ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో ఒకటైన చైనా.. బంగారంపై (Gold) తన పట్టును మరింత పెంచుకుంటోంది. చైనా సెంట్రల్ బ్యాంక్ అయిన పీపుల్స్ బ్యాంక్ ఆఫ్ చైనా (PBOC) వరుసగా 13వ నెల కూడా తమ బంగారం నిల్వలు (Gold Reserve) పెంచుకుంది. నవంబర్ 2024 లో ప్రారంభమైన ఈ కొనుగోళ్ల పరంపర నిరాటంకంగా కొనసాగుతుండటం ప్రపంచ ఆర్థిక మార్కెట్లలో ఆసక్తిని రేకెత్తిస్తోంది.

తాజాగా విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. గత నెలలో చైనా సెంట్రల్ బ్యాంక్ 30,000 ట్రాయ్ ఔన్సుల బంగారాన్ని తమ నిల్వలకు జోడించింది. దీంతో చైనా మొత్తం బంగారం నిల్వలు సుమారు 74.12 మిలియన్ ట్రాయ్ ఔన్సులకు చేరుకున్నాయి.
అంతర్జాతీయ మార్కెట్‌లో కీలక పరిణామాలు
అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర ఔన్స్‌కు 4,000 డాలర్ల మార్క్‌పైన స్థిరపడింది. అక్టోబర్‌లో గరిష్ట స్థాయి నుంచి స్వల్పంగా తగ్గినప్పటికీ.. 1979 తర్వాత అత్యుత్తమ సంవత్సరానికి చేరుకునే దిశగా పసిడి ప్రయాణిస్తోంది.
బంగారం ధర పెరుగుదలకు కారణం
డిసెంబర్ 9-10 తేదీల్లో జరగబోయే సమావేశంలో అమెరికన్ ఫెడరల్ రిజర్వ్ (Federal Reserve) వడ్డీ రేట్లను తగ్గిస్తుందనే అంచనాలు బలంగా ఉన్నాయి. వడ్డీ రేట్లు తగ్గితే డాలర్ బలహీనపడి, బంగారం ధర పెరుగుతుంది. తదుపరి ఫెడ్ మానిటరీ పాలసీ.. మరింత డొవిష్ వైఖరి తీసుకునే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. ఈ పరిణామాలు బంగారం పెట్టుబడులను ఆకర్షిస్తున్నాయి.
సెంట్రల్ బ్యాంకుల కొనుగోళ్లు
ప్రపంచవ్యాప్తంగా సెంట్రల్ బ్యాంకుల బంగారం కొనుగోళ్లు మళ్లీ ఊపందుకున్నాయి. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ (World Gold Council) ప్రకారం.. మధ్యలో కొద్దిగా మందగించిన కొనుగోళ్లు తర్వాతి అక్టోబర్, నవంబర్ నాటికి మళ్లీ పెరిగాయి. దీనికి ప్రధాన కారణం రష్యా-ఉక్రెయిన్ యుద్ధం తర్వాత మాస్కో విదేశీ రిజర్వ్‌ల ఆస్తులను స్తంభింపజేయడం.
దేశాలు తమ విదేశీ నిల్వలను కేవలం అమెరికన్ డాలర్‌పైనే ఆధారపడకుండా, డాలర్ ప్రమాదాలకు వ్యతిరేకంగా హెడ్జ్ (Hedge) చేయడానికి బంగారం కొనుగోళ్లకు మొగ్గు చూపుతున్నాయి. డాలర్‌కు ప్రత్యామ్నాయంగా బంగారాన్ని చేర్చుకోవడం ద్వారా తమ ఆర్థిక శక్తిని, భద్రతను పెంచుకోవాలని భావిస్తున్నాయి. ముఖ్యంగా చైనా, గ్లోబల్ బులియన్ మార్కెట్‌లో తమ స్థానాన్ని పెంచుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది.
చైనా వ్యూహం ఇదే..
చైనా గ్లోబల్ బులియన్ కేంద్రంగా నిలిచే ప్రయత్నం చేస్తోందని నిపుణులు అంచనా వేస్తున్నారు. చైనా కేవలం తన బంగారం నిల్వలు పెంచుకోవడమే కాకుండా, ప్రపంచ బులియన్ మార్కెట్‌లో మరింత ఆర్థిక ప్రభావాన్ని (Financial Clout) పొందాలని చూస్తోంది. ఇందులో భాగంగా, ఇతర దేశాల సెంట్రల్ బ్యాంకులు తమ బంగారాన్ని చైనాలో నిల్వ చేసుకోవడానికి ఆకర్షణీయమైన ఆఫర్‌లను అందిస్తోంది. అయితే ఇప్పటివరకు కాంబోడియాతో సహా కొన్ని చిన్న దేశాలు మాత్రమే ఈ ఆఫర్‌ను అంగీకరించాయి. భవిష్యత్తులో గ్లోబల్ ట్రేడ్‌లో డాలర్ ఆధిపత్యాన్ని తగ్గించే ప్రయత్నంగా చైనా ఈ వ్యూహాన్ని అమలు చేస్తున్నట్లు మార్కెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
More From GoodReturns

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

బెంగళూరులో తీవ్రమైన ఎల్పీజీ సంక్షోభం..సగం గ్యాస్ స్టేషన్లు మూత..ఆటో డ్రైవర్లు విలవిల..

Gold silver: బంగారం ధరలకు రెక్కలు వస్తాయా? విదేశాల నుంచి వచ్చే జ్యువెలరీపై మోడీ సర్కార్ ఆంక్షలు!



Click it and Unblock the Notifications