బంగారం ధరలను విపరీతంగా పెంచేందుకు చైనా సరికొత్త వ్యూహాలను పన్నుతోంది. అమెరికా డాలర్ ఆధిపత్యాన్ని సవాల్ చేసే విధంగా డ్రాగన్ కంట్రీ దూకుడు చర్యలు ప్రారంభించింది. గ్లోబల్ మార్కెట్లో పసిడి ధరలు ఎగబాకుతున్నాయంటే అది చైనా తీసుకుంటున్న చర్యల వల్లనేనని ఖచ్చితంగా చెప్పవచ్చు. ప్రపంచ దేశాలకు షాకిస్తూ పొరుగుదేశం చైనా పసిడి నిల్వలను భారీగా పెంచుకుంటూ పోతోంది. చైనా కేంద్ర బ్యాంకు భారీగా పసిడిని కొనుగోలు చేయడంతో ప్రపంచ వ్యాప్తంగా అస్థిర పరిస్థితులు ఏర్పడుతున్నాయి. దీని వల్ల బంగారం ధరలు ఓ పద్దతి పాడూ లేకుండా పెరుగుతున్నాయి.
ఇటీవలి వారాల్లో అంతర్జాతీయ బంగారం మార్కెట్ తీవ్ర ఒడిదుడుకులకు లోనవడానికి కారణం ఈ పరిస్థితులే. చైనాలో జరుగుతున్న అధిక ఊహాజనిత (speculative) ట్రేడింగ్ కార్యకలాపాలు మారడమే ప్రధాన కారణమని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. అమెరికా ట్రెజరీ కార్యదర్శి Scott Bessent కూడా ఈ పరిణామాలపై స్పందిస్తూ.. గ్లోబల్ గోల్డ్ మార్కెట్‌లో పెరుగుతున్న అస్థిరతకు అనియంత్రిత చైనా ట్రేడింగ్ చర్యలే కారణమని వ్యాఖ్యానించారు.

