Trump Tariffs News: ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా అడుగు పెట్టి రెండు వారాలు కూడా కాకుండానే పరిస్థితులు పూర్తిగా మారిపోతున్నాయి. అందరూ ఊహించినట్లు ట్రంప్ చైనా, మెక్సికో, కెనడాలపై టారిఫ్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే కెనడా, మెక్సికోలపై ప్రకటించిన పన్నులను కొన్ని గంటల్లోనే వెనక్కి తీసుకోగా చైనా విషయంలో మాత్రం తగ్గేదే లే అన్నట్లుగా ముందుకు సాగుతున్నారు.
కొన్ని గంటల కిందట అమెరికా అధ్యక్షుడి డొనాల్డ్ ట్రంప్ చైనా నుంచి చేసుకునే దిగుమతులపై 10 శాతం వాణిజ్య పన్ను విధిస్తున్నట్లు వెల్లడించారు. వాస్తవానికి ఇలాంటి పరిస్థితిని ముందుగానే ఊహించి సిద్ధంగా ఉన్నట్లు కనిపిస్తోంది. ట్రంప్ ప్రకటన తర్వాత అమెరికా నుంచి బొగ్గు, ఎల్ఎన్జీ ఉత్పత్తులపై 15 శాతం దిగుమతి సుంకం విధిస్తున్నట్లు ప్రకటించింది. దీంతో రెండు దేశాల మధ్య వాణిజ్య యుద్ధం స్టార్ట్ కావటం ప్రపంచ దేశాలను కూడా ఆందోళనలకు గురిచేస్తోంది.

ఇదే క్రమంలో అమెరికా నుంచి దిగుమతి చేసుకునే ముడి చమురు, వ్యవసాయ పరికరాలు, పికప్ ట్రక్కులు, పెద్ద ఇంజిన్ స్పోర్ట్స్ కార్ల వంటి అధిక పనితీరు గల ఆటోమొబైల్స్ ఉత్పత్తులపై కూడా 10% సుంకాలను విధించే ప్లాన్‌లో ఉన్నట్లు చైనా ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అమెరికా ఏకపక్షంగా సుంకాలను పెంచటం వల్లే తాము కూడా పన్నులు పెంచాల్సిన పరిస్థితి ఏర్పడిందని చైనా ప్రస్తుత పరిస్థితులపై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. పెంచబడిన టారిఫ్స్ సోమవారం నుంచి అధికారంలోకి వస్తాయని చైనా వెల్లడించింది.
అమెరికా ఏకపక్షంగా సుంకాలను పెంచటం వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ నిబంధనలను అతిక్రమించటమేనని చైనా ఆర్థిక మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఇది సమస్యల పరిష్కారానికి విరుద్ధంగా మారి అమెరికా చైనాల మధ్య ఆర్థిక వ్యాపార సహకారాన్ని దెబ్బతీస్తుందని పేర్కొంది. ఇదే క్రమంలో చైనా.. అనుమానిత యాంటీట్రస్ట్ నేరాలకు సంబంధించి అమెరికా టెక్ దిగ్గజం గూగుల్‌పై దర్యాప్తు చేస్తుందని బ్లూమ్‌బెర్గ్ నివేదించింది. గూగుల్ కన్జూమర్ సెర్చ్, ఇంటర్నెట్ సేవలను 2010లోనే ముగించినప్పటిక.. అడ్వర్టైజింగ్ రంగంలో మాత్రం ఇప్పటికీ ఉనికిని కలిగి ఉన్న సంగతి తెలిసిందే.
యూఎస్ అధ్యక్షుడు ట్రంప్ కెనడా, మెక్సికోలపై ప్రకటించిన 25 శాతం టారిఫ్ రేట్లను మరో 30 రోజుల పాటు వాయిదా వేస్తున్నట్లు నేడు ప్రకటించటం ఆ దేశాలకు కొంత ఊరటను కలిగిస్తోంది. కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో వలసలను పరిష్కరించడానికి, ప్రమాదకరమైన డ్రగ్ ఫెంటానిల్ అమెరికాలోకి అక్రమంగా తరలించటాన్ని అరికట్టడానికి చర్యలు తీసుకుని దేశ సరిహద్దును బలోపేతం చేస్తానని అంగీకరించటంతో టారిఫ్స్ వాయిదా పడ్డాయి. ఇదే క్రమంలో చైనా వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ వద్ద ట్రంప్ తాజా టారిఫ్ రేట్లపై ఫిర్యాదు చేసింది. వాటిని దురుద్దేశ పూర్వకంగా డ్రాగన్ దేశం పేర్కొంది.
అమెరికా నుంచి టారిఫ్ బెదిరింపులు అందుకున్న వాటిలో ఇండియా కూడా ఉన్న సంగతి తెలిసిందే. అయితే ట్రంపు ప్రభుత్వంతో ఇండియా ఎలా ఈ విషయంలో ముందుకు సాగుతుందనేదాని ప్రకారం సుంకాలు ఉంటాయా ఉండవా అనేది తెలుస్తుంది. రానున్న రోజుల్లో దీనిపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.
More From GoodReturns

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

6 వేల డాలర్ల మార్క్ దాటబోతున్న బంగారం ధర.. డాలర్ విలువ ఖేల్ ఖతం.. ప్రపంచ రారాజుగా పసిడి..

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

బెంగళూరులో రూ. 5 వేలకే రూమ్..ఈ ఏరియాలోకి రమ్మని పిలుస్తున్న ఇంటి ఓనర్లు..

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

విజయవాడ నుంచి హైదరాబాద్‌కు గంటే ప్రయాణం.. 220 కి.మీ స్పీడ్‌తో కొత్త రైలు.. వందే భారత్ కన్నా ఫాస్ట్..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు పసిడి రేటు ఎంత వరకు తగ్గిందంటే.. ఏప్రిల్ 13, సోమవారం ధరలు ఇవే..

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..



Click it and Unblock the Notifications