Gold Price Today: ప్రపంచ మార్కెట్లలో పసిడి ధర ఎన్నడూ లేని విధంగా ఔన్సుకు 2,400 డాలర్ల మార్కును ఈ ఏడాది దాటేసింది. దీంతో ప్రధానంగా భారతీయ పసిడి ప్రియుల్లో ఆందోళనలు నెలకొన్నాయి. అసలు బంగారం అనే మాట పలకాలంటేనే చాలా మంది వణికిపోతున్నారు.
వాస్తవానికి ఈ భారీ ధరల పెరుగుదలకు చైనా కారణంగా వెల్లడైంది. ప్రపంచంలో చైనా బంగారం అతిపెద్ద ఉత్పత్తిదారుతో పాటు వినియోగదారుగా ఉన్న సంగతి తెలిసిందే. మధ్య ప్రాశ్చంలో దిగజారుతున్న పరిస్థితులతో పాటు అమెరికా ఫెడ్ వడ్డీ రేట్లను తగ్గించాలనుకోవటం పసిడి ధరలను తీవ్రంగా ప్రభావితం చేస్తోంది. అయితే ఇక్కడ పసిడి ధరల ర్యాలీ కొనసాగటానికి నిరంతరం చైనా నుంచి పెరుగుతున్న కొనుగోళ్లుగా వెల్లడైంది. సెంట్రల్ బ్యాంకుల నుంచి రిటైలర్ల వరకు అందరూ అనిశ్చితి కాలాల్లో తమ సంపదను కాపాడుకోవటం కోసం బంగారంలో ఇన్వెస్ట్ చేస్తారని మానందరికీ తెలిసిందే.

ప్రపంచంలోనే గోల్డ్ అతిపెద్ద కొనుగోలుదారు అనే టైటిల్‌పై చైనా, భారత్ సాధారణంగా పోటీ పడ్డాయి. కానీ గత సంవత్సరం చైనాలో నగలు, బార్లు, నాణేల వినియోగం రికార్డు స్థాయికి పెరగడంతో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. చైనాలో బంగారు ఆభరణాల డిమాండ్ 10 శాతం పెరగగా.. ఇండియాలో ఇది 6 శాతంగా ఉంది. చైనాలో పెట్టుబడుల కోసం గోల్డ్ కొనుగోలు ఏకంగా 28 శాతం పెరిగింది. ఇంకా డిమాండ్ పెరగడానికి ఇంకా స్థలం ఉందని హాంకాంగ్‌కు చెందిన కన్సల్టెంట్ ప్రెషియస్ మెటల్స్ ఇన్‌సైట్స్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ ఫిలిప్ క్లాప్‌విజ్క్ అన్నారు. చైనా రియల్టీ రంగం కుప్పకూలటంతో చాలా మంది చైనీయుల దృష్టి పసిడిపై పడింది.
వాస్తవానికి చైనాలో బంగారం గనులు ఉన్నప్పటికీ.. గడచిన రెండేళ్లుగా విదేశాల నుంచి 2,800 టన్నుల గోల్డ్ దిగుమతి చేసుకుంది. పీపుల్స్ బ్యాంక్ ఆఫ్ చైనా వరుసగా 17 నెలల పాటు కొనుగోళ్ల జోరును కొనసాగిస్తోంది. ఇది తన నిల్వలను డాలర్‌కు దూరంగా ఉంచడంతోపాటు కరెన్సీ తరుగుదల నుంచి రక్షణ కల్పించాలని చూస్తున్నందున కొనుగోళ్లు ఎక్కువ కాలం కొనసాగాయి. వాస్తవానికి చైనాలోని ప్రజలు ధరలు తగ్గినప్పుడు మాత్రమే గోల్డ్ కొంటుంటారు. అయితే ఈ సారి మాత్రం అధిక ధరలు కొనసాగుతున్నప్పటికీ వారు ఎక్కువగా కొనుగోళ్లకు దిగటంతో ప్రపంచ వ్యాప్తంగా పసిడి ధరల ర్యాలీ కొనసాగుతోంది. గోల్డ్ ధరల ర్యాలీపై ఇన్వెస్టర్లు జాగ్రత్తగా ఉండాలని చైనాలో అధికారులు ఇన్వెస్టర్లను హెచ్చరిస్తున్నారు.
More From GoodReturns

Gold rates: బంగారం ధరలకు మళ్ళీ రెక్కలు! తెలుగు రాష్ట్రాల్లో నేటి ధరలివే..

6 వేల డాలర్ల మార్క్ దాటబోతున్న బంగారం ధర.. డాలర్ విలువ ఖేల్ ఖతం.. ప్రపంచ రారాజుగా పసిడి..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు పసిడి రేటు ఎంత వరకు తగ్గిందంటే.. ఏప్రిల్ 13, సోమవారం ధరలు ఇవే..

బెంగళూరులో రూ. 5 వేలకే రూమ్..ఈ ఏరియాలోకి రమ్మని పిలుస్తున్న ఇంటి ఓనర్లు..

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

విజయవాడ నుంచి హైదరాబాద్‌కు గంటే ప్రయాణం.. 220 కి.మీ స్పీడ్‌తో కొత్త రైలు.. వందే భారత్ కన్నా ఫాస్ట్..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

కుప్పకూలిన బంగారం ధరలు.. భారీ తగ్గుదలతో ఈ రోజు పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 9, గురువారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications