పొరుగుదేశం చైనా టెక్నాలజీ రంగంలో దూసుకుపోతోంది. ప్రపంచ దేశాలకు సవాల్ విసురుతూ టెక్ రంగాన్ని ఎప్పటికప్పుడు బలోపేతం చేసుకుంటూ ముందుకు సాగుతోంది. అగ్రరాజ్యం అమెరికాను వెనక్కి నెట్టి ఎలాగైనా నంబర్ వన్ స్థానాన్ని ఆక్రమించుకునేందుకు పావులో కదుపుతోంది. ఇందులో భాగంగా సరికొత్త ఆవిష్కరణల వైపు తన లక్ష్యాన్ని గురి పెట్టింది. ఇప్పుడు తాజాగా పంచవర్ష ప్రణాళికలో హైటెక్ రంగాలకు అత్యున్నత ప్రాధాన్యత ఇస్తోంది.
కృత్రిమ మేధస్సు (AI), 6G కమ్యూనికేషన్ టెక్నాలజీ, హ్యూమనాయిడ్ రోబోటిక్స్ వంటి భవిష్యత్ పరిశ్రమలను వేగంగా అభివృద్ధి చేయడమే ఈ ప్రణాళిక ప్రధాన లక్ష్యంగా పెట్టుకుంది. ముఖ్యంగా AI చిప్‌ల తయారీలో పురోగతి, తదుపరి తరం వైర్‌లెస్ నెట్‌వర్క్‌ల అభివృద్ధి, అలాగే రోబోటిక్స్‌కు అవసరమైన ప్రమాణాల ఏర్పాటు ద్వారా ప్రపంచ టెక్నాలజీ రంగంలో చైనా తన ఆధిపత్యాన్ని మరింత బలోపేతం చేయాలనుకుంటోంది.

AI పరిశ్రమను వేగంగా ముందుకు నడిపించేందుకు శిక్షణ చిప్‌లు, విభిన్న కంప్యూటింగ్ సాంకేతికతలు వంటి కీలక రంగాల్లో పురోగతిని సాధించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు పరిశ్రమ, సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ (MIIT) అధికారులు వెల్లడించారు. సాఫ్ట్‌వేర్, బయోటెక్నాలజీ, కమ్యూనికేషన్స్ రంగాల్లో AIని విస్తృతంగా వాడటం ద్వారా ఉత్పాదకతను పెంచాలని చైనా ప్రభుత్వం యోచిస్తోంది. అదే సమయంలో.. ఆధునిక AI మోడల్స్, ఇంటెలిజెంట్ ఏజెంట్ల అభివృద్ధికి ప్రోత్సాహం ఇవ్వడం, స్టార్టప్‌లు, సంస్థల వృద్ధికి మద్దతు అందించడం కూడా ఈ వ్యూహంలో భాగంగా ఉంది.
AI పర్యావరణ వ్యవస్థను మరింత బలపరచేందుకు పరిశ్రమ ప్రమాణాలు, ఓపెన్-సోర్స్ కార్యక్రమాలను ప్రవేశపెట్టాలని MIIT భావిస్తోంది. అలాగే హ్యూమనాయిడ్ రోబోట్ల రంగంలో చైనా ఓపెన్-సోర్స్ కమ్యూనిటీని నిర్మించనుందని, ఎంబోడీడ్ ఇంటెలిజెన్స్‌కు సంబంధించిన మార్గదర్శకాలను విడుదల చేయనున్నట్లు మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ఇది రోబోటిక్స్‌ను పరిశ్రమలు, ఆరోగ్యం, సేవల రంగాల్లో విస్తృతంగా వినియోగించేందుకు దోహదపడనుంది.
గత కొన్ని సంవత్సరాలుగా చైనా టెక్నాలజీ రంగం వేగంగా విస్తరిస్తోంది. అమెరికా-చైనా టెక్ పోటీ తీవ్రమవుతున్న నేపథ్యంలో.. స్టార్టప్‌ల నుంచి దిగ్గజ కంపెనీల వరకు అందరూ కొత్త ఆవిష్కరణల కోసం పోటీపడుతున్నారు. ఈ క్రమంలో, స్థానిక ప్రభుత్వాలు కూడా తమ అభివృద్ధి ప్రణాళికల్లో హైటెక్ రంగాలను కీలకంగా గుర్తిస్తున్నాయి.
ఇందులో భాగంగానే హాంగ్‌జౌ నగరం 2030 నాటికి మూడు కంటే ఎక్కువ అంతర్జాతీయ స్థాయి ఓపెన్-సోర్స్ AI ఫౌండేషన్ మోడల్స్‌ను అభివృద్ధి చేయాలని, AI పరిశ్రమ ద్వారా 600 బిలియన్ యువాన్లకు మించి ఆదాయం సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటికే ఈ నగరం డీప్‌సీక్, యూనిట్రీ రోబోటిక్స్ వంటి ప్రముఖ స్టార్టప్‌లకు కేంద్రంగా మారింది.
కమ్యూనికేషన్ మౌలిక సదుపాయాల పరంగా, చైనా ఇటీవల రెండో దశ 6G సాంకేతిక ట్రయల్స్‌ను ప్రారంభించింది. ఈ దశలో 300కు పైగా కీలక సాంకేతికతల నిల్వను రూపొందించినట్లు MIIT తెలిపింది. ఒక వైపు ప్రస్తుత టెక్నాలజీని వాణిజ్యీకరిస్తూనే, మరో వైపు తదుపరి తరం అభివృద్ధిపై దృష్టి పెట్టడం చైనా వ్యూహంగా మారింది. 6Gతో పాటు ఆప్టికల్ కమ్యూనికేషన్స్, క్వాంటం కంప్యూటింగ్ రంగాల్లోనూ పరిశోధనను వేగవంతం చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.
అయితే, అంతర్జాతీయ స్థాయిలో చైనాకు సవాళ్లు కూడా ఎదురవుతున్నాయి. యూరోపియన్ యూనియన్ తన టెలికాం మౌలిక సదుపాయాల నుంచి చైనా తయారీ పరికరాలను దశలవారీగా తొలగించాలనే ఆలోచనలో ఉంది. భద్రతా కారణాలను చూపుతూ Huawei, ZTE వంటి కంపెనీలపై ఆంక్షలు విధించే అవకాశం ఉందని నివేదికలు చెబుతున్నాయి. దీనివల్ల యూరోప్‌లో టెలికాం ఖర్చులు పెరిగే ప్రమాదం ఉందని, 6G సేవల ప్రారంభం ఆలస్యం కావచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు.అయినా చైనా వెనుకడుగు వేయకుండా తన పని తాను చేసుకుని పోతుందని నిపుణులు చెబుతున్నారు.
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?

Interest rates Hike: త్వరలో ప్రపంచవ్యాప్తంగా పెరగనున్న వడ్డీ రేట్లు.. మన EMIలు కూడా పెరుగుతాయా?

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..



Click it and Unblock the Notifications