అమెరికా H-1B వీసాకు $100,000 ఫీజు నిర్ణయం తీసుకున్న వెంటనే,ఉద్యోగ నిపుణుల్లో ఆందోళన పెరిగింది. అదే సమయంలో, చైనా యువ శాస్త్ర, సాంకేతిక నిపుణులను ఆకట్టుకోవడానికి కొత్త "K వీసా" ని ప్రకటించింది. ఈ K వీసా సాధారణ 12 వీసాల కంటే చాలా సౌకర్యవంతం. ఒక్కసారికే పరిమితి కాకుండా, మల్టిపుల్ ఎంట్రీస్, ఎక్కువ కాలం చెల్లుబాటు అయ్యే వీసా, దేశంలో ఎక్కువ కాలం ఉండే అవకాశం వంటి ఫీచర్స్ ఉన్నాయి. అంటే, చైనాలో యువత, నిపుణులు సులభంగా పని చేయవచ్చు, చదువుకోవచ్చు, వ్యాపారం చేయవచ్చు, లేదా ప్రాజెక్ట్‌లలో కూడా పాల్గొనవచ్చు.
చైనా ప్రభుత్వం ప్రవేశ నియమాలను సవరిస్తూ అక్టోబర్ 1 నుండి కొత్తవి అమలు చేయనుంది. ప్రీమియర్ లీ క్వాంగ్ సంతకం చేసిన స్టేట్ కౌన్సిల్ ద్వారా ఇది అధికారికమయ్యింది.

చైనా కొత్త K వీసా చాలా ప్రత్యేకమైన సౌలభ్యాలను అందిస్తుంది. సాధారణ వీసాల కంటే ఎక్కువ సౌలభ్యం ఉన్నందున, ఎన్నిసార్లైనా వీసా హోల్డర్లు చైనా ప్రవేశించవచ్చు మరియు ఎక్కువ కాలం అక్కడ ఉండొచ్చు కూడా. ఈ వీసా ద్వారా వారు అకాడమిక్, శాస్త్ర, సాంకేతిక, సాంస్కృతిక, వ్యాపార, ఎంట్రప్రెన్యూర్షిప్ కార్యక్రమాలలో సులభంగా పాల్గొనగలరు. వయసు, విద్యార్హత, పని అనుభవం వంటి కొన్ని పరిమితులు తప్ప, స్థానిక కంపెనీ లేదా సంస్థ నుంచి ఆహ్వానం అవసరం లేదు, యువ నిపుణులు, స్టూడెంట్స్, ఎంట్రప్రెన్యూర్స్ స్వేచ్ఛగా తమ ప్రాజెక్టులు, చదువు, పని కార్యక్రమాలను కొనసాగించవచ్చు. అంతే కాకుండా, ఈ వీసా అప్లికేషన్ ప్రాసెస్ కూడా చాలా సులభం మరియు వేగవంతంగా ఉంటుంది, కాబట్టి చైనా వెళ్లి కొత్త అవకాశాలను అన్వేషించడం చాలా సులభం అవుతుంది ఇప్పుడూ.
చైనా మంత్రిత్వ శాఖ తెలిపినట్లు, K వీసా చైనా దేశీయ వృద్ధికి మాత్రమే కాక, గ్లోబల్ టాలెంట్ కూడా అవసరం. అంటే, ఇతర దేశాల నుండి ప్రతిభావంతులైన నిపుణులు, యువత, సాంకేతిక నైపుణ్యాలు అందరు చైనా ఆర్ధిక, సాంకేతిక, సాంస్కృతిక రంగాల్లో ఉపయోగపడతారు. ఇది దేశ అభివృద్ధికి చాలా ముఖ్యం. అందుకే చైనా K వీసాను ప్రవేశపెట్టింది. దీని ద్వారా చైనా అవసరమైన టాలెంట్‌ను స్వయంగా ఆకర్షిస్తూ, ఆ నిపుణుల కోసం అవకాశాలను కూడా సృష్టిస్తోంది. దీనివల్ల చైనా రెండు విధాలుగా లాభపడుతుంది గ్లోబల్ నైపుణ్యాలను పొందడం మరియు ఆ నైపుణ్యాలను ఉపయోగించి దేశ వృద్ధిని వేగవంతం చేయడం.
నిన్నటి నుండి FY2026 H-1B వీసా కోసం $100,000 ఫీజు మొదలయ్యింది. ట్రంప్ ఈ ఫీజు ద్వారా అమెరికా ఉద్యోగాలను రక్షించడమే లక్ష్యమని చెప్పారు. అదనంగా, ట్రంప్ గోల్డ్ కార్డ్ వీసా ద్వారా $1 మిలియన్ చెల్లిస్తే, అమెరికా రిజిడెన్సీ పొందవచ్చు. ఇది ఒక పెద్ద సిగ్నల్ ట్రంప్ H-1B ఫీజు పెంచడంతో యువ నిపుణులు కొత్త మార్గాలను చూడాల్సి వస్తుంది. చైనా K వీసా వంటి సౌకర్యాలు యువతకు సులభంగా మరియు స్వతంత్రంగా పని, అధ్యయనం, వ్యాపార అవకాశాలను ఇస్తున్నాయి. అంటే, ఇప్పుడు ఉద్యోగనిపుణుల కోసం అంతర్జాతీయ స్థాయిలో కొత్త అవకాశాలు తెరచుకోబడుతున్నాయ్ అన్నమాట.
More From GoodReturns

Trading: యుద్ధం మీద బెట్టింగ్.. గంటల్లోనే లక్షాధికారులు! అసలేం జరిగిందంటే..

Iran war: హోర్ముజ్ జలసంధిపై కీలక నిర్ణయం.. ఊపిరి పీల్చుకోనున్న ఆయిల్ మార్కెట్!

ఈ రోజు రాత్రి ఇరాన్ శ్మశానంగా మారుతుంది.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు.. ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఆందోళన..

Gold silver: బంగారం, వెండి కొనాలా? వద్దా? మార్కెట్లో వింత పరిస్థితి.. నిపుణుల సలహా ఇదే!

ప్రపంచం ముప్పు ముంగిట్లో ఉంది.. ఈ మూడు ఆస్తులు తప్ప మిమ్మల్ని ఏవీ కాపాడలేవంటున్న కియోసాకి..

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

6 వేల డాలర్ల మార్క్ దాటబోతున్న బంగారం ధర.. డాలర్ విలువ ఖేల్ ఖతం.. ప్రపంచ రారాజుగా పసిడి..



Click it and Unblock the Notifications