జనవరి 29న ఔన్సుకు Gold ధర రికార్డు స్థాయిలో 5,594 డాలర్లకు చేరింది. అయితే, మరుసటి రోజే దాదాపు 10 శాతం మేర పతనం నమోదైంది. ఇది గత దశాబ్దాల్లో ఒక్కరోజులో చోటుచేసుకున్న అతిపెద్ద తగ్గుదలల్లో ఒకటిగా నిలిచింది. అప్పటి నుంచి Gold ధరలు 5 వేల డాలర్ల స్థాయి పైన స్థిరంగా నిలబడటానికి తీవ్రంగా ఇబ్బంది పడుతున్నాయి. అమెరికా వడ్డీ రేట్లపై అంచనాలు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు వంటి అంశాలు బంగారానికి మద్దతుగా ఉన్నప్పటికీ, ధరల కదలికల్లో చైనా పెట్టుబడిదారుల పాత్ర అసమానంగా పెరిగిందనే అభిప్రాయం బలపడుతోంది.
ఫాక్స్ న్యూస్ కార్యక్రమంలో మాట్లాడుతూబెస్సెంట్.. చైనాలో బంగారం ట్రేడింగ్ పరిస్థితులు నియంత్రణ తప్పుతున్నాయని పేర్కొన్నారు. మార్జిన్ అవసరాలను పదే పదే కఠినతరం చేయాల్సి వస్తోందని, బంగారం ఒక క్లాసిక్ స్పెక్యులేటివ్ షాక్ గా మారిందని ఆయన వ్యాఖ్యానించారు. విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం.. బంగారం ఫ్యూచర్స్ మరియు ఎక్స్ఛేంజ్-ట్రేడెడ్ ఫండ్స్ (ETFలు)లో ట్రేడింగ్ గణనీయంగా పెరగడం, అధిక లివరేజ్ వినియోగం ధరల అస్థిరతకు దారితీస్తోంది.
MKS పాంప్‌కు చెందిన పరిశోధన విభాగాధిపతి నిక్కీ షీల్స్ CNBCతో మాట్లాడుతూ.. ఇటీవలి బంగారం ధరల కదలికలకు చైనా ప్రధాన చోదక శక్తిగా మారిందని చెప్పారు. రిటైల్ పెట్టుబడిదారులు, సంస్థాగత పెట్టుబడిదారులు భౌతిక బంగారం, ETFలు, ఫ్యూచర్స్‌ల మిశ్రమం ద్వారా ఊహాజనిత పెట్టుబడులు పెంచుతున్నారని ఆమె వివరించారు.
Capital Economics గణాంకాల ప్రకారం.. 2025 ప్రారంభం నుంచి చైనా బంగారం-ఆధారిత ETF హోల్డింగ్స్ రెట్టింపుకంటే ఎక్కువగా పెరిగాయి. అదే సమయంలో ఫ్యూచర్స్ ట్రేడింగ్ కార్యకలాపాలు కూడా భారీగా పెరిగాయి. క్యాపిటల్ ఎకనామిక్స్ ఆర్థికవేత్త హమద్ హుస్సేన్ మాట్లాడుతూ.. బంగారంతో అనుసంధానమైన ఆర్థిక ఉత్పత్తులకు చైనాలో పెరుగుతున్న ప్రాప్యతే ఈ అస్థిరతకు కారణమని అన్నారు. లివరేజ్ వినియోగం పెరగడం వల్ల ధరల ఊగిసలాట మరింత తీవ్రమవుతోందని ఆయన హెచ్చరించారు.
వరల్డ్ గోల్డ్ కౌన్సిల్‌లో APAC మాజీ పరిశోధనాధిపతి రే జియా ప్రకారం.. Shanghai Futures Exchangeలో ట్రేడింగ్ వాల్యూమ్‌లు గణనీయంగా పెరిగాయి. ఈ ఏడాది సగటు రోజువారీ వాల్యూమ్‌లు 540 టన్నులకు చేరుకున్నాయి. అధిక ఊహాగానాలను అరికట్టేందుకు చైనా నియంత్రణ సంస్థలు మార్జిన్ అవసరాలను పెంచుతూ చర్యలు తీసుకుంటున్నాయి.
ఈ మార్పుల వెనుక చైనా పెట్టుబడిదారుల నిర్మాణాత్మక ఆందోళనలు కూడా ఉన్నాయి. ANZ Research కు చెందిన సీనియర్ వ్యూహకర్త జావోపెంగ్ జింగ్ ప్రకారం.. రియల్ ఎస్టేట్ ధరలు పడిపోవడం, డిపాజిట్ రేట్లు కనిష్ట స్థాయిలో ఉండటం వల్ల బంగారం ఆకర్షణీయమైన ప్రత్యామ్నాయంగా మారింది. ప్రస్తుతం చైనా గృహ ఆస్తుల్లో బంగారం వాటా సుమారు 1 శాతం ఉన్నప్పటికీ, ఇది భవిష్యత్తులో 5 శాతానికి పెరిగే అవకాశం ఉందని ఆయన అంచనా వేశారు.
ఇదే సమయంలో బంగారం వైపు మళ్లడం చైనా ప్రభుత్వానికి కూడా వ్యూహాత్మక ఎంపికగా మారింది. People's Bank of China గత 15 నెలలుగా వరుసగా బంగారు నిల్వలను పెంచుతూ, మొత్తం హోల్డింగ్స్‌ను దాదాపు 2,300 టన్నులకు తీసుకువచ్చింది. మరోవైపు చైనా US ట్రెజరీ హోల్డింగ్స్ తగ్గుతూ రావడం డీ-డాలరైజేషన్ దిశగా స్పష్టమైన సంకేతంగా కనిపిస్తోంది.
క్లుప్తంగా చెప్పాలంటే బంగారం సంప్రదాయంగా సురక్షిత స్వర్గధామ ఆస్తిగా భావించబడినప్పటికీ.. చైనాలో పెరుగుతున్న ఊహాజనిత ట్రేడింగ్ దాన్ని ఒక ప్రమాదకరమైన ఆటగా మారుస్తోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ ధోరణి కొనసాగితే, గ్లోబల్ గోల్డ్ మార్కెట్‌లో మరింత తీవ్రమైన అస్థిరతను చూడాల్సి రావచ్చని విశ్లేషకులు అంటున్నారు.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.
More From GoodReturns

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఇరాన్ యుద్ధాన్ని బంగారంపై అస్త్రంగా వాడుకుంటున్న చైనా.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పునాదులపై భారీ స్కెచ్..

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

10 వేల డాలర్లకు బంగారం ధర.. షాకింగ్ అంచనాలను విడుదల చేసిన యార్డెని రీసెర్చ్..

భారీగా పెరిగిన బంగారం ధరలు.. ఈ రోజు పెరుగుదలతో ఎంతకు చేరిందంటే.. మార్చి 25, బుధవారం ధరలు ఇవే..

బంగారం ధరలు ఈ స్థాయి వద్దకు దిగబోతున్నాయి.. కొనుగోలుపై కీలక నిర్ణయం తీసుకోమంటున్న ఆర్థిక నిపుణులు

కుప్పకూలిన బంగారం ధర.. 10 గ్రాములు ఏకంగా రూ. 5 వేలకు పైగా ఢమాల్.. కొనుగోలుపై నిపుణులు కీలక సూచన

కుప్పకూలిన బంగారం, వెండి ధరలు .. గంటల వ్యవధిలో 2 ట్రిలియన్ డాలర్లు ఆవిరి.. కారణం ఏంటంటే..

Today Gold Silver Rate Live: బంగారం ధరలు భారీగా పతనం.. పెట్టుబడిదారుల్లో తీవ్ర ఆందోళన.. సామాన్యులకు ఊరట

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంతకు పడిపోయిందంటే.. మార్చి 23, సోమవారం ధరలు ఇవే..

బంగారం, వెండి ధరలు ఢమాల్.. గ్యాస్ ధరలు హడల్.. గ్లోబల్ మార్కెట్లో అసలేమి జరుగుతోంది..



Click it and Unblock the Notifications