PM Modi: ఎప్పుడూ భారత్ గురించి నెగిటివ్‌గా మాట్లాడే చెైనా ఒక్కసారిగా ప్రధాని మోదీని ఆకాశానికెత్తేసింది. దేశ పురోగతిలో ఆయన చొరవను ప్రశంసించింది. ఆర్థికాభివృద్ధి, సామాజిక పాలనలో ఇండియా అత్యుత్తమ ఫలితాలు సాధించిందని చైనా ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే గ్లోబల్ టైమ్స్ ఓ కథనం ప్రచురించింది.
భారత్ సాధించిన గొప్ప విజయాల గురించి ఫుడాన్ విశ్వవిద్యాలయంలోని దక్షిణాసియా అధ్యయనాల కేంద్రం డైరెక్టర్ జాంగ్ జియాడాంగ్ గ్లోబల్ టైమ్స్ లో విశ్లేషణాత్మక ఆర్టికల్ రాశారు. నాలుగేళ్ల క్రితంతో పోల్చితే భారత్ పలు విషయాల్లో పూర్తిగా మారిపోయిందని అందులో తెలిపారు. ప్రస్తుతం ఆర్థిక వ్యవస్థను పరుగులు పెట్టిస్తూ, శరవేగంగా అభివృద్ధి చెందుతోందని కీర్తించారు.

వేగవంతమైన ఆర్థిక మరియు సామాజిక అభివృద్ధితో భారత్ ఎన్నడూ లేనివిధంగా దూసుకువెళ్తున్నట్లు చెప్పారు. దౌత్య సంబంధాలను బలోపేతం చేసుకోవడంలో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నట్లు జియాడాంగ్ అభిప్రాయపడ్డారు. మోదీ అధికారం చేపట్టినప్పటి నుంచి అమెరికా, జపాన్, రష్యా వంటి దేశాలతో దోస్తీ పటిష్టమైనట్లు తెలిపారు.
ఇక రష్యా-ఉక్రెయిన్ వివాదం గురించి భారత్ వైఖరిపైనా ఆయన కామెంట్స్ చేశారు. పశ్చిమ దేశాలకు దూరమైనా, అభివృద్ధి చెందుతున్న దేశాలకు మరింత సన్నిహితంగా మెలుగుతోందన్నారు. ఇటీవల మరో సందర్భంలో 'బలమైన భారత్'ను రూపొందించడంలో విదేశాంగ మంత్రి జైశంకర్ ప్రాముఖ్యత ఎంతో ఉన్నట్లు చెప్పారు.
సంస్కృతీ, సంప్రదాయాలకు విలువనిస్తూనే స్వంత ప్రయోజనాలు కాపాడుకునేందుకు ఇండియా కట్టుబడి ఉన్నట్లు జియాడాంగ్ తెలిపారు. ఆ విలువైన సంపదను కొన్ని దేశాల మాదిరిగా విదేశీ టూరిస్టులను ఆకర్షించడానికి కాకుండా దేశాభివృద్ధికి మూలస్తంభంగా ఇండియా భావిస్తున్నట్లు గుర్తించానన్నారు.


Click it and Unblock the Notifications