి గడిస్తే చాలురా దేవుడా అంటున్న ఇన్వెస్టర్లు..

బంగారం, వెండి ధరలపై సస్పెన్స్.. ఆర్బీఐ నిర్ణయంతో రేట్లు తగ్గుతాయా..పెరుగుతాయా..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 7, మంగళవారం ధరలు ఇవే..

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

6 వేల డాలర్ల మార్క్ దాటబోతున్న బంగారం ధర.. డాలర్ విలువ ఖేల్ ఖతం.. ప్రపంచ రారాజుగా పసిడి..

బంగారం ధరల తగ్గుదలపై యూబీఎస్ సంచలన నివేదిక.. సామాన్యులకు పండగలాంటి వార్తే ఇది.. ఇన్వెస్టర్లకు మాత్రం..

Today Gold Silver Rate Live: ఇరాన్ ఉద్రిక్తతలతో మారుతున్న బంగారం ధరలు

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

Today Gold Silver Rate Live: భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు



Click it and Unblock the Notifications