అగ్రరాజ్యం అమెరికా విధిస్తున్న సుంకాలతో పొరుగుదేశం చైనా అలర్ట్ అయింది. ముందస్తు చర్యలు తీసుకుంటూ దేశీయ రంగాన్ని బలోపేతం చేసుకుంటూ ముందుకు సాగుతోంది. తాజాగా మరో సంచలన నిర్ణయం తీసుకుని ప్రపంచ దేశాలకు భారీ షాకిచ్చింది. సెమీకండక్టర్ రంగంలో విదేశీ సాంకేతికతపై ఆధారపడటాన్ని పూర్తిగా తగ్గించుకునే దిశగా బీజింగ్ ఈ కీలక నిర్ణయం తీసుకుంది.
కొత్తగా వ్యాపారాన్ని ప్రారంభించబోయే చిప్ తయారీ సంస్థలు కనీసం 50 శాతం చైనా తయారు చేసిన పరికరాలను ఉపయోగించాల్సిందేనని ఆదేశాలు జారీ చేస్తోంది. ఈ నిబంధన అధికారికంగా బహిర్గతం కాకపోయినా.. ప్లాంట్ల నిర్మాణం లేదా విస్తరణకు అనుమతులు కోరుతున్న కంపెనీలకు ఇది తప్పనిసరి షరతుగా మారినట్లు రాయిటర్స్ కథనం తెలిపింది.

ఈ చర్య వెనుక ప్రధాన కారణం ఏంటంటే.. అమెరికా విధించిన కఠిన ఎగుమతి పరిమితులు అని చెప్పవచ్చు. 2023లో అమెరికా, చైనాకు అధునాతన AI చిప్‌లు, కీలక సెమీకండక్టర్ పరికరాల విక్రయాలను నిషేధించడంతో.. China స్వదేశీ సరఫరా గొలుసును బలోపేతం చేయడంపై దృష్టి సారించింది. ఆ దిశగా 50 శాతం దేశీయ పరికరాల నిబంధన అత్యంత ప్రాధాన్యమైన అడుగుగా పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి.
ఈ నియమం ప్రకారం.. ఫ్యాబ్‌లు తమ సేకరణ టెండర్ల ద్వారా కనీసం సగం పరికరాలు చైనాలో తయారైనవేనని నిరూపించాలి. ఈ పరిమితిని మించి విదేశీ పరికరాలు ఉపయోగించిన దరఖాస్తులు సాధారణంగా తిరస్కరించబడుతున్నాయి. అయితే, అత్యాధునిక చిప్ ఉత్పత్తికి అవసరమైన కొన్ని పరికరాలు ఇంకా దేశీయంగా అందుబాటులో లేనందున.. అటువంటి సందర్భాల్లో అధికారులు కొంత సానుకూలత చూపుతున్నారని వర్గాలు వెల్లడించాయి.
వాస్తవానికి చైనా అధికారుల తుది లక్ష్యం 100 శాతం దేశీయ పరికరాలతో ప్లాంట్లు నడపడం అనే అభిప్రాయమని పరిశ్రమలో బలంగా వినిపిస్తోంది. ఈ విధానం అధ్యక్షుడు జిన్‌పింగ్ పిలుపునిచ్చిన మొత్తం దేశం విధానంలో భాగంగా అమలవుతోంది. వేలాది శాస్త్రవేత్తలు, ఇంజినీర్లతో పూర్తిగా స్వయం సమృద్ధిగల సెమీకండక్టర్ సరఫరా గొలుసును నిర్మించడమే దీని లక్ష్యం.
చైనా అధ్యక్షుడు తీసుకువచ్చిన ఈ విధానం ఇప్పటికే ఫలితాలను ఇవ్వడం ప్రారంభించింది. ముఖ్యంగా ఎచింగ్ టెక్నాలజీ వంటి కీలక దశల్లో చైనా కంపెనీలు వేగంగా పురోగమిస్తున్నాయి. దేశీయ పరికరాల దిగ్గజం నౌరా టెక్నాలజీ, చైనా అతిపెద్ద చిప్ తయారీ సంస్థ SMIC యొక్క 7nm ఉత్పత్తి లైన్లలో తన ఎచింగ్ సాధనాలను పరీక్షిస్తోంది. ఇది ఇంతకుముందు 14nm టెక్నాలజీలో సాధించిన విజయానికి కొనసాగింపుగా భావిస్తున్నారు.
ఇప్పటివరకు లామ్ రీసెర్చ్, టోక్యో ఎలక్ట్రాన్ వంటి విదేశీ సంస్థలు ఆధిపత్యం చెలాయించిన ఈ విభాగంలో, నౌరా, AMEC వంటి చైనా కంపెనీలు వాటిని పాక్షికంగా భర్తీ చేస్తున్నాయి. 2025లో నౌరా ఒక్కటే 779 పేటెంట్లు దాఖలు చేయడం చైనా సాంకేతిక పురోగతిని స్పష్టంగా చూపుతోంది. ఆర్థికంగా కూడా ఈ మార్పులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. 2025 మొదటి అర్ధ భాగంలో నౌరా ఆదాయం 30 శాతం పెరిగి 16 బిలియన్ యువాన్లకు చేరగా, AMEC ఆదాయం 44 శాతం వృద్ధితో 5 బిలియన్ యువాన్లను దాటింది.
More From GoodReturns

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..



Click it and Unblock the Notifications